తెలంగాణలో సోమవారం సెలవు.. ఎందుకంటే?

 

తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ సందర్బంగా ఈ నెల 21న సోమవారం రాష్ట్ర ప్రభుత్వం  పబ్లిక్ హాలీడేగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆది, సోమవారం  విద్యార్థులకు సెలవులు రానున్నాయి. మొత్తంగా సోమవారం ప్రభుత్వ కార్యాలయాలు బంద్ కానున్నాయి. మరోవైపు ఆదివారం, సోమవారం సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో వైన్స్‌లు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆషాడం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మహా నగరం హైదరాబాద్ లో ఇప్పటికే బోనాల పండుగ చివరి దశకు చేరుకుంది. అయితే ఆదివారం ఆషాడ మాసంలో చివరి బోనాల పండుగ పూర్తవుతుంది. దీంతో సోమవారం రోజు తెలంగాణ ప్రభుత్వం అధికారిక బోనాల పండుగ సెలవును ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu