గుర్రాల కళ్లకు అద్దాలు, కాళ్లకు కవచాలు.. శక్తిమాన్ లా కాకుండా

 

బీజేపీ ఎమ్మెల్యే గణేశ్‌జోషీ శక్తిమాన్ అనే గుర్రంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాని కాలు విరిగిపోగా వైద్యులు దానికి ప్లాస్టిక్ కాలును అమర్చిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు యూపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఇకమీదట ఏ గుర్రానికి ఇలాంటి హాని కలుగకుండా ఉండేందుకు.. రక్షణ కవచాలు. గుర్రాల కళ్లకు అద్దాలు, కాళ్లకు కవచాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు డీజీపీ జావీద్ అహ్మద్ వెల్లడించారు. ఐతే ఈ కవచాలు అన్నిగుర్రాలకి వర్తించవట. శిక్షణ, క్రీడల్లో పాల్గొనే గుర్రాలకు ఈ కవచాలు ఉండవని స్పష్టంచేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu