గుజరాత్‌లో అన్ని స్థానాలూ బీజేపీవే

 

 

 

నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో ఉన్న మొత్తం 26 పార్లమెంట్ స్థానాలలో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. దేశమంతా మోడీ జపం చేస్తుంటే, గుజరాత్ కూడా తన బిడ్డను ఈ రకంగా ఆశీర్వదించింది. తమ రాష్ట్రం నుంచి దేశానికి ప్రధాని కాబోతున్న నరేంద్రమోడీకి గుజరాత్ ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒక రాష్ట్రంలో ఒకే పార్టీ విజయం సాధించడం అనే అరుదైన సంఘటన ఈ ఎన్నికలలో గుజరాత్‌లో జరిగింది.