దగ్గరికి రావడం లేదని..భార్యపై బొద్దింకలు
posted on Jan 20, 2017 4:04PM

భార్య తనతో సన్నిహితంగా ఉండటం లేదనే కోపంతో ఆమెని బొద్దింకలతో భయపెట్టిన ఓ శాడిస్ట్ భర్త బాగోతం దేశ ఐటీ రాజధాని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. నగరంలోని బన్నేరుఘట్టకు చెందిన అవినాశ్ శర్మ పదేళ్ల క్రితం తనతో పాటు చదువుకున్న అమ్మాయిని ప్రేమ వివాహం చేసకున్నాడు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలం సజావుగానే సాగిన వీరి సంసారంలో ఓ చిచ్చు రేగింది. అవినాశ్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు గుర్తించిన భార్య అతనిని నిలదీసింది. అప్పటి నుంచి అవినాశ్‌ను దగ్గరికి రానిచ్చేది కాదు..దీంతో ఆమెకు నరకాన్ని చూపిస్తున్నాడు..
బొద్దింకలంటే ఆమెకు భయమని తెలుసుకున్న అవినాశ్ తరచూ ఆమెపైకి బొద్దింకలు వదులుతూ బలవంతంగా శృంగారంలో పాల్గొనేవాడు..ఇన్నాళ్లు పిల్లల కోసం అతని వేధింపులు భరించిన భార్య ఇక తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళా పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. మహిళా పోలీసుల విచారణలో తనకు శృంగారంలో సహకరించకపోవడంతోనే ఆమెపైకి బొద్దింకలు వదిలానని చేసిన తప్పును ఒప్పుకున్నాడు. నిందితుడు అవినాశ్‌ని కోర్టులో హాజరుపరచి, రిమాండ్‌కు తరలించారు పోలీసులు.