బాలకృష్ణ పోటీపై అనుమానాలు!

Publish Date:Apr 9, 2014

 

 

 

తాను హిందూపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ ప్రకటించారు. ‘లెజెండ్’ విజయ యాత్ర సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. విజయ యాత్ర ముగించుకున్న తర్వాత బావ (చంద్రబాబు)తో మాట్లాడి రంగంలోకి దిగుతానని బాలకృష్ణ చెప్పారు. అయితే ఈసారి ఎన్నికలలో పోటీచేయాలన్న ఉత్సాహం బాలకృష్ణలో అయితే కనిపిస్తోంది గానీ, ఈ విషయంలో చంద్రబాబుకు అంత ఆసక్తి వున్నట్టు కనిపించడం లేదు.

 

సీమాంధ్ర తెలుగుదేశం అభ్యర్థుల మొదటి లిస్టు విడుదల సందర్భంగా బాలకృష్ణ పోటీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబులో ముఖంలో బాలకృష్ణ పోటీ చేయడం మీద ఆసక్తి ఉన్నట్టు కనిపించలేదు. బాలకృష్ణ పోటీ చేసే విషయంలో ఆయనతో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు. అలాగే బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది చర్చించి నిర్ణయిస్తామని అన్నారు.ఒకవైపు బాలకృష్ణ హిందూపూర్ నుంచి పోటీ చేస్తానని చెబితే, చంద్రబాబు ఇంకా చర్చించాలని అనడం వెనుక ఏదో అంతరార్థం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలకృష్ణ పోటీ చేయకపోవడమే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.

By
en-us Political News