అక్టోబర్ 23న బాహుబలి విడుదల

 

"బాహుబలి" చిత్రం విడుదల అవ్వాలంటే దాదాపు రెండు సంవత్సరాలు పట్టేట్లుగా ఉంది. అందుకే ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచేందుకు దర్శకుడు రాజమౌళి కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టాడు."బాహుబలి" చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోలను విడుదల చేయడానికి రాజమౌళి అనుకుంటున్నాడట. అయితే ఇందులో భాగంగానే తొలి మేకింగ్ వీడియోను ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.