ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: అసద్
posted on Apr 9, 2015 5:18PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం మతపెద్దలు గురువారం భేటీ అయ్యారు. వరంగల్ - నల్గొండ జిల్లాల సరిహద్దులో తీవ్రవాది వికారుద్దీన్ ముఠా ఎన్‌కౌంటర్ మీద విచారణ జరిపించాలని ఈ సందర్భంగా వారు కేసీఆర్‌కి విజ్ఞప్తి చేశారు. పోలీసులను తీవ్రవాదులు కాల్చి చంపడాన్ని అసదుద్దీన్ తీవ్రంగా ఖండించారు. వికారుద్దీన్ బృందం ఎన్‌కౌంటర్ బూటకమేనని, సంకెళ్ళతో వున్న వికారుద్దీన్ బృందం తుపాకీ ఎలా వాడతారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని అసదుద్దీన్, ముస్లిం పెద్దలు సీఎంని కోరారు. ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో బాధిత పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని వారు కేసీఆర్ని కోరారు.