ఏపీ సచివాలయ నిర్మాణ పనుల్లో మరో కార్మికుడి దుర్మరణం...

గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న ఓ కార్మికుడు కాంక్రీట్ మిక్సర్‌లో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన దేవేందర్‌గా గుర్తించారు. తోటి కార్మికులు స్పందించేలోగానే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దేవేందర్ రెండు రోజుల క్రితమే పనుల్లో చేరినట్టు తెలుస్తోంది. గత నెలలో కూడా ఇలాగే జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులు మరణించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu