సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే భాష ఇదా?

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ని ‘సన్నాసి’ అని సంబోధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు ఛైర్మన్ గురించి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉపయోగించాల్సిన భాష ఇదేనా అని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణా బోర్డు ఛైర్మన్‌ని దూషించడం సీఎం స్థాయి వ్యక్తికి తగదని, కేసీఆర్ భాషను సభ్య సమాజం అంగీకరించదని ఆయన అన్నారు. ‘‘16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌లో వున్నా రైతుల రుణ మాఫీ చేయలేకపోయారు. పొరుగు రాష్ట్రాలకు నీరు ఇచ్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏనాడూ మాట్లాడలేదు. భౌగోళికంగా విడిపోయినా తెలుగువారంతా ఒక తల్లి బిడ్డలే. కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు ఇవ్వాలని కోరుకుంటాము. నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయల్ సాగర్ నీటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. నాగార్జున సాగర్ నుంచి 80.65 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 7 టీఎంసీల నీరు వాడుకున్నారు. ఇప్పుడు పంతాలకు పోయి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. చట్టాలను గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని ఉమా మహేశ్వరరావు అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu