రాజధాని భూమ్.. పెరిగిన ట్యాక్స్..

ఆంధ్రరాష్ట్ర నూతన రాజధానికి నిర్మాణానికి శంకస్థాపన ఒక్కటే జరిగింది... ఇంకా నిర్మాణం ప్రారంభం కూడా కాలేదు. కానీ అప్పుడే నూతన రాజధాని ప్రభావం వల్ల విజయవాడ నగరంలో ట్యాక్స్ 19 లక్షలకు పెరిగింది. గడిచిన రెండు నెలల్లోనే ఏపీ ప్రభుత్వం 19 లక్షల ట్యాక్స్ ను పొందగా అందులో విజయవాడ మొదటి డివిజన్ నుండి 12.4 లక్షల ట్యాక్స్ రాగా విజయవాడ రెండవ డివిజన్ నుండి 6.69 లక్షల ట్యాక్స్ వచ్చినట్టు అధికారులు తెలుపుతున్నారు. అది కూడా ఎక్కువ మంది వీఐపీ లు రాజధానికి చూడటానికి వచ్చి వెళుతున్న నేపథ్యంలో అంతేకాక కొద్ది మంది మంత్రులు మాత్రమే తమ నివాసాలను మార్చుకోవడం వల్ల ట్యాక్స్ ఇంత పెరిగిందని తెలుస్తోంది. కొద్ది మంత్రులు వస్తేనే ఇంత ట్యాక్య్ పెరిగిందంటే ఇంకా సీఎం కార్యలయ్యాన్ని విజయవాడకు మార్చుకొని అక్కడి నుండే విధులు నిర్వహిస్తే ఈ ట్యాక్స్ విలువ కోటి 19 లక్షలు పెరుగుతుందనడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదు.

 

మరోవైపు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కనుక ప్రారంభమైతే అక్కడ ట్యాక్స్ 4.39 కోట్లు వచ్చే అవకాశం ఉందని.. భవిష్యత్ లో అది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. అలాకనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ కు ఉన్న లోటు బడ్జెట్ కు కొంత వరకు ఊరట కలిగించినట్టే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu