ఆంధ్రులకు తెలుగు సరిగ్గా రాదా?
posted on Jun 21, 2012 11:05AM
ఎక్కడో విదేశాల్లో ఉన్న ఆంధ్రుల పిల్లలకు తెలుగుభాశాల్లో తప్పులుదొర్లితే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ, అచ్చమైన ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టి తెలుగు రాదంటే ఊరుకోగలమా? ఇది క్షమించరాని నేరమని గొంతెత్తి అరుస్తాం. అటువంటిది ఇటీవల పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత పరిశేలిస్తే తప్పినవరిలో ఎక్కువమంది తెలుగుభాష పరీక్షలోనే తప్పుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ఫలితాలు ఈ ఏడాదే విడుదలయ్యాయి. ఈ ఫలితాలు చూస్తే ఆంధ్రులకు తెలుగురాదా అనే కొత్త ప్రశ్న వేసుకునే పరిస్థితి దాపురించింది. దీనికి తాజా ఉదాహరణగా కడపజిల్లాలో ఫలితాలు పరిశేలిస్తే ఈ జిల్లా 0.28 శాతం తగ్గటం వల్ల ఉత్తీర్ణతలో రెండోస్థానంకు చేరుకుంది. కడపజిల్లా ఉత్తీర్ణతాశాతం 93.10. మొత్తం 33,157 మంది పరీక్షలు రాస్తే వారిలో 30,870 మంది ఉత్తీర్ణత చెందారు. ఫయిలైన వారిలో ఎక్కువమంది తెలుగులోనే తప్పారు. హిందీలో 667, ఇంగ్లీషులో 1431, లెక్కలలో 1176, సైన్స్ లో 1312, సోషల్ లో 1559 మంది ఫెయిల్ అయ్యారు. ఒక్క తెలుగులోనే 2384 మంది ఫాయిల్ అయ్యారు. దీన్ని బట్టి తెలుగుఉపాధ్యాయులను మార్చాలా? తల్లిదండ్రులు తమ పిల్లల తెలుగు పరిస్థితి తెలుసుకోవాలా? ఏది కరెక్టు అనే అంశంపై ఆ జిల్లా విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది.