సీయం క్యాంప్ కార్యాలయ ప్రారంభోత్సవం వాయిదా

 

ఆంద్రప్రదేశ్ రాజధాని భూమి పూజ అనంతరం ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం చేయవలసి ఉంది. ఉదయం 11 గంటల లోపు క్యాంప్ కార్యాలయం ప్రారంభించాలని ముహూర్తం నిశ్చయించుకొని అందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసేసారు. కానీ రాజధానికి భూమిపూజ నిర్వహించిన తరువాత చిన్న బహిరంగ సభ కూడా జరిగినందున అక్కడే ఆలస్యం అయిపోవడంతో క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. మళ్ళీ ఎల్లుండి అంటే సోమవారం నాడు ప్రారంభోత్సవం చేయబోతున్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu