జగన్ కు ఆనం ఝలక్... జనసేన వైపు చూపు...


ఒకప్పుడు పార్టీ మారాలంటే టీడీపీ నేతులు  వైసీపీ లోకి కాని.. వైసీపీ నేతలు టీడీపీ లోకి కాని జంప్ అయ్యే ఛాన్స్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ రెండు పార్టీలకు తోడు జనసేన పార్టీ కూడా రాబోయే ఎన్నికల రేసులో పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటుంది. దీంతో రాజకీయ నేతలకు మరో ఆప్షన్ తీసుకునే అవకాశం దక్కింది. ఇప్పటికే జనసేన తమ పార్టీలోకి పలువురిని ఆహ్వానిస్తున్న నేపథ్యంలో.. పలు రాజకీయ నేతలు కూడా ఆ పార్టీలోకి వెళితే అవకాశాలు దక్కొచ్చు అన్న నేపథ్యంలో పార్టీ జంప్ అయ్యే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. దీనిలోభాగంగానే నెల్లూరు జిల్లా ఫైర్ బ్రాండ్ ఆనం వివేకానంద రెడ్డి కూడా టీడీపీ పార్టీని వీడి జనసేన వైపు చూస్తున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. నిన్న మొన్నటి వరకూ వైసీపీలోకి చేరుతారు అంటు వచ్చిన వార్తలకు, జగన్ కు ఝలక్ ఇస్తూ ఆనం ఇప్పుడు జనసేన పార్టీ వైపు చూస్తున్నారంట. అంతేకాదు జనసేన పార్టీలోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో త్వరలో భేటీ అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో త్వరలోనే వివేకా సైకిల్ దిగి జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతుంది. మరి ఆనం వివేకా జనసేన లోకి చేరుతారా..? లేక రూట్ మార్చుతారా..? ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu