గాంధీపై అమిత్‌ షా వివాదాస్పద వ్యాఖ్యలు.. గాంధీ ఓ తెలివైన వ్యాపారి

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఓ తెలివైన వ్యాపారి అని.. కాంగ్రెస్ పార్టీ గురించి ముందే ఊహించి... భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఆయన ముందే పసిగట్టారని.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఆయన సూచించారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విలువలు లేవని... ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు, సూత్రాలు లేవని చెప్పారు. స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసమే ఆ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు.

 

మరోవైపు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జాతిపితను, స్వాతంత్ర్య ఉద్యమాన్ని అవమానించడమేనని, ఇందుకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుంది. అయితే అమిత్ షా మాత్రం తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. మరి దీనిపై ఇంకెంత దుమారం రేగుతుందో చూడాలి.