అమరావతి శంకుస్థాపన.. యాంకర్ గా సాయికుమార్
posted on Oct 14, 2015 1:05PM

ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి చేయాల్సిన పనులతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా బిజీ అయిపోయారు. అంతేకాదు శంకుస్థాపన కార్యక్రమానికి ముందు కొన్ని సాంస్కృతికి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమాలకు యాంకర్ గా సాయికుమార్ ను నియమించినట్టు.. దీనికి చంద్రబాబు కూడా ఓకే అన్నట్టు తెలస్తోంది. శివమణి డ్రమ్స్‌తో పాటు ఏపీకి చెందిన కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు కూడా ఇవ్వనున్నారు.
ఇదిలా ఉండగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మొతం మూడు వేదికలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు వేదికలలో మొదటి ప్రధాన వేదిక.. ఆ దిగువున రెండు వేదికలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు15 మంది కీలక వ్యక్తులు ఆసీనులు కానున్నారు. మిగిలిన రెండు వేదికలపై ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖులు ఆసీనులవుతారు.