వ్యాధితో కొందరు.. భయంతో మరికొందరు

ప్రాణాలు హరిస్తున్న కరోనా

ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఈ వ్యాధి పై జరుగుతున్న ప్రచారంతో ఇదో భయంకరమైన రోగంగా భావిస్తూ కరోనా పాజిటివ్ అని తెలియగానే కొందరు భయంతోనే చనిపోతున్నారు.

కరోనా సోకి ఉంటుందని అనుమానించిన మామిడాల రాజా వెంకటరమణ (54) ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన కరోనా భయంతో ప్రాణాలు తీసుకున్నాడు.

కరోనా భయంతో ఎయిర్‌‌‌‌లైన్స్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌‌‌‌కాలనీలో ఎల్లారెడ్డి గూడకు చెందిన నాగేంద్ర (75) ఇండియన్ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌లో పనిచేసి రిటైర్ ‌‌‌‌అయ్యారు. జర్వం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న నాగేంద్రను కుటుంబసభ్యులు బుధవారం చెస్ట్ ‌‌హాస్పిటల్‌‌కి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం శ్రీనగర్‌‌‌‌కాలనీలోని ప్రైవేట్ హాస్పిటల్‌‌లో అడ్మిట్‌‌చేశారు. తనకు కరోనా సోకిందనే భయంతో  హాస్పిటల్ బిల్డింగ్‌‌ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కరోనా వ్యాధి వచ్చిందని తెలిసిన క్షణంలోనే గుండెపోటుతో ఓ రిటైర్డ్ ‌‌ప్రభుత్వ ఉద్యోగి మృతిచెందారు. ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన భాస్కర్‌‌‌‌(65) జ్వరం రాగా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. వరంగల్ వెళ్ళాలని డాక్టర్ సూచించడంతో  వరంగల్ లోని ఎంజీఎంకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్ట్స్ మూడు రోజుల్లో వస్తాయని డాక్టర్లు చెప్పడంతో అక్కడే ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లారు. ఈ నెల 22న సాయంత్రం భాస్కర్‌‌‌‌కు పాజిటివ్ ‌‌వచ్చిందని ట్రీట్మెంట్ కోసం ఎంజీఎం ఆసుపత్రికి రావాలని చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఎంజీఎం తీసుకెళ్ల‌గా పరీక్షించిన డాక్టర్లు చనిపోయినట్లు చెప్పారు.

భయం వద్దు...
తాజా లెక్కలను చూస్తే కరోనా బారిన పడుతున్నవారి కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. రికవరీ రేటు పెరుగుతోంది. మిగతా జబ్బుల మాదిరిగానే ఇది వైరస్ కారణంగా వచ్చే ఒక వ్యాధి మాత్రమే. అయితే ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే ఈ వ్యాధి కారక వైరస్ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కొద్దిగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే రెండు నుంచి మూడు వారాల పాటు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గమనిస్తూ డాక్టర్ సలహాల ప్రకారం మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. భయం అన్నది లేకుండా చికిత్స తీసుకుంటే చాలు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu