ప్రణబ్‌ను ఆహ్వానిస్తున్న రాష్ట్రపతి భవన్‌

పదమూడవ రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ ముఖర్జీకి స్వాగతం పలకడానికి రాష్ట్రపతి భవన్‌ను ముస్తాబు చేస్తున్నారు. నిజానికి ఆనాటి బ్రిటీషు పాలకులు తమ వైస్రాయి నివాసానికి ఈ భవనాన్ని కట్టారు. ఈ భవనం రెండులక్షల చదరపు అడుగుల స్థలంలో కట్టిన నాలుగంతస్తుల నిర్మాణం. 340 గదులున్న భవనమే ఇండియా ప్రధమపౌరుడు నివసించే భవనం .ఇండియా, యూరప్‌ సంస్కృతులు కలగలసిన అపూర్య కట్టణంగా ఇది ప్రసిధ్దికెక్కింది. దీన్ని నిర్మించడానికి. మూడు మిలియన్‌ కూబిక్‌ అడుగుల రాయి దీని నిర్మాణానికి వాడారు.తొలుత దీన్ని 4 సంవత్సరాలలో 4లక్షల పౌండ్లతో నిర్మించాలనుకున్నారు. కాని 17ఏళ్ల సుదీర్ఘ కాలం ఈ నిర్మాణానికి వెచ్చించవలసి వచింది.దానితో పాటే ఖర్చూ 12.4 లక్షల పౌండ్లకు పెరిగింది.ఈ అద్బుత కట్టడానికి 1931లో ప్రారంభోత్సవం జరిగింది. విశేషం ఏమంటే దీన్ని కట్టిన 18 ఏళ్లకు మనకు స్వాతంత్య్రం సిద్దించింది. దీనిలోని ఎల్లో డ్రాయింగ్‌రూమ్‌లో చిన్న ఫంక్షన్లు జరుగుతాయి. అంటే ఆడిటర్‌జనరల్‌, చీఫ్‌ ఎలక్షన్‌ కమీషన్‌ వారి పదవీభాద్యతలు చేపట్టే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.

 

దీని ప్రక్కనే ఉన్న గ్రే డ్రాయింగ్‌రూమ్‌ను ఎల్లో డ్రాయింగ్‌రూమ్‌ లోని అతిధుల సౌకర్యాల కోసం వినియోగిస్తారు. అశోకా హాల్‌ 32 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో హాలు క్రింద భాగం అంతా చెక్కతో ఉంటుంది. పైభాగం అంతా పెయింటిగ్స్‌తో అందంగా అలంకరించబడి ఉంటుంది.ఉత్తర డ్రాయింగ్‌ హాల్‌లో కింగ్‌జార్జి5, క్వీన్‌మేరి నిలువుటెత్తు, బస్ట్‌ సైజు ఫోటోలు ఉంటాయి. సెంట్రల్‌ హాలు ప్రక్కనే బిలియార్డు, బాల్‌రూము, 8 సింహాల నీళ్ల పంపులు దాని క్రింద సింకులతో బిగింపబడిఉంటుంది. దర్బారు హాలులో 2టన్నుల బరువైన షాడ్లియర్స్‌ 33 మీటర్ల పైనుండి వ్రేలాడుతూ ఉంటుంది. ఇక్కడే పద్మ అవార్డులు ఇస్తుంటారు. దీనిలో మరొక ముఖ్యమైన హాలు బ్యాంకెట్‌ హాలు ఒక పెద్ద బోజనపు బల్ల ఎదురుగా కుర్చీలు ఉంటాయి. దీనిలో ఒకే సారి 104 మంది కూర్చొని భోజనం చేయవచ్చు.

 

ఈ హాలులో మాజీ రాష్ట్రపతుల ఫోటోలను వరుసగా ఉంచారు.రాష్ట్రపతి భవనానికి వెనుక పేరు గాంచిన మొఘల్‌ గార్డెన్‌ను చూడవచ్చు .దీనిలో ఉత్తర, దక్షిణభాగంగా విభజించారు. దీనిలోని పూలు మనల్ని కట్టిపడేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వేలాడే ఉద్యానవనాన్నికూడా మనమిక్కడ చూడగలం. అత్యంత సౌందర్యవంతమయిన గులాబీతోట మన మనసులను విహరింపచేస్తాయి. దీనిలో ఉన్న వాటర్‌ఫాల్స్‌ పర్యాటకుల మనసు దోచుకుంటుంది. బోన్సాయ్‌ మొక్కలకు పేరుగాంచింది.దీన్నిమీకు చూడాలని ఉందా అయితే ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ప్రజల సందర్శనం కొరకు తీసి వుంచుతారు. తాజ్‌మహల్‌, కుతూబ్‌మీనార్‌ల తరువాత దీన్ని సందర్శించడానికే ప్రజలు ఇష్టపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu