టీఆర్ఎస్ ప్రచారం: అల్లు అర్జున్‌కి కేసీఆర్ నో?

Publish Date:Apr 10, 2014

 

 

 

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కి పిల్లనిచ్చిన మామ శేఖర్‌రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు వారి వియ్యంకుడు టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచీ అల్లు అర్జున్ మామగారికి ప్రచారం చేస్తాడా చేయడా... అల్లు అర్జున్ ముగ్గురు మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, శేఖర్‌రెడ్డి మధ్యలో ఇరుక్కుపోయాడు.

 

ఇప్పుడేం చేస్తాడో అనే చర్చలు, ఊహాగానాలు గత రెండు రోజులుగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ కూడా ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయాలా వద్దా అనే డైలమాలో వున్నట్టు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్‌కి అంత శ్రమ అవసరం లేకుండా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అల్లు అర్జున్ ప్రచారం అవసరం లేదని శేఖర్‌రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

సీమాంధ్రుడి చేత ప్రచారం చేయించుకుని ఇబ్రహీంపట్నం సీటు గెలవాల్సినంత ఖర్మ టీఆర్ఎస్‌కి పట్టలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు అల్లు అర్జున్ ప్రచారం డైలమాని కేసీఆరే తీర్చేశాడు.

By
en-us Political News