డైలాగ్స్ రచయిత పొన్నాల!

 

 

 

ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దగా బెంగ పెట్టేసుకోకుండా చక్కగా తెలంగాణ సినిమాలకు మాటల రచయితగా సెటిలైపోవచ్చు. పొన్నాల తన రాజకీయ ప్రత్యర్థుల మీద సంధించే మాటలను వింటుంటే పొన్నాల రాజకీయాల కంటే సినిమా మాటల రచయిగా బాగా షైన్ అవుతాడన్న అభిప్రాయం కలుగుతూ వుంటుంది.

 

లేటెస్ట్ గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అడపాదడపా పొన్నాల విసురుతున్న డైలాగ్స్ అదిరిపోతున్నాయి. మొన్నామధ్య కేసీఆర్ని పొన్నాల బుడబుక్కల వాళ్ళతో, పిట్టలదొరతో పోలుస్తూ డైలాగ్స్ కొట్టాడు. అలాగే నిన్నగాక మొన్న సన్నాసుల బాష మాట్లాడే కేసీఆరే అందరికన్నా పెద్ద సన్నాసి అని ఘాటు డైలాగ్ కొట్టాడు. లేటెస్ట్ గా రావణుడికి రంగు వేస్తే రాముడు అవుతాడా అని కేసీఆర్‌ని ఉద్దేశించి సూపర్ డైలాగ్ కొట్టాడు. పొన్నాల డైలాగ్స్ కి కేసీఆర్ తరఫు నుంచి పెద్దగా స్పందన రాకపోయినా, తెలంగాణ సినిమా వర్గాలు మాత్రం పొన్నాలలోని డైలాగ్ రచయితని ఆశగా చూస్తున్నాయి.