రవితేజ 'సారొచ్చారు' ఆడియో ట్రాక్ లిస్ట్

Publish Date:Dec 4, 2012

 

 Ravi Teja's Sarocharu audio , Ravi Teja's Sarocharu audio release, Ravi Teja's Sarocharu audio Track list

 

మాస్ మహరాజ రవితేజ కొత్త సినిమా ‘సారొచ్చారు' ఆడియో సాంగ్స్ రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. రేపు ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ ‘రచ్చ రంబోలా' అనే మసాలా సాంగును కంపోజ్ చేసారు. రవితేజ - దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్ని మంచి మ్యూజికల్ హిట్ అయ్యాయి. ‘సారొచ్చారు' లో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

‘సారొచ్చారు' ఆడియో సాంగ్స్ ట్రాక్ లిస్ట్:

1. మేడ్ ఫర్ ఈచ్ అదర్
2. జగదేక వీరా
3. రచ్చ రంబోలా...
4. గుస గుస
5. కాటుక కళ్లు