భారత సైనికుడిని వదిలిపెట్టిన పాక్...


గత ఏడాది చందు బాబులాల్‌ చౌహాన్‌ భారత సైనికుడు పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆ సైనికుడిని పాకిస్థాన్ గతకొద్ది కాలంగా నిర్భందంలో ఉంచింది. అయితే ఇప్పుడు ఆ సైనికుడిని పాక్‌ ఈ రోజు భారత్‌కు అప్పగించింది. భారత అధికారులకు వాఘా సరిహద్దు వద్ద అప్పగించారు. భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్‌ దాడులు చేసిన సమయంలో చందు బాబులాల్‌ చౌహాన్‌ నియంత్రణ రేఖ దాటి పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి.. పాక్‌కు పట్టుబడ్డాడు. ఉగ్రస్థావరాలపై దాడులు చేసినట్లు భారత్‌ ప్రకటించిన గంటల వ్యవధిలోనే చందును పాక్‌ సైన్యం నిర్బంధించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu