కమల్ జీ ఇకనైనా నోటి దూల తగ్గించుకోండి...
posted on Nov 4, 2017 4:30PM
.jpg)
కమల్ హాసన్ కు బ్యాండ్ బాజా మొదలైంది. ఇంకా రాజకీయాల్లోకి రాకముందే అప్పుడే ఆయన మత రాజకీయాలు మొదలుపెట్టి కాస్త ఎక్కువగా మాట్లాడాడు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందంటూ.. దీన్ని అడ్డుకోవడంలో ఉత్తర భారతదేశంలో బీజేపీ ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. అంతే హిందూ మతాన్ని ఉగ్రవాదంతో పోల్చడంపై.. హిందుత్వ సంస్థలు కమల్ పై మండిపడుతున్నాయి. అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు పండిత్ అశోక్ శర్మ కమల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనకు వంతపాడేవాళ్లని కాల్చిచంపాలని లేదా ఉరి తీయాలన్నారు. హిందూ విశ్వాసాల పట్ల నమ్మకమున్న ప్రతీవారు దీనిపై స్పందించాలని, ఈ పవిత్ర దేశంలో నివశిస్తున్నవారికి ఇలాంటి భావజాలం వుండటానికి వీల్లేదన్నారు. ఇకపై కమల్ నటించే సినిమాలను అభిమానులు బాయ్ కాట్ చేయాలని మరోనేత అభిషేక్ అగర్వాల్ డిమాండ్ చేశారు. మరి ఇంకా రాజకీయాల్లోకి రాకముందే కమల్ కు ఇవన్నీ అవసరమా..ఒక పార్టీ పెట్టలేదు.. ఇంకా పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగు పెట్టలేదు. అప్పుడే తన నోటికి పని చెబుతున్నాడు. అయితే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే బావుంటుంది కానీ.. ఇలా అనవసరంగా ఎక్కువగా మాట్లాడి.. వ్యతిరేక భావం తెచ్చుకోవడం తప్పా ఏం లేదు. ఇలానే మాట్లాడితే.. కమల్ రాజకీయాల్లో ఎక్కువ రోజులు ఉండటం కష్టమే. మరి ఇకనైనా నోటి దూల తగ్గించుకుంటే మంచిది.