నాగ్ 'గ్రీకు వీరుడు' ఆడియో ట్రాక్ లిస్ట్
posted on Apr 1, 2013 6:11PM

కింగ్ అక్కినేని నటిస్తున్న గ్రీకు వీరుడు ఆడియో ఏప్రిల్ 3న హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ సినిమా ఆడియో ట్రాక్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. నాగార్జున ఈ చిత్రంలో ఓ ఎన్నారై బిజినెస్ మేన్ గెటప్ లో కనిపించనున్నారు. నయనతార, మీరా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'గ్రీకువీరుడు' తో నాగ్ న్యూ ట్రెండ్ ని సృష్టిస్తాడని ఆయన అభిమానులు అంటున్నారు. అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఏంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
ఆడియో ట్రాక్ లిస్ట్:
1. ఐ హేట్ లవ్ స్టోరీస్
2. నే విన్నది నిజమేనా..
3. ఓ నాడు వాషింగ్టన్
4. ఈ పరీక్షలో తన్నకు..
5. ఎవ్వరు లేరని..
6. ఓసినా బంగారం..
7. మరో జన్మే...