రాంచీ వన్డే: ఇంగ్లాండ్ 155 ఆలౌట్!

Publish Date:Jan 19, 2013

 

 

 England all out for 155, Ranchi ODI India bowl out England for 155 runs, India invite England to bat

 

 

భారత్ లో జరుగుతున్న మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 42.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. భారత్ ముందు 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో రూట్39, బెల్ 25, బ్రెస్నన్ 25, కుక్ 17, పీటర్సన్ 17, మోర్గాన్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 2, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, షమీ అహ్మద్, రైనా తలో వికెట్ దక్కించుకున్నారు.