పేలుళ్ళ కేసు పై ఎన్ఐఏ దర్యాప్తు

 

 

Dilsukh Nagar Hyderabad Blast, Hyderabad bomb blast, cm kiran kumar reddy sabita indra reddy

 

 

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసును ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ అకాడమికు అప్పగించినట్లు రాష్ట్ర హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కేసు విచారణలో ఎన్ఐఏ అధికారులకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆమె తెలిపారు. భవిష్యత్‌తో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తెలిపారు.


రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా పేలుళ్ల కేసును చేధించాలని సీఎం కోరినట్లు ఆమె తెలిపారు.


కేసు దర్యాప్తు వేగంగా జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సబిత తెలిపారు. ఎన్ఐఏ ఈ పాటికే చురుగ్గా దర్యాప్తు జరుపుతోందని ఆమె పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుగుతున్నందున ఇప్పుడే వివరాలు వెల్లడించలేమని ఆమె అన్నారు. భద్రత విషయంలో ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం లేదని ఆమె పేర్కొన్నారు. జంట నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని సబిత ఇంద్రారెడ్డి స్ఫష్టం చేశారు.