ధూళిపాళ్ళ దీక్ష భగ్నంలో విషాదం

 

 

 

తెలుగు దేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ళ నరేంద్ర పొన్నూరులో నాలుగు రోజులుగా సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేసారు. పార్టీనాయకులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు పైచెయ్యయిన పోలీసులకు నరేంద్రను అక్కడి నుండి తరలించే అవకాశం దొరికింది.

 

నరేంద్రను తరలిస్తున్న సందర్భంలో పోలీసు వాహనం వెనకనే దాన్ని అనుసరిస్తున్న మద్దతుదారుల వాహనం కూడా ముందు వాహనంతో సమానంగా వేగంగా ముందుకు పోతుండగా ఒక లారీని ఢీకొంది.  దానితో అందులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.  ముగ్గురికి గాయాలవగా వారిని హాస్పిటల్ కి చేర్చారు.  ఈ సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బ్రాహ్మణ కోడూరు సమీపంలో జరిగింది.  జరిగిన ప్రమాదాన్ని నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News