వైఎస్ బెస్ట్..జగన్ వేస్ట్

 

      konda surekha, jagan ysr congress, ys rajashekar reddy jagan

 

 

మాజీ మంత్రి కొండా సురేఖ జగన్ పై మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. రక్షాబంధన్ సంధర్బంగా ఆమె మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి విగ్రహానికి రాఖీ కట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి, జగన్ కి చాలా తేడా ఉందని అన్నారు. వైఎస్ ఉన్నప్పుడు తాము ఉన్నత స్థాయిలో ఉంటే, జగన్ కార్యకర్త స్థాయికి దిగజార్చారని ఆమె అనడం విశేషం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలంగానే తెలంగాణ వచ్చిందని, ఆయన పేరిట స్మృతివనం నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు.

 

తెలంగాణ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం మూలంగానే తాను ఆ పార్టీని వీడి బయటకు వచ్చానని, వైఎస్ ను దూషించిన వారు ఆ పార్టీలో చెలామణి అవుతున్నారని, ఆత్మగౌరవం చంపుకోలేక బయటకు వచ్చామని అన్నారు. అయితే వైఎస్ మూలంగా తెలంగాణ వచ్చిందని కొండా సురేఖ అనడం ఆశ్చర్యంగా చింతచచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేమో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu