LATEST NEWS
  బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌తో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.“రేవంత్‌ రెడ్డి ఏనాటికీ కాంగ్రెస్‌ మనిషి కాలేడు. ఆయన లోపల ఉన్నది బీజేపీ ఆలోచనలే. కాంగ్రెస్‌ నేత కాదు… బడే భాయ్‌ తమ్ముడు” అంటూ కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మైనారిటీలు, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రేవంత్‌ రెడ్డి కప్పుకున్న బీజేపీ ముసుగును తొలగించి చూడాలని, ఆయనలో ఉన్న అసలైన బీజేపీ నాయకుడిని గుర్తించాలని పిలుపునిచ్చారు. “అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఓటు వేయాలి అనేది కాంగ్రెస్‌ వాదన అర్థరహితం. గత రెండేళ్లలో వారు ఏం చేశారు? ప్రజలకు ఏమి ఇచ్చారు? అన్నది కాంగ్రెస్‌ నేతలు చెప్పాలి” అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాలను గతంలో మాదిరిగానే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలయ్యాయని భావించే వాళ్లే ఆ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ హయాంలో తెలంగాణలో స్వర్ణయుగం నడిచిందని కేటీఆర్‌ అన్నారు. పేదల కోసం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో ముందుగా కొయ్యగుట్టలో అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్‌ నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌తో కలిసి కొయ్యగుట్ట నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిపై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. “బాన్సువాడ ప్రజలు పోచారంను నమ్మి గెలిపిస్తే ఆయన ఏం చేశాడు?” అని ప్రశ్నించారు. గతంలో సీఎం రేవంత్‌ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఆయన తనయులు దోచుకుంటున్నారని అన్న మాటలను గుర్తుచేశారు. “ఒక ఆంబోతు, రెండు దున్నపోతులు” అంటూ విమర్శించలేదా? అని ప్రశ్నిస్తూ, అలాంటి మాటలు చెప్పిన రేవంత్‌ రెడ్డికే ఇప్పుడు పోచారం వెళ్లి చేరాడని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి గతంలో పోచారంపై చేసిన విమర్శల ఆడియోను ఫోన్‌లో ప్రజలకు వినిపించారు. “పోచారం బండ కట్టుకుని బాయిలో దూకాలె” అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారో పోచారం ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాన్సువాడ ప్రజలు గల్లా పట్టుకుని ఆయనను ప్రశ్నించాలని సూచించారు. “పోచారం బాన్సువాడ సిగ్గు తీసిండు” అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.  
  ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన కీలక ఆదేశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మార్చి 9వ తేదీ నాటికి అన్ని గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది.  ఏప్రిల్ లో సర్పంచుల పదవీకాలం ముగుస్తుండడంతో, వెంటనే ఎన్నికల ప్రక్రియ జరిపేందుకు కసరత్తు ప్రారంభించింది.  2026 జనవరి1ని కటాఫ్‌గా తీసుకుని అసెంబ్లీ  ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఫొటో ఓటర్ కార్డుల జాబితాను సిద్దం చేయలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల పంచాయితీల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చజరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో నిజాల నిగ్గు తేల్చడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలోని సీట్  దర్యాప్తు చేసి నివేదిక సమర్పించింది. ఇప్పుడు ఆ నివేదికపై తెలుగుదేశం, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సిట్ నెయ్యిలో కల్తీని నిర్ధారించడమే కాకుండా, జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని తేల్చింది.   అయితే సిట్ నివేదికను తనకు అనుకూలంగా చెప్పుకుంటూ వైసీపీ రాజకీయం మొదలెట్టింది. కల్తీ నెయ్యి అంశాన్ని పక్కతోవ పట్టించే విధంగా వైసీపీ కొత్త వాదనకు తెరతీసింది. చంద్రబాబు ఆరోపించినట్లుగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనీ,  చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేశారంటూ ఎదురు దాడికి దిగింది.  దీనిపై ప్రస్తుతం ఏపీలో రాజకీయం సెగలు కక్కుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు అవాస్తవాలను చెప్పారంటూ వైసీపీయులు చేస్తున్న ఆరోపణలకు తెలుగుదేశం దీటుగా జవాబిస్తోంది. సరిగ్గా ఈ తరుణంలో విషయం జాతీయ స్థాయి మీడియాలోనూ చర్చ జరుగుతోంది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డూ వ్యవహారంలో వైసీపీ తీరును, జగన్ చేస్తున్న వాదనను నిలదీశారు. తిప్పికొట్టారు. శషబిషలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ వంద శాతం తేల్చిందని కుండబద్దలు కొట్టేశారు. సిట్ నివేదికలోని అంశాలను చదివి మరీ.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని సిట్ దర్యాప్తు తేల్చిందనీ, ఇంత అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా అడ్డగోలు వాదనలేంటంటూ జగన్ ను ఆయన పార్టీ ప్రతినిథులను నిలదీశారు.   మూడు శతాబ్దాలుగా భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి వైసీపీ మహాపాపానికి ఒడిగట్టిందని అర్నాబ్ గోస్వామి నిష్కర్షగా చెప్పారు.  జగన్ హయాంలో అంటే  2019-24 మధ్య కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి ముమ్మాటికీ కల్తీదేనని దర్యాప్తు సంస్థలు సందేహాలకు అతీతంగా తేల్చేశాయన్నారు. అక్కడితో ఆగకుండా, ఆయన జగన్ ను ఆయన విశ్వసించే మతాన్ని ప్రస్తావిస్తూ క్రైస్తువుల సెంటిమెంటుతో  ఇలా ఆడుకోగలరా అని సూటిగా ప్రశ్నించారు.  లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి చేసిన పాపానికి జనం ముందుకు వచ్చి రెండు చేతులూ ఎత్తి నమస్కరించి క్షమాపణలు చెప్పాలని అర్నాబ్ గోస్వామి వైసీపీ నేతలను డిమండ్ చేశారు. అలాగే ఇదే అంశంపై జరిగిన చర్చలోనూ వైసీపీ నేతలను నిలదీసి నిలబెట్టేశారు.  
ALSO ON TELUGUONE N E W S
  ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో భారీ విజయాన్ని అందుకొని, ఫుల్ జోష్ లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఇదే రిజల్ట్ ని 2027 సంక్రాంతికి రిపీట్ చేయాలని చూస్తున్నారు. చిరంజీవి తన 158వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2027 సంక్రాంతిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా కన్నేసినట్లు తెలుస్తోంది.   గతేడాది 'ఓజీ'తో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్, ఈ ఏడాది మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే తన తదుపరి సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపిస్తారని సమాచారం. ఈ మూవీని 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్టే ఈ వేసవిలో డేట్స్ ఇవ్వడానికి ఓకే చెప్పినట్లు వినికిడి.    ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఉగాదికి మూవీని లాంచ్ చేసి, షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. పక్కా ప్లానింగ్ తో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రావడం ఖాయమే అంటున్నారు. దీంతో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకేసారి విడుదలవుతాయన్న వార్త ఆసక్తికరంగా మారింది.  
  లవ్ బాయ్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు ఉదయ్ కిరణ్(Uday Kiran). ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో 'మనసంతా నువ్వే'(Manasantha Nuvve) ఒకటి. 2001లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా, ఈ ఏడాది 25 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ చేస్తున్నారు.    ఉదయ్ కిరణ్, రీమాసేన్,  తనూరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సున్నితమైన ప్రేమకథా చిత్రానికి వీఎన్ ఆదిత్య తొలిసారి దర్శకత్వం వహించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పై ఎమ్.ఎస్.రాజు నిర్మించిన ఈ మూవీ 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.    పాతికేళ్ల తర్వాత ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి,  చైతన్యారెడ్డి, శ్రీ మాత క్రియేషన్స్  పై రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఈ నెల 14వ తేదీన, వాలెంటైన్స్ డే సందర్భంగా మరలా థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ జనరేషన్ యూత్ కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  
  జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్'(Dragon) టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్, షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. (NTR Neel)   'డ్రాగన్' షూటింగ్ కోసం తాజాగా ఎన్టీఆర్ జోర్డాన్ వెళ్ళాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కాడు. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. షార్ట్ హెయిర్, గుబురు గడ్డంతో స్లిమ్ అండ్ ఫిట్ గా ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆఫ్ స్క్రీన్ లోనే ఇలా ఉంటే.. ఆన్ స్క్రీన్ లో ఏ రేంజ్ లో ఉంటుందనే చర్చ జరుగుతోంది.     జోర్డాన్ లో దాదాపు నెల రోజుల పాటు 'డ్రాగన్' షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తారట. ముఖ్యంగా ఎన్టీఆర్, మలయాళ స్టార్ టోవినో థామస్ మధ్య అదిరిపోయే సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నట్లు వినికిడి.   మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'డ్రాగన్' నుంచి సర్ ప్రైజ్ లు రాబోతున్నాయి. టైటిల్ ను అధికారికరంగా ప్రకటించడంతో పాటు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని, స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. కొత్త విడుదల తేదీపై కూడా అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశముంది.  
  The much-awaited horror thriller Amaravathiki Aahwanam is gearing up for its grand worldwide release on February 13th. The film stars Siva Kantmaneni, Dhanya Balakrishna, Esther, Supritha, and Harish in lead roles, with senior actors Ashok Kumar, Bhadram, Gemini Suresh, and Nagendra Prasad in pivotal roles. Directed by GVK, the film is produced by KS Shankar Rao and R. Venkateswara Rao under the Lighthouse Cine Magic banner, presented by G. Rambabu Yadav, with production supervision by noted producer Muppa Venkayya Chowdary. The pre-release event was held in Hyderabad on Saturday, drawing enthusiastic participation from the cast, crew, and industry stalwarts.   Highlights from the Event DOP J. Prabhakar Reddy explained the unique concept of Amaravati with “four angels who attract with beauty but terrify as devils.” Music Director Padmanabh Bharadwaj expressed confidence that the songs and background score will win audience appreciation. Actor Gemini Suresh shared his excitement about playing a challenging madman’s role. Sri Murali Mohan garu praised the producers for supporting small films that sustain the industry, wishing the film great success. Actor Raghu Babu lauded director GVK’s work, predicting recognition similar to Vinayak after Aadi. Producer R. Venkateswara Rao emphasized the film’s strong content and confidence in its success. Director GVK clarified that despite the title, the film has no political backdrop and is a pure horror thriller. Hero Siva Kantmaneni assured audiences of two and a half hours of engaging entertainment, highlighting the dedication of the heroines and technical quality. Heroines Supritha, Esther, and Dhanya Balakrishna shared their experiences, praising the story, teamwork, and director’s vision. Actor Ashwin Babu compared the film’s potential to Raju Gari Gadhi, encouraging audiences to support it.   With strong performances, technical finesse, and a gripping storyline, Amaravathiki Aahwanam promises to deliver spine-chilling entertainment. The film is set for a worldwide theatrical release on February 13th.  
  శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా "అమరావతికి ఆహ్వానం" (Amaravathiki Aahwanam). ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీల‌క‌ పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ సినిమాను నిర్మించారు.    "అమరావతికి ఆహ్వానం" సినిమా ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శనివారం హైదరాబాద్ లోని ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధులుగా ప్ర‌ముఖ న‌టులు, నిర్మాత ముర‌ళి మోహ‌న్‌గారు, యంగ్ హీరో అశ్విన్ బాబు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో...   ప్ర‌ముఖ న‌టులు, నిర్మాత‌ మురళీ మోహన్ మాట్లాడుతూ.. "తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. మనం ఆస్కార్ రేంజ్ సినిమాలు చేస్తున్నాం. అయితే అలాంటి భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా పరిశ్రమకు అవసరం. అలా రెగ్యులర్ గా చిన్న మూవీస్ నిర్మిస్తూ పరిశ్రమలో అందరికీ ఉపాధి కల్పిస్తున్నారు మా మిత్రులు శివ కంఠంనేని, వెంకటేశ్వరరావు... వారు నిర్మించిన "అమరావతికి ఆహ్వానం" సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా." అన్నారు.   హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ "అమరావతికి ఆహ్వానం సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ తోనే సినిమా చూడాలనే ఆసక్తిని డైరెక్టర్ గారు క్రియేట్ చేశారు. ముగ్గురు హీరోయిన్స్ తో ఇలాంటి మూవీ చేయడం సులువైన పని కాదు. మేము రాజు గారి గది సినిమా చేసినప్పుడు ఇలాంటి చిన్న బడ్జెట్ తోనే చేశాం. ఆ మూవీని మీరంతా ఆదరించారు. ఈ చిత్రానికి కూడా అలాంటి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముగ్గురు హీరోయిన్స్ ఎస్తేర్, ధన్య, సుప్రిత, హీరో శివ గారికి ఆల్ ది బెస్ట్." అన్నారు.   నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "ఇవాళ అమరావతికి ఎంతో ఖ్యాతి వస్తోంది. అలాంటి నగరం పేరుతో మేము హారర్ మూవీ చేశాం. మా హీరోయిన్స్ తమ అందంతో పాటు నటనతో మీ అందరినీ ఆకట్టుకుంటారు. మాకు ఈ చిత్రంతో సక్సెస్ దక్కుతుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు ట్రైలర్ చూశాక మరింత పెద్ద హిట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. మా డైరెక్టర్ జీవీకే గారు మరిన్ని మూవీస్ చేయాలి. మా హీరో శివ గారికి ఇతర టీమ్ అందరికీ గుడ్ లక్ చెబుతున్నా." అన్నారు.   డైరెక్టర్ జీవీకే మాట్లాడుతూ "అమరావతికి ఆహ్వానం అనే టైటిల్ చూసి ఇదోదే పొలిటికల్ మూవీ అనుకుంటున్నారు. కాదు ఇందులో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. రెండున్నర గంటలు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఎవరు చెప్పే వ్యూస్ నమ్మకండి. మా హీరోయిన్స్ ఎస్తేర్, ధన్య, సుప్రిత ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే శివ గారి డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయాను. మా ప్రొడ్యూసర్స్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మా మూవీ ట్రైలర్ నచ్చితే వచ్చి థియేటర్స్ లో చూడండి." అన్నారు.     హీరో శివకంఠంనేని మాట్లాడుతూ "అమరావతికి ఆహ్వానం సినిమా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసుకున్నాం. ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నాం. ఎంటర్ టైన్ మెంట్ కు మేము గ్యారెంటీ ఇస్తున్నాం. రెండున్నర గంటలు మూవీని ఎంజాయ్ చేస్తారు. మా సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఎస్తేర్, ధన్య, సుప్రిత పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. వాళ్లంతా డెడికేటెడ్ గా ఈ సినిమాకు వర్క్ చేశారు. టెక్నికల్ గా మా మూవీ చాలా క్వాలిటీగా ఉంటుంది.  చిన్న చిత్రాలకు ప్రేక్షకులు రావాలి. అప్పుడే మరిన్ని మూవీస్ చేయగలుగుతాం. ఏడాదికి దాదాపు 300 చిన్న చిత్రాలు తెరకెక్కుతాయి. వాటితోనే ఇండస్ట్రీ రన్ అవుతుంటుంది." అన్నారు.   హీరోయిన్ సుప్రిత మాట్లాడుతూ "అమరావతికి ఆహ్వానం సినిమాలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. నేను బయట ఎంత అల్లరిగా, సరదాగా ఉంటానో ఈ సినిమాలోనూ అలాంటి క్యారెక్టర్ చేశాను. ఈ పాత్రకు నేను బాగా రిలేట్ అయ్యాను. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు ధన్య, ఎస్తేర్ గారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. శివ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది." అన్నారు.   హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ "మంచి కథతో చేసిన చిత్రమిది. నేను కూడా మీతో పాటు ఈ నెల 13న థియేటర్స్ లో సినిమా చూడబోతున్నా. మా అందరికీ ఎగ్జైటింగ్ గా ఉంది. మూవీ తప్పకుండా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాం. నేను బాగా నటించగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ థ్యాంక్స్. అమరావతికి ఆహ్వానం సినిమాను మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా." అన్నారు.   హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ "మీ కళ్లు బాగుంటాయి, రొమాంటిక్ మూవీస్ చేయండి, ట్రెడిషనల్ ఫ్యామిలీ మూవీస్ చేయండి అని అంటుంటారు కానీ మా డైరెక్టర్ జీవీకే మీ కళ్లు బాగుంటాయి మీరు హారర్ మూవీ చేయాలని వచ్చారు. నేను రాజా రాణి మూవీ చేసినప్పుడు అట్లీ గారు ఎంత టాలెంటెడ్ గా అనిపించారో ఈ సినిమా చేశాక జీవీకే గారిపై అలాంటి అభిప్రాయమే కలిగింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నాం. వాళ్లకు కావాల్సినంత స్పేస్ ఇవ్వండని శివ గారు చెప్పడం ఆయనకు మూవీ మీద ఉన్న ప్యాషన్ ను తెలియజేస్తుంది. అమరావతికి ఆహ్వానం సినిమాలో మంచి కంటెంట్ ఉంది. మీరంతా థియేటర్స్ కు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి." అన్నారు.   డీఓపీ జె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ "అమరావతికి ఆహ్వానం అంటే ఇది ఏపీలోని అమరావతి అనుకుంటున్నారు. కాదు ఇది నలుగురు ఏంజిల్స్ ఉండే అమరావతి. వాళ్లు తమ అందంతో ఆకట్టుకుంటారు, అలాగే డెవిల్స్ గా భయపెడతారు" అన్నారు.   మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ్ భరద్వాజ్ మాట్లాడుతూ "మా మూవీలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం కలిగింది. ఈ సాంగ్ మీకు నచ్చుతుంద‌ని నమ్ముతున్నాను. బీజీఎం కూడా నాకు మంచి పేరు తెస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ జీవీకే గారికి, ప్రొడ్యూసర్ వెంకటేశ్వరావు గారికి థ్యాంక్స్." అన్నారు.   నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ "ఆదిపర్వం సినిమాలో శివ గారితో కలిసి వర్క్ చేశాను. ఈ సినిమాలో ఒక పిచ్చివాడి క్యారెక్టర్ కు నేనే కావాలని పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. మనం రెగ్యులర్ క్యారెక్టర్స్ ఎన్నో చేస్తుంటాం కానీ ఈ  క్యారెక్టర్ లో నటించడం డిఫరెంట్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది." అన్నారు.   నటుడు రఘుబాబు మాట్లాడుతూ "నాకు ప్రొడ్యూసర్స్ శివ కంఠంనేని, వెంకటేశ్వరరావు మంచి మిత్రులు. వారు నిర్మించిన చిత్రాల్లో నటించాను. ఈ సినిమాను దర్శకుడు జీవీకే బాగా తెరకెక్కించాడని నిర్మాతలు చెప్పారు. ఆది తర్వాత వినాయక్ గారికి ఎంత పేరొచ్చిందో ఈ సినిమా తర్వాత డైరెక్టర్ జీవీకేకు అంత గుర్తింపు దక్కాలి. ఈ సినిమాలో ముగ్గురు అందమైన ప్రతిభ గల హీరోయిన్స్ నటించారు. వారితో పాటు శివ గారికి ఇతర టీమ్ కు "అమరావతికి ఆహ్వానం" విజయాన్ని ఇవ్వాలి." అన్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
  స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. 246 ఏళ్ల క్రితం భారతదేశంలో బ్రిటీషర్ల అవినీతిని,  వారి తప్పులను ధైర్యంగా బహిర్గతం చేసి, ప్రజలకు అందించిన వార్తాపత్రిక ఒకటుంది. నిజానికి ఈ వార్తాపత్రిక భారతదేశంలో స్వతంత్ర  జర్నలిజానికి పునాది వేసింది. ఆ వార్తా పత్రిక పేరే హిక్కీస్ బెంగాల్ గెజిల్. దీన్ని హికీ గెజిట్ అని, బెంగాల్ గెజిట్  లేదా కలకత్తా జనరల్ అడ్వర్డైజర్ అని వివిధ పేర్లతో పిలిచారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. జనవరి 29, 1780.. భారతదేశంలో అధికారిక జర్నలిజం యుగం జనవరి 29, 1780న ప్రారంభమైంది. జేమ్స్ అగస్టస్ హికీ అనే వ్యక్తి కలకత్తాలో దేశంలోని మొట్టమొదటి వార్తాపత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. ఇది "హికీ గెజిట్", "బెంగాల్ గెజిట్" లేదా "కలకత్తా జనరల్ అడ్వర్టైజర్" అని వివిధ పేర్లతో పిలువబడింది. సమాచారంపై అధికారంలో ఉన్నవారు గుత్తాధిపత్యం వహించిన కాలం అది. అటువంటి క్లిష్ట సమయాల్లో హిక్కీ రెండు పేజీల వార్తాపత్రికను ప్రచురించడం ద్వారా కమ్యూనికేషన్ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేశాడు. న్యాయం, ధైర్యం.. హికీ ఈ వార్తాపత్రికను సమాచార వనరుగా మాత్రమే కాకుండా స్వతంత్ర వేదికగా కూడా స్థాపించారని చెబుతారు. ఆయన వార్తాపత్రిక  అత్యంత గొప్ప లక్షణం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నత స్థాయి అధికారులపై తిరుగులేని విమర్శలు చేయడం. ఆయన పరిపాలనలోని లోపాలను ప్రజలకు బహిర్గతం చేసి, సమాజానికి, ప్రభుత్వానికి మధ్య బలమైన వారధిగా పనిచేశారు. ఆయన నిర్భయంగా మొదలు పెట్టిన ఈ జర్నలిజం భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు పునాది వేసింది. అణచివేత.. హిక్కీ నిష్పాక్షికంగా  విమర్శించే వైఖరి ఈస్ట్  ఇండియా కంపెనీకి నచ్చలేదు. దీని వలన హిక్కీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆగ్రహానికి గురయ్యాడు. అతనికి భారీ జరిమానా విధించి,  జైలు శిక్ష కూడా విధించారు. కేవలం రెండేళ్లే.. ప్రభుత్వ ఒత్తిడి,  అణచివేత విధానాల కారణంగా, ఆ వార్తాపత్రిక కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. చివరికి 1782లో, హికీ ప్రింటింగ్ ప్రెస్ జప్తు చేశారు.  ఈ చారిత్రాత్మక వార్తాపత్రిక ప్రచురణను శాశ్వతంగా నిలిపివేశారు. చెరగని ముద్ర.. వార్తాపత్రిక కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉనికిలో ఉన్నప్పటికీ, అది భారత చరిత్రపై చెరగని ముద్ర వేసింది. ఈ వార్తాపత్రిక యొక్క అసలు కాపీలు ఇప్పటికీ లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో,  భారతదేశంలోని ఎంపిక చేసిన ఆర్కైవ్‌లలో భద్రపరిచారు. ఇదీ భారతదేశంలో ప్రారంభించిన మొదటి వార్తాపత్రిక ప్రభంజనం.                               *రూపశ్రీ.
దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు,  మరెన్నో గొప్ప  ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి.  నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా,  మెసెజ్ చేయాలన్నా, మెయిల్ పంపాలన్నా కేవలం సెకెండ్లు, నిమిషాల వ్యవధిలో జరిగిపోతూ ఉంటుంది.  కానీ మూడు దశాబ్దాల క్రితం ఈ వెసులుబాట్లు ఉండేవి కాదు.. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ అడ్డంకిని అధిగమించడానికి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆకాశాన్నే తమ మార్గంగా ఎంచుకుని హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. అప్పట్లో కమ్యూనికేషన్ రంగంలో ఈ సర్వీస్ చరిత్ర సృష్టించింది.  ఎంతో ఆసక్తికరమైన ఈ సర్వీస్ గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ఎంతో విప్లవాత్మకమైన భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను భారతదేశంలో జనవరి 27వ తేదీ,  1988లో ప్రారంభించారు. భారతదేశం ద్వీప సమూహాలతో కూడుకుని ఉంటుంది.   ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులకు ఏదైనా సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ చారిత్రాత్మక హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్ కు ఈ దీవులే ప్రారంభ వేదికగా నిలిచాయి. మొదటి విమానం పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్‌లాక్ ద్వీపానికి సమాచారాన్ని చేరవేసేది. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ప్రాధమిక ఉద్దేశ్యం మారుమూల ప్రాంతాలకు కూడా మెయిల్ ను డెలివరీ చేయడం. గతంలో మెయిల్ చేరుకోవడానికి రెండు నుండి మూడు రోజులు పట్టే ప్రాంతాలు కాస్తా హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ వచ్చాక ఆ దూరం,  సమయం చాలా తగ్గాయి. భారత తపాలా శాఖ.. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను విజయవంతం చేయడానికి బారత తపాలా శాఖ పవన్ హన్స్ లిమిటెడ్ తో కలిసి పనిచేసింది. ఈ సేవలో ప్రధానంగా డౌఫిన్ హెలికాప్టర్ ను ఉపయోగించారు. తొలి విమాన ప్రయాణ గుర్తుగా ఫస్ట్ డే కవర్లు జారీ చేయబడ్డాయి.  వీటిలో చాలా స్పెషల్ గా పిలువబడే హెలికాప్టర్ మెయిల్ స్టాంప్ కూడా ఉంది.  ఇది నేటికీ తపాలా చరిత్రలో విలువైన రికార్టు కావడం విశేషం. ప్రపంచంలో హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ప్రపంచంలో మొట్టమొదటి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ అక్టోబర్ 1, 1947న అమెరికాలో ప్రారంభమైంది. US పోస్టల్ సర్వీస్, లాస్ ఏంజిల్స్ ఎయిర్‌వేస్‌తో కలిసి, సికోర్స్కీ S-51 రోటరీ-వింగ్ హెలికాప్టర్‌ను ఉపయోగించి  ఈ సర్వీస్ ను నడిపింది. అమెరికా విజయం సాధించిన ఒక సంవత్సరం తర్వాత, యునైటెడ్ కింగ్‌డమ్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇదీ భారతదేశంలో జరిగిన హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ గురించి ఆసక్తికరమైన సమాచారం.                                  *రూపశ్రీ.
క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా అదిక శాతం జనాభాను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్య.  క్యాన్సర్ వచ్చింది అంటే ఇక చావు ఖాయం అని అనుకుంటారు.  ఒక వేళ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న.. దీని చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో మధ్యతరగతి,  దిగువ తరగతి కుటుంబాలు మనుషుల మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు,  ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. 2045 నాటికి భారతదేశంలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రతి ఏటా 1.5 మిలియన్ల నుండి 2.45 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో క్యాన్సర్ అనేది ప్రధానమైన, తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారతదేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. 2045 నాటికి ప్రతి ఏడాది నమోదు అయ్యే క్యాన్సర్ కేసులు 15 లక్షల నుండి 24 లక్షలా 50వేల వరకు పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి క్యాన్సర్ ఎంత ఉదృతంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.  దీని గురించి ఆరోగ్య నిపుణులు,  ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలామంది క్యాన్సర్ ఉందని తెలిసిన తరువాత లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం అనే విషయం మీదే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అని చెబుతున్నారు. కానీ క్యాన్సర్ వచ్చిన తరువాత వైద్యం గురించి ఆలోచించడం కంటే.. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే దిశగా ఉండటం మంచిదని చెబుతున్నారు. క్యాన్సర్ కు చికిత్స మాత్రమే సరైన మార్గం కాదు.. దీని కోసం ముందస్తు స్క్రీనింగ్ కు హాజరు కావడం,  జీవనశైలి మార్చుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేయడం, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం,  శరీరంలో ఏదైనా అసౌకర్యం అనిపించినా,  ఎక్కడైనా అసాధారణంగా గడ్డలు, చర్మం రంగు మారడం,  శరీరంలో మార్పులు వంటివి జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించడం వంటివి చేయాలని అంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ కు ఖరీదైన చికిత్స అనే వరకు వెళ్లకుండా దాన్ని విత్తనం దశలోనే నిర్మూలించేందుకు వీలవుతుంది.  పైగా ఇలాంటి పరిస్థితిలో క్యాన్సర్ ను నయం చేయడం కూడా తక్కువ ఖర్చులోనే జరిగిపోతుంది. ప్రభుత్వ విధానాలు.. తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  ఈ బడ్జెట్ లో క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుతో, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకటించింది. క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ మినహాయింపులు,  దేశీయ బయోపార్మాస్యూటికల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటివి బడ్జెట్ లో ఉన్నాయి. ప్రజలు చేయాల్సినది.. క్యాన్సర్ అనేది భారతదేశంలో ఎవరికైనా రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు.. కానీ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు.  క్యాన్సర్ గురించి ప్రతి వ్యక్తి తనకు తాను జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీనింగ్ కు హాజరు కావాలి,  శరీరంలో ఏ మార్పును నిర్లక్ష్యం చేయకూడదు,  ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన  ఆహారం తీసుకోవడం,  వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా గడపడం వంటివి చేయాలి.  ఇలా చేస్తే ఎవరికి వారు క్యాన్సర్ నుండి దూరంగా ఉండవచ్చు.                                    *రూపశ్రీ.
  బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌తో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.“రేవంత్‌ రెడ్డి ఏనాటికీ కాంగ్రెస్‌ మనిషి కాలేడు. ఆయన లోపల ఉన్నది బీజేపీ ఆలోచనలే. కాంగ్రెస్‌ నేత కాదు… బడే భాయ్‌ తమ్ముడు” అంటూ కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మైనారిటీలు, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రేవంత్‌ రెడ్డి కప్పుకున్న బీజేపీ ముసుగును తొలగించి చూడాలని, ఆయనలో ఉన్న అసలైన బీజేపీ నాయకుడిని గుర్తించాలని పిలుపునిచ్చారు. “అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఓటు వేయాలి అనేది కాంగ్రెస్‌ వాదన అర్థరహితం. గత రెండేళ్లలో వారు ఏం చేశారు? ప్రజలకు ఏమి ఇచ్చారు? అన్నది కాంగ్రెస్‌ నేతలు చెప్పాలి” అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాలను గతంలో మాదిరిగానే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలయ్యాయని భావించే వాళ్లే ఆ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ హయాంలో తెలంగాణలో స్వర్ణయుగం నడిచిందని కేటీఆర్‌ అన్నారు. పేదల కోసం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో ముందుగా కొయ్యగుట్టలో అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్‌ నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌తో కలిసి కొయ్యగుట్ట నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిపై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. “బాన్సువాడ ప్రజలు పోచారంను నమ్మి గెలిపిస్తే ఆయన ఏం చేశాడు?” అని ప్రశ్నించారు. గతంలో సీఎం రేవంత్‌ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఆయన తనయులు దోచుకుంటున్నారని అన్న మాటలను గుర్తుచేశారు. “ఒక ఆంబోతు, రెండు దున్నపోతులు” అంటూ విమర్శించలేదా? అని ప్రశ్నిస్తూ, అలాంటి మాటలు చెప్పిన రేవంత్‌ రెడ్డికే ఇప్పుడు పోచారం వెళ్లి చేరాడని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి గతంలో పోచారంపై చేసిన విమర్శల ఆడియోను ఫోన్‌లో ప్రజలకు వినిపించారు. “పోచారం బండ కట్టుకుని బాయిలో దూకాలె” అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారో పోచారం ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాన్సువాడ ప్రజలు గల్లా పట్టుకుని ఆయనను ప్రశ్నించాలని సూచించారు. “పోచారం బాన్సువాడ సిగ్గు తీసిండు” అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.  
  ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన కీలక ఆదేశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మార్చి 9వ తేదీ నాటికి అన్ని గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది.  ఏప్రిల్ లో సర్పంచుల పదవీకాలం ముగుస్తుండడంతో, వెంటనే ఎన్నికల ప్రక్రియ జరిపేందుకు కసరత్తు ప్రారంభించింది.  2026 జనవరి1ని కటాఫ్‌గా తీసుకుని అసెంబ్లీ  ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఫొటో ఓటర్ కార్డుల జాబితాను సిద్దం చేయలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల పంచాయితీల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చజరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో నిజాల నిగ్గు తేల్చడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలోని సీట్  దర్యాప్తు చేసి నివేదిక సమర్పించింది. ఇప్పుడు ఆ నివేదికపై తెలుగుదేశం, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సిట్ నెయ్యిలో కల్తీని నిర్ధారించడమే కాకుండా, జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని తేల్చింది.   అయితే సిట్ నివేదికను తనకు అనుకూలంగా చెప్పుకుంటూ వైసీపీ రాజకీయం మొదలెట్టింది. కల్తీ నెయ్యి అంశాన్ని పక్కతోవ పట్టించే విధంగా వైసీపీ కొత్త వాదనకు తెరతీసింది. చంద్రబాబు ఆరోపించినట్లుగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనీ,  చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేశారంటూ ఎదురు దాడికి దిగింది.  దీనిపై ప్రస్తుతం ఏపీలో రాజకీయం సెగలు కక్కుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు అవాస్తవాలను చెప్పారంటూ వైసీపీయులు చేస్తున్న ఆరోపణలకు తెలుగుదేశం దీటుగా జవాబిస్తోంది. సరిగ్గా ఈ తరుణంలో విషయం జాతీయ స్థాయి మీడియాలోనూ చర్చ జరుగుతోంది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డూ వ్యవహారంలో వైసీపీ తీరును, జగన్ చేస్తున్న వాదనను నిలదీశారు. తిప్పికొట్టారు. శషబిషలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ వంద శాతం తేల్చిందని కుండబద్దలు కొట్టేశారు. సిట్ నివేదికలోని అంశాలను చదివి మరీ.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని సిట్ దర్యాప్తు తేల్చిందనీ, ఇంత అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా అడ్డగోలు వాదనలేంటంటూ జగన్ ను ఆయన పార్టీ ప్రతినిథులను నిలదీశారు.   మూడు శతాబ్దాలుగా భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి వైసీపీ మహాపాపానికి ఒడిగట్టిందని అర్నాబ్ గోస్వామి నిష్కర్షగా చెప్పారు.  జగన్ హయాంలో అంటే  2019-24 మధ్య కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి ముమ్మాటికీ కల్తీదేనని దర్యాప్తు సంస్థలు సందేహాలకు అతీతంగా తేల్చేశాయన్నారు. అక్కడితో ఆగకుండా, ఆయన జగన్ ను ఆయన విశ్వసించే మతాన్ని ప్రస్తావిస్తూ క్రైస్తువుల సెంటిమెంటుతో  ఇలా ఆడుకోగలరా అని సూటిగా ప్రశ్నించారు.  లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి చేసిన పాపానికి జనం ముందుకు వచ్చి రెండు చేతులూ ఎత్తి నమస్కరించి క్షమాపణలు చెప్పాలని అర్నాబ్ గోస్వామి వైసీపీ నేతలను డిమండ్ చేశారు. అలాగే ఇదే అంశంపై జరిగిన చర్చలోనూ వైసీపీ నేతలను నిలదీసి నిలబెట్టేశారు.  
శరీరాన్ని ఉక్కులా మార్చే ఆహార కాంబినేషన్లు..!   ఆహారం శరీరానికి చాలా ముఖ్యమైనది.  శరీరానికి అన్ని పోషకాలు లభించాలంటే ఆయా పోషకాలు సమృద్దిగా ఉన్న ఆహారాలు తినాలని చెబుతారు పెద్దలు, వైద్యులు.  అయితే కొన్ని రకాల ఆహారాలు ఎంత తిన్నా వాటిలోని పోషకాలు శరీరానికి అందవు,  ఎంత తిన్నా ఏం మార్పు లేదని చాలామంది కన్ప్యూజన్ అవుతుంటారు. అయితే ఆహారాల కాంబినేషన్ లు మ్యాజిక్ చేస్తాయి.  ఆహారంలో లభించే పోషకాల సినర్జిస్టిక్ ప్రభావం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మల్టీవిటమిన్లు సహజంగా మొత్తం ఆహారాలలో కనిపిస్తాయి. విటమిన్లు,  ఖనిజాలతో పాటు, అవి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. ఫైబర్.. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది, ఇది శరీరంలోకి పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఎంజైమ్‌లు.. పోషకాలను విచ్ఛిన్నం చేసి నిర్దిష్ట మూలకాలను సక్రియం చేస్తాయి. ఫైటోకెమికల్స్.. పోషకాలను నష్టం నుండి రక్షిస్తాయి.  పోషకాలను మరింత ప్రయోజనకరంగా చేస్తాయి. ఆహార కాంబినేషన్లు.. బెస్ట్ కాంబో.. సిట్రస్ పండ్లు లేదా ఆకుకూరలతో కూరగాయలు, గింజలతో పండ్లు. బెస్ట్ కలర్స్.. వివిధ రంగుల పండ్లు,  కూరగాయలు ముఖ్యమైన ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు.. ఆహార కొవ్వును సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి విటమిన్లు A, D, E,  K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు అవసరం. కాల్షియం, విటమిన్-డి.. తగినంత విటమిన్ డి లేకుండా  శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించదు. అందువల్ల  కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో విటమిన్ డి ని సప్లిమెంట్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బలమైన దంతాలు,  ఎముకలను నిర్వహించడానికి,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్-సి, ఐరన్.. విటమిన్ సి తో ఐరన్ తీసుకోవడం వల్ల  శరీరం దానిని సులభంగా జీర్ణం చేస్తుంది. అందుకే పాలకూరతో నిమ్మకాయ, టమోటాలతో పప్పు, బెర్రీలతో బలవర్థకమైన తృణధాన్యాలు వంటి కాంబినేషన్లు మంచివిగా పరిగణించబడతాయి. ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్.. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను నిర్వహించడానికి ప్రోబయోటిక్స్ అవసరమైన బ్యాక్టీరియా. అవి జీర్ణక్రియకు సహాయపడతాయి,  రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పెరుగు, ఊరగాయలు, ఇడ్లీ, దోస,  కేఫీర్ వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రోబయోటిక్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాను నిర్వహించడానికి ప్రీబయోటిక్ ఆహారాలు కూడా అంతే ముఖ్యమైనవి. ప్రీబయోటిక్స్ అనేది ప్రోబయోటిక్స్‌కు ఎరువుగా పనిచేసే ఒక రకమైన ఆహార ఫైబర్. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, ఆపిల్స్,  తృణధాన్యాలలో ప్రీబయోటిక్స్ కనిపిస్తాయి.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆహారం ప్రతి జీవికి శక్తివనరు.  ప్రాణం లేని వాహనాలు కూడా వాటికి ఇంధనం  ఉంటేనే పని చేస్తాయి. అలాంటి ప్రాణం ఉన్న జీవులకు ఆహారం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రాణం ఉన్న జీవులలో ఈ ప్రపంచంలో మనిషి చాలా ప్రత్యేకం.  అయితే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి.  ఇందులో ఫైబర్ కూడా ముఖ్యమైనది. చాలామంది ఆహారంలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్ వంటివి ఉన్నాయా లేదా అని చూస్తారు. కానీ ఫైబర్ గురించి ఆలోచించే వారు తక్కువ. ఆహారంలో ఫైబర్ లోపిస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పైబర్ గురించి నిర్లక్ష్యంగా ఉండేవారు తప్పకుండా తెలుసుకోవలసిన నిజాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పేగు ఆరోగ్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల మన గట్ లైనింగ్ నేరుగా దెబ్బతింటుంది, ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల పేగులు దెబ్బతినే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి.   షుగర్ లెవల్స్.. ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుదల మరింత తీవ్రమవుతుందని. ఆహారంలో ఫైబర్ ఉన్నప్పుడు, అది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత,  టైప్ 2 డయాబెటిస్‌కు  దారితీస్తుంది. కొలెస్ట్రాల్.. గుండె ఆరోగ్యం.. ఫైబర్ శరీరంలో చీపురులా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తుడిచిపెడుతుంది. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే, ఈ చెడు కొవ్వు ధమనులలో పేరుకుపోతుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఫ్యాటీ లివర్.. ఫైబర్ లేకపోవడం కొవ్వు కాలేయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల శరీరం  ప్రధాన వడపోత  అవయవమైన లివర్ పనితీరు మందగిస్తుంది.  ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం బ్యూటిరేట్ అనే ముఖ్యమైన షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. బ్యూటిరేట్ పేగు కణాలకు శక్తిని అందిస్తుంది,  క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి వాటిని రక్షిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్,  ఇతర శోథ వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని, ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎక్కువ ముప్పును కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. హార్మోన్ల అసమతుల్యత.. అకాల వృద్దాప్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల అంతర్గత అవయవాలు మాత్రమే కాకుండా చిన్న వయసులోనే వయస్సు పెరిగినట్టు (అకాల వృద్ధాప్యం) కూడా ప్రభావితమవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది,  అకాల వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఫైబర్ తగినంతగా తీసుకోకపోవడం ముడతలు,  శరీరంలో ఎనర్జీ నష్టానికి దారితీస్తుంది. అందువల్ల,  ఆహారంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు,  కాలానుగుణ కూరగాయలను చేర్చడం చాలా ముఖ్యం.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
ఒకప్పుడు సొంపు చాలా మందికి తెలియదు. జీలకర్రను పోలిన సొంపు చాలా మంచి సువాసనతో ఉంటుంది. కొన్నిరకాల వంటల్లో సొంపును వాడతారు. మరికొందరు సొంపును భోజనం తర్వాత జీర్ణశక్తి కోసం తీసుకుంటారు. రెస్టారెంట్లలో భారీ భోజనం తిన్న తరువాత సొంపు ఇవ్వడం వెనుక కారణం.. కడుపు ఉబ్బరం, అజీర్తి ఉండకూడదనే.. అయితే ఆయుర్వేదం సొంపుతో మరింత గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది. చాలామంది రాత్రి నీటిలో సొంపును నానబెట్టి ఉదయాన్నే తాగుతూ ఉంటారు.  కానీ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగితే అద్భుతాలు జరుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆయుర్వేద వైద్యులు ఏం చెప్పారు? తెలుసుకుంటే.. మనం తినే,  త్రాగే ఆహారాలు మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. అందుకే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి.  కడుపును శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సహజమైన మెరుపు వస్తుంది. సొంపు నీరు కూడా ఇలాంటిదే..  డిటాక్స్ డ్రింక్.. రోజూ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇది  చర్మాన్ని హైడ్రేటెడ్ గా, ప్రకాశవంతంగా,  యవ్వనంగా ఉంచుతుంది. డిటాక్స్  డ్రింక్ తాగడం వల్ల మొటిమలు , మంట,  మచ్చలు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. సొంపు నీటిని ఎలా చేసుకోవాలి.. 1 కప్పు నీరు 1 టీస్పూన్ సోంపు.. 1 టీస్పూన్ జీలకర్ర.. 1 టీస్పూన్ క్యారమ్ విత్తనాలు.. తయారు విధానం.. పైన పేర్కొన్నవన్నీ ఒక పాన్‌లో లేదా గిన్నెలో వేయాలి. అందులో ఒక కప్పు నీరు పోయాలి.  దీన్ని తక్కువ మంట మీద మరిగించాలి. 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి.  ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.   డిటాక్స్ డ్రింక్ రెడీగా ఉన్నట్టే ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని తయారు చేసుకుని తాగమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మం మెరుస్తుంది,  కడుపు శుభ్రంగా ఉంటుంది, శరీరం డీటాక్స్ అవుతుంది సొంపు చేసే మ్యాజిక్.. పైన పేర్కొన్న డిటాక్స్ డ్రింక్ లో సొంపు ఉంటుంది.  ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మాన్ని శుద్ది చేస్తాయి. ఇది మొటిమలు,  ముడతలను తగ్గిస్తుంది,  ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది . ఇది మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.