LATEST NEWS
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది. సుదీర్ఘ కాలం పాటు ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించిన నితీష్ కుమార్ శకం ముగియగా, భారతీయ జనతా పార్టీ కీలక నేత సామ్రాట్ చౌదరి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కీలక పరిణామంతో బిహార్ రాజకీయాల్లో నవశకం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో నితీష్ కుమార్‌ను గద్దె దించే వరకు విశ్రమించనని శపథం చేసిన వ్యక్తి, నేడు ఏకంగా ఆ కుర్చీలోనే కూర్చోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గతంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో విభేదించిన సమయంలో సమ్రాట్ చౌదరి ఒక సవాల్ విసిరారు. నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి పీఠం నుండి దించే వరకు తాను ధరించిన తలపాగా (పగడీ) తీయనని, కాషాయ రంగు తలపాగాతోనే ఉంటానని 2023లో ప్రతిజ్ఞ చేశారు. అయితే మారుతున్న సమీకరణల దృష్ట్యా 2024లో బీజేపీ-జేడీయూ పొత్తు కుదరడంతో, అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన తన శపథాన్ని పక్కనపెట్టి అయోధ్యలో శ్రీరాముడికి తన తలపాగాను సమర్పించారు.
57 ఏళ్ల సమ్రాట్ చౌదరి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. వెనుకబడిన వర్గాల్లో (కుష్వాహా సామాజిక వర్గం) ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన తండ్రి శకుని చౌదరి బిహార్ రాజకీయాల్లో సీనియర్ నేతగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తల్లి పల్లవి దేవి కూడా శాసనసభ్యురాలిగా సేవలందించారు. కుటుంబ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన సమ్రాట్, అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
సమ్రాట్ చౌదరి రాజకీయ ప్రస్థానం పలు పార్టీల గుండా సాగింది. 1990లలో ఆర్జేడీలో చేరిన ఆయన, రబ్రీదేవి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం జేడీయూలో చేరినప్పటికీ, అక్కడ ఇమడలేక 2017లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ వేగంగా పెరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తే, నితీష్ కుమార్ రాజకీయాలకు స్వస్తి పలకడం లేదా కేంద్ర రాజకీయాల వైపు మళ్లడంతోనే సమ్రాట్ చౌదరికి ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. గతంలో నితీష్‌ను వ్యతిరేకించిన నేతకే ఇప్పుడు అధికార పగ్గాలు దక్కడం బీజేపీ వ్యూహాత్మక విజయంగా రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణలను సమన్వయం చేయడంలో సమ్రాట్ కీలకం కానున్నారు.
ఈ మార్పు పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. నాడు శపథం చేసిన వ్యక్తి నేడు అదే నితీష్ మద్దతుతో లేదా ఆయన వారసుడిగా రావడం రాజకీయ అవకాశవాదమని ఆర్జేడీ నేతలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా, సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బిహార్‌లో ఎలాంటి అభివృద్ధి పథకాలు చేపడతారో మరియు కుల రాజకీయాలను ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.
సమ్రాట్ చౌదరి నాయకత్వంలో బిహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ మరింత వేగంగా పనిచేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నిరుద్యోగ సమస్య పరిష్కారం మరియు పారిశ్రామిక అభివృద్ధి ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. కొత్త ముఖ్యమంత్రి రాకతో బిహార్ రాజకీయాల్లో స్థిరత్వం వస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం శ్రేణులూ, నేతలూ కూడా లోకేష్ కు పార్టీలో, ప్రభుత్వంలో మరింత కీలక స్థానం కల్పించాలని గత ఏడాదిన్నర పైగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఒక అడుగు ముందుకు వేసి ఈ విషయాన్ని చంద్రబాబు సమక్షంలోనే కొదరు స్పష్టంగా చెప్పారు కూడా. అలాగే తెలుగుదేశం శ్రేణులైనా ఒక సమయంలో లోకేష్ కు పార్టీలోనే కాదు, ప్రభుత్వంలో కూడా ప్రమోషన్ ఇవ్వాలనీ, ఆయన పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించాలనీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనీ కూడా బాహాటంగానే డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా కడప మహానాడుకు ముందు ఈ డిమాండ్ తెలుగు దేశం శ్రేణుల నుంచి చాలా చాలా గట్టిగా వినిపించింది. ఒక దశలో కడప మహానాడు వేదికగానే లోకేష్ ప్రమోషన్ ప్రకటన ఉంటుందని కూడా గట్టిగా వినిపించింది. అయితే కూటమి పరిమితుల కారణంగా అప్పట్లో చంద్రబాబు లోకేష్ ప్రమోషన్ విషయంపై బాహాటంగా ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా మందలించారు కూడా.ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. తెలుగుదేశం పార్టీకి తొట్ట తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ నియమితులయ్యారు.
నారా లోకేశ్ కు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారికం నియామకం జరిగింది కానీ.. ఆయన చాలా కాలంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాలుగా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో లోకేష్ ముద్రను బలంగా ఉంది. ఇక పార్టీ కేడర్ తో లోకేష్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. అన్నిటికీ మించి లోకేష్ యూత్ గా బాగా కనెక్ట్ అవుతారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియామకం పార్టీ పరంగా ఆయన ఇమేజ్ ను మరింత పెంచుతుందనడంలో సదేహం లేదు.
పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న లోకేష్ భావనకు అనుగుణంగానే ఇప్పుడు పార్టీ కమిటీల ప్రకటన కూడా ఉంది. రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పార్టీ మరింత బలోపేతం కావడానికి, కార్యకర్తలలో మరింత జోష్ నింపడానికి దోహదపడుతుందని తెలుగుదేశం సీనియర్లు గట్టిగా చెబుతున్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. ఆయనను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేసే దిశగా ఈ కీలక బాధ్యతలను ఆయనకు తెలుగుదేశం హైకమాండ్ అప్పగించింది. ప్రస్తుతం ప్రభుత్వంలో అత్యంత కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న నారా లోకేష్ కు పార్టీలోనూ అత్యున్నత స్థాయి బాధ్యతలు అప్పగించింది.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత.. ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కూడా నారా లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని నిర్ణయించారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంలో లోకేష్ చేసిన కృషిని గుర్తించిన తెలుగుదేశం హైకమాండ్ ఆయనకు మరింత స్వేచ్ఛ నిచ్చి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువేళ్లేందుకు అవకాశం ఇచ్చింది. అందుకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ ను నియమించింది. పార్టీ అంతర్గత వ్యవహారాలు, కమిటీల నియామకం, జిల్లాల వారీగా పార్టీ బలోపేతం వంటి అంశాల్లో లోకేష్ పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఆకర్షించడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం వంటి వాటిపై లోకేష్ దృష్టి పెడతారని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న తరుణంలో, పార్టీ బాధ్యతలను లోకేష్ పంచుకోవడం వల్ల సమతుల్యత ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు. కాగా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ పట్ల తెలుగుదేశం శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే లోకేష్‌కు ఈ పదవి అదనపు బలాన్ని ఇస్తుందన్న అభిప్రాయం పార్టీ వర్గాలో బలంగా వ్యక్తం అవుతోంది.
ఇలా ఉండగా.. తెలుగుదేశం హైకమాండ్ జాతీయ కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుల జాబితాను కూడా విడుదల చేసింది. యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ.. అనుభవజ్ఞులను పొలిట్‌బ్యూరోలో కొనసాగిస్తూ సమతూకంతో కమిటీలను రూపొందించింది. ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ కొనసాగించింది. 29 మందితో పొలిట్‌బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని తెలుగుదేశం ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని నియమించింది. అంతేకాకుండా ఉపాధ్యక్షులుగా 18, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించింది.
ALSO ON TELUGUONE N E W S
-బాలకృష్ణ కెరీర్ లో భైరవద్వీపం ఒక డైమండ్
-అప్పుడే 32 ఏళ్లయింది
-ఒక చరిత్ర సృష్టించిన మూవీ
గాడ్ ఆఫ్ మాసెస్ అనేది ఊరకనే రాదు అని నిరూపించిన బాలకృష్ణ(Balakrishna)నుంచి వచ్చిన అద్భుతమైన సినిమాల్లో 'భైరవద్వీపం'(Bhairava Dweepam)ఒకటి. అసలు ఇలాంటి మూవీ ఒకటి తెలుగు సినిమా పుస్తకంలో ఉండటం అనేది తెలుగు ప్రేక్షకుల, బాలకృష్ణ అభిమానుల, తెలుగు ప్రజల అదృష్టం. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు కాలం తర్వాత జానపద చిత్రాల హవా తగ్గిపోయిందనుకుంటున్న తరుణంలో వచ్చి ఎలాంటి జోనర్స్ లో నైనా చేసి మెప్పించగల సత్తా నందమూరి హీరోలకి ఉందని నిరూపించింది. అపర దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు కాగా టోటల్ ఆయన కెరీర్ కే వన్నె తెచ్చింది. 1994, ఏప్రిల్ 14న విడుదలైంది. అంటే నిన్నటికి 32 వసంతాలు. మరి ఆ అద్భుత ద్వీపానికి సంబంధించిన విషయాలని గుర్తుచేసుకోవడం ద్వీప వాసులుగా మన ధర్మం.
బాలయ్య మాస్ హీరోగా తన ప్రభావాన్ని ఒక రేంజ్ లో ప్రదర్శిస్తున్న రోజులు. అలాంటి సమయంలో భైరవద్వీపం లాంటి జానపద కథని ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. విజయ్ అనే నవనవలాడే దోర వయసు సాహసవంతమైన యువకుడిగా, శాపం వలన మారే అసహ్యకరమైన రూపంతో ఉండే కురూపిగా, ధైర్యవంతుడైన యువకుడిగా, ప్రియురాలుకి ఏ ఇబ్బంది కలగకూడదని తాపత్రయపడే యువకుడిగా పలు పార్శ్యాలు కలిగిన కేరక్టర్స్ లో బాలయ్య నటన నభూతో నభవిష్యత్. ముఖ్యంగా కురూపి గెటప్‌లో బాలకృష్ణ పండించిన పెర్ ఫార్మెన్స్ , భావోద్వేగాలు ప్రాణవాయువులా నిలిచాయి. తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని జానపదాల్లోను కొనసాగించగలనని నిరూపించాడు. అంతగా కంప్లీట్లీ బాలయ్య వన్ మాన్ షో. రాజకుమారి పద్మావతి గా రోజా పెర్ ఫార్మెన్స్ కూడా అప్పడే విరబూసిన రోజా పువ్వు సువాసన ఎలా ఉంటుందో అంతే సువాసనగా ఉంటుంది. రాజ్యాన్ని పరిపాలించే రాజుగా చేసిన విజయ్ కుమార్, దుష్ట శక్తులని ఆవహించిన మాంత్రికుడిగా సత్యనారాయణ, బాబూమోహన్ అందరు తమ తమ క్యారక్టర్ లో ఒక రేంజ్ లో చేసారు.
సింగీతం శ్రీనివాసరావు అంటేనే ప్రయోగాలకు మారుపేరు. అప్పట్లో అందుబాటులో ఉన్న తక్కువ సాంకేతికతతోనే గాలిలో ఎగిరే మంచం, చిన్న మనుషులు, మాయలు మంత్రాలను వెండితెరపై ఆవిష్కరించిన తీరు అమోఘం.తన దర్శక మేధస్సుతో అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు. సంగీత సామ్రాట్ ఇళయరాజా అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్. 'విరిసినది వసంత గానం' శ్రీ తుంబుర నారద" తో పాటు మిగతా పాటలన్ని వీనుల విందుతో పాటు కనుల విందుగా ఉంటాయి.
బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా ఏకంగా తొమ్మిది నంది అవార్డులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ సినిమా సాధించిన విజయం టాలీవుడ్‌లో మరిన్ని ఫాంటసీ మరియు జానపద చిత్రాలకు స్ఫూర్తినిచ్చింది. మూడు దశాబ్దాలు దాటినా 'భైరవద్వీపం' మేజిక్ ఇప్పటికీ తగ్గలేదు. టీవీలో ఈ సినిమా వస్తుందంటే పెద్దలు, పిల్లలు టీవీలకి అతుక్కుపోవడం తమ జన్మ హక్కుగా భావిస్తారు. కమర్షియల్ విలువల మధ్య ఒక అచ్చమైన జానపద కథను అంత అద్భుతంగా తెరకెక్కించడం మామూలు విషయం కాదు. బాలయ్య కెరీర్‌లో మాత్రమే కాకుండా, తెలుగు సినీ చరిత్రలో ఒక అజరామరమైన కళాఖండంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. జానపద చిత్రాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా మొదటి వరుసలో వినిపించడం మరో స్పెషాలిటీ.
Also read: జురాసిక్ పార్క్‌లో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
మరి గ్రాఫిక్స్ లేని ఆ కాలంలోనే విజువల్ వండర్‌గా నిలిచిన భైరవద్వీపం మరణం లేని అమర దృశ్య కావ్యంగా ఉంది కాబట్టి చూసి ఆనందించండి. బాలకృష్ణతో పాటు కొంత మంది నటీనటులు పదుల రోజుల పాటు నిద్రాహారాలు మాని మరి భైరవ ద్వీపాన్ని మీ కోసమే తెరకెక్కించారు. 28 కేంద్రాలలో 100 రోజుల పాటు ప్రదర్శించగా చందమామ విజయా కంబైన్స్ పై వెంకట్రామ రెడ్డి నిర్మించాడు. మరిన్ని అప్ డేట్స్ కింద ఉన్న మా తెలుగు వన్ వీడియోస్ లో ఉన్నాయి చూడండి. మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన విశ్లేషణలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ 'వారణాసి' (Varanasi). ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి కేవలం తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దేవర సెట్స్‌లో వారణాసి షూటింగ్!
జూనియర్ ఎన్టీఆర్)నటించిన 'దేవర' సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్లు వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్, సముద్రపు నేపథ్యంలో సాగే సీన్ల కోసం ప్రత్యేకంగా భారీ వాటర్ ట్యాంక్ సెట్స్‌ను నిర్మించారు. ఇప్పుడు అదే సెట్స్‌ను రాజమౌళి తన 'వారణాసి' సినిమా కోసం వాడుకుంటున్నట్లు సమాచారం. గంగా నది నేపథ్యంలో సాగే కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ లను ఈ వాటర్ సెట్‌లో చిత్రీకరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
విదేశీ ప్లాన్స్ రద్దు.. హైదరాబాద్‌లోనే చిత్రీకరణ
వాస్తవానికి ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్లను విదేశాల్లో చిత్రీకరించాలని రాజమౌళి భావించారు. అయితే, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విదేశీ షెడ్యూల్స్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తన ప్లాన్ మార్చుకుని, హైదరాబాద్‌లోని లొకేషన్లలోనే ఆ సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే 'దేవర' సినిమా కోసం వేసిన అండర్ వాటర్ సెట్ 'వారణాసి' టీమ్‌కు వరంగా మారింది.
మహేష్ బాబు నయా లుక్.. భారీ యాక్షన్ సీక్వెన్స్
ఈ సినిమాలో మహేష్ బాబు మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. రాజమౌళి మార్క్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ బాబుపై భారీ రివర్ ఛేజ్ (నదిలో ఛేజ్) సీక్వెన్స్‌లను ప్లాన్ చేశారు. 'దేవర' సెట్స్‌లో జరుగుతున్న ఈ షూటింగ్‌లో మహేష్ పాల్గొంటున్నారని, అక్కడ చిత్రీకరిస్తున్న విజువల్స్ వెండితెరపై అద్భుతంగా రానున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 'వారణాసి' సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు.
టాలీవుడ్ సీనియర్ హీరో, ‘యాంగ్రీ మ్యాన్’ రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవలే శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' చిత్రంలో ఒక పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో మెప్పించి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రాజశేఖర్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కుమార్తెలు శివాని, శివాత్మికల పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రాజశేఖర్ కూతుళ్ల పెళ్లి గురించి రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై తండ్రిగా ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతం తమ ఇంట్లో పెళ్లి భాజాలు మొగడం లేదని స్పష్టం చేశారు. "మా అమ్మాయిలకు మంచి సంబంధాలు వస్తున్నాయి, ఆ దిశగా కొన్ని ఆలోచనలు కూడా జరిగాయి. కానీ, శివాని, శివాత్మికలకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. వారు తమ కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టాలని భావిస్తున్నారు" అని రాజశేఖర్ పేర్కొన్నారు.
నటిగా శివాని ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగా, శివాత్మిక కూడా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. హీరోయిన్లుగా తాము మరిన్ని ప్రయోగాలు చేయాలని, చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తర్వాతే వివాహం గురించి ఆలోచిస్తామని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కూతుళ్ల నిర్ణయానికి తండ్రిగా తాను ఎప్పుడూ అండగా ఉంటానని, వారి ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
కేవలం సినిమా విషయాలే కాకుండా రాజకీయాలపై కూడా రాజశేఖర్ తనదైన శైలిలో స్పందించారు. గతంలో తాము రాజకీయాల్లో ఉన్నప్పుడు సొంత సంపాదనతోనే సేవ చేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తన భార్య జీవితకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని వెల్లడించారు. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీని ఆయన స్వాగతించారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజశేఖర్ సుదీర్ఘ విరామం తర్వాత 'గరుడ వేగ'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'శేఖర్' సినిమాలో కూడా తన నటనా విశ్వరూపాన్ని చూపించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు హీరోగా కూడా డిఫరెంట్ స్క్రిప్ట్స్ వింటున్నారు. ముఖ్యంగా 'బైకర్' సినిమా సక్సెస్ తో ఆయనకు మరిన్ని క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం రాజశేఖర్ కూతుళ్లు కూడా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. శివాని కొన్ని వెబ్ సిరీస్ లు మరియు సినిమాలతో బిజీగా ఉండగా, శివాత్మిక మలయాళ, తమిళ భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ స్టార్ కిడ్స్ కేవలం తండ్రి పేరుతో కాకుండా తమ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎదగాలని పట్టుదలతో ఉండటం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలతో వారి పెళ్లి గురించి వస్తున్న అవాస్తవ వార్తలకు తెరపడింది. రాబోయే రోజుల్లో రాజశేఖర్ మరిన్ని పవర్ ఫుల్ పాత్రల్లో అలరించాలని, ఆయన కుమార్తెలు కూడా హీరోయిన్లుగా మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సినిమా 'బాహుబలి'. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) సృష్టించిన ఈ దృశ్య కావ్యం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పుడు అదే 'బాహుబలి' ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేషన్ ఫిల్మ్ 'బాహుబలి: ద ఎటర్నల్ వార్' (Baahubali: The Eternal War) సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది.
అంతర్జాతీయ యానిమేషన్ ఫెస్టివల్‌కు ఎంపిక
ఫ్రాన్స్‌లో జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఎన్నేసి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2026' (Annecy International Animation Festival 2026) లో ప్రదర్శనకు 'బాహుబలి: ద ఎటర్నల్ వార్' అధికారికంగా ఎంపికైంది. ఇందులో 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' విభాగంలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. యానిమేషన్ రంగంలో ఈ ఫెస్టివల్‌ను 'యానిమేషన్ ప్రపంచపు కేన్స్ ఫెస్టివల్'గా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి వచ్చే అత్యుత్తమ యానిమేషన్ చిత్రాల మధ్య భారతీయ చిత్రం చోటు సంపాదించుకోవడం గర్వకారణం.
రాజమౌళి ఆనందం
ఈ అరుదైన గౌరవంపై దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "యానిమేషన్ అనేది హద్దులు లేని అద్భుతమైన ప్రపంచమనే విషయాన్ని నేను ఎప్పుడూ నమ్ముతాను. మన భారతీయ సినిమాకు దక్కిన ఒక అరుదైన గౌరవంగా దీన్ని భావిస్తున్నా. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై మా సినిమాను ప్రదర్శించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా భారతీయ యానిమేషన్ టెక్నాలజీని, కథా బలాన్ని ప్రపంచ సినీ దిగ్గజాలకు చూపే అవకాశం లభించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
https://x.com/ssrajamouli/status/2044296607529873473
భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికత
'బాహుబలి: ద ఎటర్నల్ వార్' సినిమాను సుమారు రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత మాహిష్మతి సామ్రాజ్యంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. 'ఆర్కా మీడియా వర్క్స్' నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇషాన్ శుక్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కేవలం యానిమేషన్ సినిమాగానే కాకుండా, బాహుబలి ప్రపంచాన్ని మరింత లోతుగా చూపే ప్రయత్నం చేస్తోంది. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే విజువల్ వండర్ గా బాహుబలి సిరీస్ మన దేశంలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు యానిమేషన్ విభాగంలో కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో 'జై మాహిష్మతి' అనే నినాదాలు మరోసారి మారుమోగుతున్నాయి.
MS Raju is a brand by himself. Under the Sumanth Arts banner, the films he produced such as Shatruvu, Devi, Manasantha Nuvve, Okkadu, Varsham, Nuvvostanante Nenoddantana created a trend. As a director too, he has been moving forward with his own distinct style. Dirty Hari and Malli Pelli stand as examples. He does not like to repeat a concept once done. Whatever he does, his goal is to give the audience a unique experience. That is why he is preparing “Agadha.” For the past one year, he has been working relentlessly only on this project.
The promotions of “Agadha” have begun in a different manner. As part of this, an interesting and funny video was released. In the video, two thieves enter MS Raju’s office to steal, and while looking at the film posters there, they recall memories associated with those films. Finally, on seeing one particular poster, they get frightened as if something is there, and the video ends. What was actually there is the poster of the film “Agadha.” That poster was released today.
A dark cave.
A few torches glowing around.
Not just the darkness, even that faint light feels frightening.
There stands a huge idol.
Its face looks completely mystic. The idol has twelve hands.
In front of this idol stands a girl, turned away from it. Her costume also looks very different.
With this poster itself, MS Raju has generated curiosity. MS Raju is making “Agadha” as a mystical divine thriller. The film is being made on a grand scale under the banner of Sri Adi Varaha Productions, directed by MS Raju. Kasi Visalakshi Balusu is producing this film very prestigiously. The shooting part of “Agadha,” which is being made in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi, has been completed. Currently, post production works are in progress.
Speaking about the film, MS Raju said, “This is a mystical divine thriller. We will soon reveal who the actors in this film are. We shot for 85 days across various sets and different locations. There will be 45 minutes of VFX in this film. That itself shows the scale of the movie. We will bring it before the audience very soon.”
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు. అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. చేసే కొన్ని తప్పులు వారికి ఎలాంటి విజయాన్ని ఇవ్వవు అని చెబుతాడు ఆచార్య చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. వేల సంవత్సరాల కిందటే.. మనిషి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, ఆర్థిక సూత్రాలను ప్రపంచానికి అందించాడు. అవి ఇవ్పటికీ ప్రజలు ఆచరించే విధంగా ఉన్నాయంటే.. ఆయన ఆలోచన, ఆయన సిద్దాంతాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో.. సమాజంలో ఉండే కొందరు వ్యక్తులను అవమానించడం వల్ల ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తును చీకటిలోకి నెట్టుకున్నట్టు అవుతుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఐదుగురు వ్యక్తులను అవమానించడం వల్ల జీవితంలో అసలు విజయాన్ని సాధించలేరని కూడా చెబుతాడు. ఇంతకీ ఎవరిని అవమానించకూడదు? ఎందుకు అవమానించకూడదు? తెలుసుకుంటే..
గురువు..
చాణక్య నీతి ప్రకారం గురువు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటారు, ఎందుకంటే గురువు అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాడు. గురువు మనకు అక్షరాస్యతను అందించడమే కాకుండా, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి విలువలు కలిగి ఉండాలో.. ఆ విలువలను నేర్పుతాడు. తమ గురువును లేదా మార్గదర్శకుడిని అగౌరవపరిచిన వారు తమ జ్ఞానాన్ని, విజయాన్ని కోల్పోతారని ఆచార్య చాణక్యుడు చెబుతాడు.
తల్లిదండ్రులను..
ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్ప శ్రేయోభిలాషులు ఉండరు. తండ్రి కుటుంబానికి రక్షణ కవచం అయితే, తల్లి విలువలకు, ప్రేమకు ప్రతిరూపం. తల్లిదండ్రులకు మానసిక వేదన కలిగించే లేదా వారిని అగౌరవపరిచే పిల్లలు అదృష్టాన్ని, సంతోషాన్ని కోల్పోతారని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని ప్రకారం, పెద్దల కళ్లలో కన్నీళ్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదట.
పండితులు..
చాణక్య నీతి ప్రకారం సమాజంలో అపారమైన అనుభవం, బోలెడు జ్ఞానం ఉన్నవారే పండితులు. అలాంటి పండితుల సాంగత్యం అమూల్యమైనది. పండితులను ఎగతాళి చేయడం లేదా కించపరచడానికి ప్రయత్నించడం మేధో దారిద్య్రాన్ని ప్రతిబింబిస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు. పండితులను అవమానించడం ద్వారా, సరైన సలహా, మార్గదర్శకత్వం పొందే అవకాశాలను కోల్పోయి, చివరికి పతనానికి గురవుతారట.
కష్టపడి పనిచేసేవారు, సేవాభావం గలవారు..
ఆచార్య చాణక్యుడు ఎల్లప్పుడూ కష్టానికి గౌరవం ఇవ్వాలని బోధించారు. పారిశుధ్య కార్మికుడైనా, సెక్యూరిటీ గార్డు అయినా, కూలీ అయినా.. సమాజాన్ని నడిపించడానికి కష్టపడే ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులు. ఒకరి ఆర్థిక స్థితి లేదా హోదాను బట్టి వారిని అవమానించడం మనిషిలో అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి ప్రతికూల శక్తే ఉంటే.. అదే వారి దురదృష్టానికి అతిపెద్ద కారణం అవుతుంది.
సాధు స్వభావం ఉన్నవారు..
ధర్మం, సత్యం, నైతికత మార్గాన్ని అనుసరించేవారిని అసంతృప్తికి గురిచేయడం, అవమానించడం చాలా తప్పు. సద్గుణ, సత్ప్రవర్తన గలవారు ఎవరికీ కీడు కోరుకోరు, కానీ వారిని అవమానించడం జీవితంలోని సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. మానసిక సమతుల్యత కావాలన్నా, ఇంట్లో శాంతికి లోటు ఉండకూడదన్నా సాధు స్వభావం గల వారిని గౌరవించడం చాలా అవసరం.
*రూపశ్రీ.
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్ లు అయితే బయటకు బాగా జాలీగా ఉంటూ, అందరిలో కలిసిపోతూ.. ఎక్కడైనా సరే ఇట్టే సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇంట్రోవర్ట్ లు అలా కాదు.. వారు ఎవరి ముందూ ఏమీ ఎక్కువ మాట్లాడలేరు, కనీసం కావలసిన వస్తువులు, అవసరమైన విషయాల దగ్గర కూడా వారు మాట్లాడలేకపోవడం వల్ల నష్టపోతూ ఉంటారు.
ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ కారణంగా ఇంట్రోవర్ట్ లను చాలా కామెడీ చేస్తుంటారు. వారు సిగ్గుపడుతూ ఉంటారని, మొహమాటం ఎక్కువని కూడా ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. నాణేనికి మరొక వైపు కూడా ఉంటుంది. అదే ఇంట్రోవర్ట్ లలో ఉండే బలం. వారి వ్యక్తిత్వమే వారికి పెద్ద బలం అని చాలామంది కూడా అంటుంటారు. ఇంతకీ.. ఇంట్రోవర్ట్ లలో ఉండే బలాలు ఏంటో తెలుసుకుంటే..
ఒంటరితనం..
ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు పునరుత్తేజం పొందుతారు. వారికి జనాల మధ్యలో ఉండటం అనే విషయం త్వరగా విసుగు తెప్పిస్తుంది. అయితే ఇలా ఒంటరిగా ఎక్కువ గడపడం వల్ల వారికి వారి మీద నమ్మకం, వారి నిర్ణయాల పట్ల నమ్మకం, తమ వ్యక్తిత్వం పట్ల దృఢంగా ఉంటారు.
లోతైన మాటలు..
ఇంట్రోవర్ట్ లు చిల్లర మాటల కంటే అర్థవంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే పనిగా ఏదో ఒకటి మాట్లాడటం అనే దాని కంటే.. అవసరమైనప్పుడు అవసరమైన విషయాలు మాట్లాడటానికే వారు ఆసక్తి చూపిస్తారు.
అతి ఆలోచనలు..
ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా గడపడం ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు , నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు.
తక్కువే.. కానీ బలమైన స్నేహాలు..
ఇంట్రోవర్ట్ లకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారి లిస్ట్ లో చాలా కొద్దిమంది మాత్రమే స్నేహితులు ఉంటారు. కానీ ఆ కొద్ది మంది చాలా మంచి స్నేహితులై ఉంటారు. వారి స్నేహం కూడా చాలా బలంగా ఉంటుంది. వారు పెద్దగా మాట్లాడరని అంటుంటారు.. కానీ వారి మనసుకు ఎవరైనా దగ్గరైనా, ఎదుటి వారి వ్యక్తిత్వం వారికి నచ్చినా.. వారు బాగా మాట్లాడతారు.
వినడానికి ప్రాధాన్యత..
ఎక్స్ట్రోవర్ట్ లు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటే.. ఇంట్రోవర్ట్ లు మాత్రం ఎక్కువగా వినడానికే ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మౌనంగా ఉంటూ ఎదుటివారి మాటలను, వారి వ్యక్తిత్వాన్ని గమనించడానికి వీరు ఇష్టపడతారు. వీరిలో పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
*రూపశ్రీ.
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి. ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, గౌరవంతో , ఉత్సాహంతో జరుపుకోవడం కొనసాగుతుంది. భారతదేశ సామాజిక నిర్మాణాన్ని మార్చడంలో , సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి వాటిని బలోపేతం చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు అందడంలో అంబేద్కర్ చేసిన కృషి చాలా పెద్ది. అంబేద్కర్ జయంతి సందర్బంగా ఒక్కసారి అంబేద్కర్ గారి జీవితం గురించి గుర్తు చేసుకుంటే..
అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో జన్మించారు. ఆయన తన జీవితాంతం సమాజంలో ప్రబలంగా ఉన్న అంటరానితనం, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. అంబేద్కర్ లక్షలాది మందిలో విద్య, హక్కుల పట్ల చైతన్యం కలిగించారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి, దేశానికి ప్రజాస్వామ్య, సమానత్వ వ్యవస్థను అందించారు.
అంబేద్కర్ గురించి ఆసక్తికరమైన విషయాలు..
రాజ్యాంగ నిర్మాత..
భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని వ్యక్తం చేసేది భారత రాజ్యాంగమే.. ఈ బారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా డాక్టర్ అంబేద్కర్ పరిగణించబడతారు. ఆయన రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా , ప్రధాన రూపశిల్పిగా పిలుస్తారు.
విద్యావంతుడు..
అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత విద్యను అభ్యసించారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ మొత్తం 32 డిగ్రీలు పొందారు. ఆయన అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకరు. ఆయన బి.ఏ, ఎం.ఏ, ఎం.ఎస్.సి, పి.హెచ్.డి, డి.ఎస్.సి, ఎల్.ఎల్.డి, మరియు బారిస్టర్ ఎట్ లా వంటి ప్రముఖ డిగ్రీలను పొందారు. అంతేకాదు.. తొమ్మిది భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 64 సబ్జెక్ట్స్ లో నిపుణులు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యారు.
సామాజిక సంస్కర్త..
ఆయన తన జీవితాంతం అంటరానితనం, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడి, సమానత్వాన్ని బోధించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి బాబా సాహెబ్ మహాద్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అంటరానివారికి ప్రభుత్వ చెరువుల నుండి నీరు తోడుకునే హక్కు, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం ఆయన ప్రచారం చేశారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా, ఆయన మహిళల విడాకుల , ఆస్తి హక్కులను సాధించడానికి ప్రయత్నించారు.
భారతరత్న..
1990లో అంబేద్కర్ గారి మరణానంతరం భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ఈ పురస్కారాన్ని ఆయన సతీమణి సవితా అంబేద్కర్ కు అందజేశారు.
సత్యాగ్రహి..
నీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక సత్యాగ్రహి అంబేద్కర్ గారు మాత్రమే.
న్యాయ శాఖ మంత్రి..
అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.
*రూపశ్రీ.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది. సుదీర్ఘ కాలం పాటు ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించిన నితీష్ కుమార్ శకం ముగియగా, భారతీయ జనతా పార్టీ కీలక నేత సామ్రాట్ చౌదరి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కీలక పరిణామంతో బిహార్ రాజకీయాల్లో నవశకం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో నితీష్ కుమార్‌ను గద్దె దించే వరకు విశ్రమించనని శపథం చేసిన వ్యక్తి, నేడు ఏకంగా ఆ కుర్చీలోనే కూర్చోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గతంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో విభేదించిన సమయంలో సమ్రాట్ చౌదరి ఒక సవాల్ విసిరారు. నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి పీఠం నుండి దించే వరకు తాను ధరించిన తలపాగా (పగడీ) తీయనని, కాషాయ రంగు తలపాగాతోనే ఉంటానని 2023లో ప్రతిజ్ఞ చేశారు. అయితే మారుతున్న సమీకరణల దృష్ట్యా 2024లో బీజేపీ-జేడీయూ పొత్తు కుదరడంతో, అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన తన శపథాన్ని పక్కనపెట్టి అయోధ్యలో శ్రీరాముడికి తన తలపాగాను సమర్పించారు.
57 ఏళ్ల సమ్రాట్ చౌదరి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. వెనుకబడిన వర్గాల్లో (కుష్వాహా సామాజిక వర్గం) ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన తండ్రి శకుని చౌదరి బిహార్ రాజకీయాల్లో సీనియర్ నేతగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తల్లి పల్లవి దేవి కూడా శాసనసభ్యురాలిగా సేవలందించారు. కుటుంబ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన సమ్రాట్, అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
సమ్రాట్ చౌదరి రాజకీయ ప్రస్థానం పలు పార్టీల గుండా సాగింది. 1990లలో ఆర్జేడీలో చేరిన ఆయన, రబ్రీదేవి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం జేడీయూలో చేరినప్పటికీ, అక్కడ ఇమడలేక 2017లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ వేగంగా పెరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తే, నితీష్ కుమార్ రాజకీయాలకు స్వస్తి పలకడం లేదా కేంద్ర రాజకీయాల వైపు మళ్లడంతోనే సమ్రాట్ చౌదరికి ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. గతంలో నితీష్‌ను వ్యతిరేకించిన నేతకే ఇప్పుడు అధికార పగ్గాలు దక్కడం బీజేపీ వ్యూహాత్మక విజయంగా రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణలను సమన్వయం చేయడంలో సమ్రాట్ కీలకం కానున్నారు.
ఈ మార్పు పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. నాడు శపథం చేసిన వ్యక్తి నేడు అదే నితీష్ మద్దతుతో లేదా ఆయన వారసుడిగా రావడం రాజకీయ అవకాశవాదమని ఆర్జేడీ నేతలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా, సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బిహార్‌లో ఎలాంటి అభివృద్ధి పథకాలు చేపడతారో మరియు కుల రాజకీయాలను ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.
సమ్రాట్ చౌదరి నాయకత్వంలో బిహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ మరింత వేగంగా పనిచేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నిరుద్యోగ సమస్య పరిష్కారం మరియు పారిశ్రామిక అభివృద్ధి ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. కొత్త ముఖ్యమంత్రి రాకతో బిహార్ రాజకీయాల్లో స్థిరత్వం వస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం శ్రేణులూ, నేతలూ కూడా లోకేష్ కు పార్టీలో, ప్రభుత్వంలో మరింత కీలక స్థానం కల్పించాలని గత ఏడాదిన్నర పైగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఒక అడుగు ముందుకు వేసి ఈ విషయాన్ని చంద్రబాబు సమక్షంలోనే కొదరు స్పష్టంగా చెప్పారు కూడా. అలాగే తెలుగుదేశం శ్రేణులైనా ఒక సమయంలో లోకేష్ కు పార్టీలోనే కాదు, ప్రభుత్వంలో కూడా ప్రమోషన్ ఇవ్వాలనీ, ఆయన పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించాలనీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనీ కూడా బాహాటంగానే డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా కడప మహానాడుకు ముందు ఈ డిమాండ్ తెలుగు దేశం శ్రేణుల నుంచి చాలా చాలా గట్టిగా వినిపించింది. ఒక దశలో కడప మహానాడు వేదికగానే లోకేష్ ప్రమోషన్ ప్రకటన ఉంటుందని కూడా గట్టిగా వినిపించింది. అయితే కూటమి పరిమితుల కారణంగా అప్పట్లో చంద్రబాబు లోకేష్ ప్రమోషన్ విషయంపై బాహాటంగా ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా మందలించారు కూడా.ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. తెలుగుదేశం పార్టీకి తొట్ట తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ నియమితులయ్యారు.
నారా లోకేశ్ కు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారికం నియామకం జరిగింది కానీ.. ఆయన చాలా కాలంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాలుగా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో లోకేష్ ముద్రను బలంగా ఉంది. ఇక పార్టీ కేడర్ తో లోకేష్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. అన్నిటికీ మించి లోకేష్ యూత్ గా బాగా కనెక్ట్ అవుతారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియామకం పార్టీ పరంగా ఆయన ఇమేజ్ ను మరింత పెంచుతుందనడంలో సదేహం లేదు.
పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న లోకేష్ భావనకు అనుగుణంగానే ఇప్పుడు పార్టీ కమిటీల ప్రకటన కూడా ఉంది. రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పార్టీ మరింత బలోపేతం కావడానికి, కార్యకర్తలలో మరింత జోష్ నింపడానికి దోహదపడుతుందని తెలుగుదేశం సీనియర్లు గట్టిగా చెబుతున్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. ఆయనను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేసే దిశగా ఈ కీలక బాధ్యతలను ఆయనకు తెలుగుదేశం హైకమాండ్ అప్పగించింది. ప్రస్తుతం ప్రభుత్వంలో అత్యంత కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న నారా లోకేష్ కు పార్టీలోనూ అత్యున్నత స్థాయి బాధ్యతలు అప్పగించింది.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత.. ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కూడా నారా లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని నిర్ణయించారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంలో లోకేష్ చేసిన కృషిని గుర్తించిన తెలుగుదేశం హైకమాండ్ ఆయనకు మరింత స్వేచ్ఛ నిచ్చి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువేళ్లేందుకు అవకాశం ఇచ్చింది. అందుకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ ను నియమించింది. పార్టీ అంతర్గత వ్యవహారాలు, కమిటీల నియామకం, జిల్లాల వారీగా పార్టీ బలోపేతం వంటి అంశాల్లో లోకేష్ పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఆకర్షించడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం వంటి వాటిపై లోకేష్ దృష్టి పెడతారని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న తరుణంలో, పార్టీ బాధ్యతలను లోకేష్ పంచుకోవడం వల్ల సమతుల్యత ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు. కాగా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ పట్ల తెలుగుదేశం శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే లోకేష్‌కు ఈ పదవి అదనపు బలాన్ని ఇస్తుందన్న అభిప్రాయం పార్టీ వర్గాలో బలంగా వ్యక్తం అవుతోంది.
ఇలా ఉండగా.. తెలుగుదేశం హైకమాండ్ జాతీయ కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుల జాబితాను కూడా విడుదల చేసింది. యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ.. అనుభవజ్ఞులను పొలిట్‌బ్యూరోలో కొనసాగిస్తూ సమతూకంతో కమిటీలను రూపొందించింది. ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ కొనసాగించింది. 29 మందితో పొలిట్‌బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని తెలుగుదేశం ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని నియమించింది. అంతేకాకుండా ఉపాధ్యక్షులుగా 18, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించింది.
వెల్లుల్లితో కొలెస్ట్రాల్‌కు చెక్.. ఇలా వాడితే అద్భుత ఫలితాలు!
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి Dr Chittibhotla Madhusudana Sarma గారు వివరించిన మరిన్ని విషయాలను ఈ VIDEO ద్వార తెలుసుకుందాం.
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ప్రధాన అంశాలు:
కొలెస్ట్రాల్ నియంత్రణ: రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను వెల్లుల్లి ఎలా కరిగిస్తుంది?
గుండె ఆరోగ్యం: రక్తపోటును (High BP) అదుపులో ఉంచి గుండెపోటు రాకుండా వెల్లుల్లి చేసే మేలు.
బరువు తగ్గడం (Obesity): శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో వెల్లుల్లి పాత్ర.
మధుమేహం (Diabetes): రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి?
సరైన పద్ధతి: వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవాలా లేక వేయించి తీసుకోవాలా? ఏ సమయంలో తీసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది?
వెల్లుల్లిని ఔషధంగా వాడేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు మోతాదు గురించి డాక్టర్ గారి సూచనలను ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు. మీ ఆరోగ్యాన్ని సహజ సిద్ధంగా మెరుగుపరుచుకోవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
మరిన్ని ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వాస్తవానికి, రాగి పాత్రలో నీళ్లు తాగడం కొంతమందికి హానికరం కావచ్చని నిపుణులు అంటున్నారు. ఇంతకూ రాగి పాత్రలో నీరు ఎవరు తాగకూడదు? ఎందుకు తాగకూడదు? తెలుసుకుంటే..
రాగి పాత్రలో నీరు ఎవరు తాగకూడదు?
రాగి నీరు ఎక్కువ ఆమ్ల గుణాన్ని కలిగి ఉండి, కడుపులోని సున్నితమైన పొరను ప్రభావితం చేస్తుంది. కడుపులో పుండ్లు లేదా గ్యాస్ సమస్యలు ఉన్నవారు రాగి పాత్రలో నీరు తాగితే మంట, నొప్పి , ఎసిడిటీ పెరగడం జరిగే అవకాశం ఉంటుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థకు రాగి పాత్రలో నీరు మరింత చికాకు పెడుతుంది.
ఎసిడిటీ, అజీర్ణం..
ఇప్పటికే ఎసిడిటీ లేదా అజీర్ణంతో బాధపడుతున్న వారికి, రాగి నీరు తాగడం హాని చేస్తుందట. రాగి నీటిలోని కొన్ని పదార్థాలు కడుపులోని యాసిడ్ స్థాయిలను పెంచి, గుండెల్లో మంట, కడుపులో మంట , పుల్లటి త్రేన్పులకు దారితీస్తాయి.
పిల్లలకు ఇవ్వకూడదు..
రోజుల వయసున్న శిశువుల నుండి పసిపిల్లల వరకు.. వారి జీర్ణవ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రాగి నీరు పిల్లలలో తేలికపాటి నుండి తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. అంతేకాకుండా, పిల్లలు తాము తాగే నీటి పరిమాణాన్ని నియంత్రించుకోలేకపోవడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.
గర్భవతులు..
గర్భిణీ స్త్రీలు రాగి నీరు చాలా తక్కువ మాత్రమే తీసుకోవాలి. అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ లేదా ఇతర జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు, ఇవి తల్లికి , పిండానికి హానికరం కావచ్చు.
లివర్, కిడ్నీ వీక్నెస్..
రాగి నీరు తాగాలని అనుకునే వారు ముందు వైద్యుడిని సంప్రదించాలి, ఎందుకంటే ఇది కాలేయం , మూత్రపిండాలపై అదనపు భారాన్ని మోపే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇది శరీరంలో టాక్సిన్లు తొలగించే ప్రక్రియకు ఆటంకం కలిగించి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, 'ముద్రలు' కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే 'ముద్ర' అంటారు.
ఈ వీడియోలో TeluguOne Health మనకు కొన్ని ముఖ్యమైన యోగా ముద్రలను మరియు వాటి విశిష్టతను పరిచయం చేస్తోంది:
ముఖ్యమైన ముద్రలు - ఉపయోగాలు:
జ్ఞాన ముద్ర: జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది.
వాయు ముద్ర: గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు మరియు పక్షవాతం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
శూన్య ముద్ర: చెవి సంబంధిత సమస్యలు మరియు ఎముకల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
పృథ్వీ ముద్ర: శరీరంలో విటమిన్ల లోపాన్ని సరిచేయడానికి, అలసటను తగ్గించి ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
సూర్య ముద్ర: బరువు తగ్గాలనుకునే వారికి మరియు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది చక్కటి పరిష్కారం.
వరుణ ముద్ర: చర్మ సౌందర్యానికి, రక్త శుద్ధికి మరియు శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది.
వీటిని ఎలా వేయాలి?
ఈ ముద్రలను రోజుకు కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఏ ముద్ర ఏ వేలితో వేయాలి మరియు అది చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి.
మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన వీడియోల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
