మీ వయసును తగ్గించుకోండి 30 నిమిషాల్లో

Look Younger in 30 Minutes

                                                  ఆఫీస్ నుండి తిరిగి రాగానే హమ్మయ్యా... రోజు గడిచిపోయింది అన్న ఫీలింగ్, ఫ్రెష్ అయి కాస్త రిలాక్స్ అవుదామని కూర్చునే లోపే పిల్లలు హోం వర్క్ తీసుకుని వచ్చి కూర్చుంటారు, వాళ్ళ సంగతి చూసి డిన్నర్ కోసం ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు గుర్తుకు వస్తుంది. కజిన్ ఎంగేజ్ మెంట్ . కంపల్సరిగా అటెండ్ అవ్వాలి, టైం చూస్తే అరగంట కన్నా ఎక్కువగా లేదు. ఏముంది పార్టీకి అటెండ్ అవుతున్నామన్న ఎగ్జైట్ మెంట్ కన్నా, అమ్మో.. ఇంత షార్ట్ పీరియడ్ లో ఎలా రెడీ అవ్వాలి అన్న టెన్షన్, అప్పటికప్పుడు పార్లర్ కి వెళ్ళలేరు, అలాగని అలసటతో పీక్కుపోయినట్టున్న మొహంతో పార్టీ కి వెళ్ళ లేరు...అదిగో అలాంటప్పుడే ఎక్స్ పర్ట్స్ చిట్కాలు పనికి వస్తాయి. వాటిని కాస్త ఓపిగ్గా పాటిస్తే చాలు , నిగనిగలాడే అందం మీ సొంతం .

                        ఇప్పుడు  మీరు మొట్ట మొదటిగా చేయాల్సింది కాసేపు శ్రమ అనుకోకుండా పరుగెత్తడం , ఏంటి... ఆశ్చర్యపోతున్నారా..? నిజమండి బాబు , పరుగెత్తడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో పక్కన పెడితే రక్తప్రసరణ క్రమబద్ధమవుతున్దన్నది మాత్రం వాస్తవం, ఇక్కడ మనకు కావాల్సింది కూడా అదే, ఎందుకంటే రక్తప్రసరణ అనేది సరిగ్గా ఉంటే చర్మంలో కాంతి దానికదే వచ్చేస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా పరుగెత్తడం మొదలుపెట్టండి. అలా ఒక అయిదు నిమిషాలు పరుగెత్తడానికి స్పెండ్ చేసి రెండవ చిట్కా దగ్గరికి రండి .

 

రెండవ చిట్కా : ఒకసారి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోండి . మీ మొహం లో అన్నింటికన్నా డల్ గా ఉన్న ఏరియా ఏది..? అఫ్ కోర్స్ కళ్ళే.. ఏముంది అక్కడినుండే మొదలుపెడదాం . చిన్న కాటన్ ముక్క ను తీసుకుని రెండుగా విడదీసి రోజ్ వాటర్ తో తడిపి ఐదు నిమిషాలు మీ కళ్ళ పై ఉంచి కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి.

మూడవ చిట్కా : ఆలస్యం చేయకుండా ఇంట్లో ఉన్న రెండు టొమాటో లను తీసుకుని వాటి రసం తీసి మొహానికి ఫేస్ ప్యాక్ లా వేసి 3 నిమిషాలుంచి కడగండి. ఏముంది మీ మోహంలో నిగారింపు మీరే చూడగలుగుతారు.

నాలుగవ చిట్కా: ఇక అతి పెద్ద సమస్య తల వెంట్రుకలు, ఫంక్షన్స్ కి వెళ్ళాలని ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి జుట్టు ఓ పట్టాన అర్జెస్ట్ అవ్వడం కష్టం. అందుకని విసుక్కోకుండా జుట్టు మధ్య రెండు మూడు సార్లు వేళ్ళు పోనిచ్చి వాటిని అలాగే కాసేపటి వరకు పట్టి ఉంచండి. చివరగా కండిషనర్ అప్లయ్ చేసి వాటిని అలాగే వదిలేయండి.

నాలుగవ చిట్కా : ఇక పెదాల విషయానికొస్తే లైట్ గా లిప్ గ్లాస్ వాడండి . అది మొహంలో కొత్త మెరుపు రావడానికి దోహదపడుతుంది.

పై చిట్కాలను ఒక అర గంట సేపు పాటించారంటే మీరు ఇదివరకటి కంటే అందంగా , నాజూగ్గా కనిపించడం ఖాయం. వీటితో పాటు మీరు కాస్త సంతోషంగా, కాన్ఫిడెంట్ ఉండటానికి ప్రయత్నించారంటే డౌటే లేదు, పార్టీ లో స్పెషల్ ఎట్రాక్షన్ మీరే అవుతారు.