ప్రపంచ వ్యాప్తంగా ఏ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగినా ముఖ్యంగా హై లెట్ అయ్యేవి రెండే రెండు అంశాలు అవి మంచి సినిమాలు, గ్లామెరస్ ఫ్యాషన్. ఈ రెండు అంశాలే రెడ్ కార్పెట్ కి ఎంతో విలువను చేర్చుతాయి. ఈ సారి బాలీవుడ్ తారలతో తళుక్కుమన్న కేన్స్ ఫెస్టివల్ మరింత కళకళలాడింది.

ఐశ్వర్యా రాయ్ ధరించిన ఇంత మంది తారలున్న ఐశ్వర్యా రాయ్ కళ్ళు చెదిరే అందంతో వెలిగిపోయి ఫెస్టివల్ ఓపెనింగ్ నైట్ కి ప్రత్యేక కళ తీసుకు వచ్చింది. జిమ్మీ ఛూ క్లచ్ వర్క్ తో ఉన్న ఎలీసాబ్ గౌన్ లో ఆకట్టుకుంది.

మరుసటి రోజు స్ట్రాప్ లెస్ గౌన్ మరియు వైట్ శాటిన్ అర్మాని ప్రైవ్ గౌన్ లో ' స్లీపింగ్ బ్యూటీ" ప్రీమియర్ షో లో భాగంగా కార్పెట్ వాక్ చేసింది. 37 ఏళ్ళ ప్రపంచ సుందరి తన రాబోయే చిత్రం 'హీరోయిన్ ' ఫస్ట్ లుక్ ని మథుర్ భండార్కర్ తో కలిసి రిలీజ్ చేసింది.

 

 

 

 

ద ఆర్టిస్ట్" ప్రీమియర్ షో లో భాగంగా హాజరైన సోనం కపూర్ కేన్స్ ఫెస్టివల్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, చెప్పుకుంది.. జీన్ పాల్ గాల్టియర్ గౌన్ లో చోపార్డ్ ఇయరింగ్స్ , అమర్ పాలి రింగ్ ధరించిన సోనం కపూర్ కేన్స్ ఫెస్టివల్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.