పొల్యుషన్ అంటే కేవలం రోడ్ల పైనే కాదు. మన ఇంట్లో కూడా ఉంటుంది అంటే నమ్మగలరా? మన ఇంట్లో మనకి హాని చేసే ఎన్నో కాలుష్య కారకాలు ఉంటాయట. 12 రకాల భయంకరమైన రసాయన కారకాలు మన ఇంట్లోనే ఉంటాయట. ఇవి బయట పొల్యుషన్ కంటే మనకి ఎక్కువ హాని చేస్తాయి. ఎప్పుడూ తలుపు, కిటికీలు మూసేసి ఉంచే ఇళ్ళల్లో వీటి ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ. మరి వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా...

బయటకి వేసుకువెళ్ళిన చెప్పులని ఎలాంటి పరిస్తితుల్లో కూడా ఇంటి లోపలికి తీసుకురాకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. వాటి నుంచి హాని కలిగించే బ్యాక్టీరియా గాలిలో కలిసి, మన ఇంటిఫ్లోర్, కార్పెట్ లలో చేరుతుందట. అక్కడి నుండి మన శరీరంలోకి చేరుతుంది. చాలా వరకు మన అనారోగ్యానికి ఇది కూడా ఒక కారణం అంటే నమ్మగలరా?

డ్రైక్లీనింగ్ నుంచి రాగానే వెంటనే బట్టలు వాడటం మంచిది కాదు. వాటిలో కూడా కొన్ని హానికరమైన క్రిములు ఉంటాయి. కాబట్టి రెండు, మూడు రోజుల తర్వాత వాడితే మంచిది. అలాగే మన ఫ్యాన్ రెక్కలకి, కిటికీ గ్రిల్స్, తలుపులు ఇవన్నీ బ్యాక్టీరియా నిల్వ ఉండే ప్రదేశాలు. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం మంచిది. అలాగే దుమ్ముని ఎప్పుడూ దులపకూడదు. కేవలం తడిబట్టతో తుడవాలి. లేకపోతే మనం పీల్చే గాలిలో చేరి, మన ఊపిరితిత్తులలోకి దుమ్ము చేరిపోతుంది. కాబట్టి మన అందమైన ఇంటిని పొల్యుషన్ లేకుండా ఉంచుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

 

- రమ