తొడల కొవ్వు తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారా.. ఈ అయిదు టిప్స్ ఫాలో అయిపోండి!
శరీర సౌష్టవం బాగుంటే ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వస్తుంది. శరీర సౌష్టవం సరిగా లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. బాడీ షేమింగ్ పట్టించుకోనక్కర్లేదు.. అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అసలు శరీర సౌష్టవం దెబ్బతింటే దాన్నలాగే ఎందుకు వదిలేయాలి. నిజానికి శరీరాకృతి మారిపోయిన శరీరంలో ఏదో ఒక అసౌకర్యం, ఏదో ఒక సమస్య ఉండనే ఉంటాయి. అందుకే శరీరాన్ని చక్కని రూపానికి తెచ్చుకోవడం మంచిది. మహిళలలో ఎక్కువగా తుంటి భాగంలో కొవ్వు పేరుకుని పోతుంటుంది. దాన్ని వదిలించుకోవడానికి కష్టపడుతుంటారు. అయితే తుంటి కొవ్వు తగ్గించుకోవడానికి ఐదెంటే ఐదే టిప్స్ ఫాలో అయితే చాలు..
లోయర్ బాడీ వ్యాయామాలు..
తుంటి కొవ్వు తగ్గాలంటే లోయర్ బాడీ అంటే దిగువ శరీరం వ్యాయామాలు ఫాలో కావాలి. హిప్స్, గ్లుట్ లను చక్కని ఆకృతిలోకి తీసుకురావడానికి లంగ్స్, స్క్వాట్ ల, లెగ్ రైజ్ లు వంటి దిగువ శరీర వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. వీటిని రోజూ ప్రాక్టీస్ చేయాలి.
కౌంట్ పెంచాలి..
వ్యాయామంలో భాగంగా చాలామంది నడవడం, జాగింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం మొదలైనవి ఫాలో అవుతారు. వీటిని సాధారణంగా చేయడం కంటే మరికాస్త ఎక్కువ సమయం పొడిగించి చేయాలి. ఇవి హిప్ కండరాలను బిగించి చక్కని ఆకృతి రావడంలో సహాయపడతాయి. కార్డియోవాస్కులర్ వ్యాయామాలు అదనపు కేలరీలు వదిలించుకోవడానికి సహాయపడతాయి.
ఈ ఫుడ్ కు దూరం..
ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో అసంతృప్త కొవ్వులు, అదనపు చక్కెరలు ఉంటాయి. ఇవి తుంటి భాగంలో పేరుకుని పోతాయి. వీటని తింటూ ఎన్ని వ్యాయామాలు చేసినా ఫలితం శూన్యం. వీటికి బదులుగా బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాలు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. పైబర్ ఆహారానికి పెద్ద పీట వేయాలి.
నీరు..
నీరు శరీరానికి ఇంధనం వంటిది. ప్రతిరోజూ శరీరానికి తగిన మోతాదులో నీటిని తాగడం వల్ల శరీరంలో టాక్సిన్ లు బయటకు పోతాయి. శరీరంలో అన్ని అవయవాల పనితీరు బాగుంటుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
నిద్ర..
శరీరంలో కణాల మరమ్మత్తు జరగడానికి నిద్ర కూడా చాలా ముఖ్యం. శరీరంలో పేరుకున్న కొవ్వు కోల్పోవడానికి నిద్ర ప్రముఖ పాత్ర వహిస్తుంది. నిద్ర శరీరానికి ఊరటనిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి శరీరం చురుగ్గా ఉంటుంది.
*నిశ్శబ్ద