నేను అమ్మ కన్నా మంచి అమ్మను కాను

అమ్మ మనకు మనము తెలియకమున్దె మనము తెలిసిన వ్యక్తి అమ్మ. మన పేరు చెబితె చాలు ప్రపన్చమ్ మనలని గుర్తిన్చాలని తపన పడే వ్యక్తి అమ్మ. తన వూరూ, పేరు కన్న మన పేరు బయట లోకాని కి తెలియాలని తపత్రయపడేది. చిన్నపుడు అమ్మ తిడితె - మన్చి చెడు నేను చెప్పకపోతే ఎవరు చెప్పుతారు? అమ్మ పెన్చిన బిడ్డ,అయ్య పెన్చిన బిడ్ద అని అడుగుతారు అని అన్నప్పుడు అర్థము కానిది, కాపురము మొదలైనప్పుడు బాగా తెలిసివచ్చిన్ది తొన్దర్గ తెమలన్డి,టైమ్ ప్రకారము వున్డాలీ అని చెపితే అబ్బా నస, అనుకొనే దాన్ని,ఇప్పుడు పిల్లల్లకు టైమ్ ప్రకారము నేర్పిన్చినప్పుడు-అచ్చు అమ్మ లాగానే మాట్లాడుతున్నాన్నె. ......... ఆడపిల్లవి-గెన్తకు,దూకకు,అల ఎవరితొ పడితె వాల్లతొ మాటలడకు-అన్నప్పుడు నా అన్త ఫెమినిస్టు వున్దదెమో.ఇప్పుడు నా కూతూరి కి చెప్పే మాటలు అన్ని జాగ్రతలు అని నేను చెబితే మీరు నమ్మాలి. అమ్మ కన్న బాగా చదువుకొన్నా, లోకము చూసినా, మా అమ్మ కన్నా నేను మన్చి అమ్మను కాలేను. మరి అన్త మన్చి అమ్మ కు అమ్మైన అమ్మమ్మ ఇన్కా ప్రియము. మీ అమ్మ, అమ్మమ్మ కూడా మీకు అన్తే కదా.

--కనకదుర్గ జొన్నలగడ్డ