చక్కనైన ముఖానికి ఐకానిక్ మేకప్ ఇదిగో…
చక్కనైన ముఖాకృతి అందరు అమ్మాయిలకూ ఒక కల. ఈ కాలంలో ముఖాకృతి అనేది ముఖంలో సరిగా స్పష్టంగా లేకపోయినా దాన్ని మేకప్ సహయంతో తీసుకొస్తున్నారు. అయితే మఖం చక్కని ఆకృతిలో కనిపించడానికి వేసే మేకప్ ను ఫాషన్ పరిభాషలో కాంటూరింగ్ అని అంటారు. కాంటూరింగ్ అందరికీ సాధ్యం కాదు. అందులో ఫెయిల్ అయ్యేవారే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ముఖం చక్కని ఆకృతి రావడానికి మేకప్ వేయడంలో దేన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి?? ముఖం మీద ఏ ప్రాంతంలో ఎలాంటి షేడ్ వాడాలి?? ఎక్కడ ముఖ చర్మాన్ని సమర్థవంతంగా కవర్ చేయాలి?? వంటి విషయాలు తెలిసి ఉండాలి. ఈ ట్రిక్స్ తెలియకపోతే ఎంత ఖరీదైన మేకప్ సామాగ్రి ఉన్నా అది వ్యర్థమే.
కొందరికి ముక్కు, మరికొందరికి బుగ్గలు, ఇంకొందరికి గడ్డం ఇలా ఒక్కొక్కరికి ఒకో ప్రాంతంలో ముఖం అందాన్ని పాడుచేసేలా ఉంటుంది. అయితే దాన్ని మేకప్ సహాయంతో సవరించడం వల్ల ముఖం మొత్తం చక్కని అకృతిలోకి మారుతుంది. మరీ ముఖ్యంగా బొటాక్స్ లిఫ్ట్ షేప్ అనేది చాలామంది ఫాలో అవుతున్నారు. దీన్ని పొందడానికి చాలామంది ప్రయత్నాలు చేసి విఫలం అవుతున్నారు. మేకప్ వేయడంలో ఎంతో పట్టు ఉంటే తప్ప దాన్ని సరైన క్రమంలో వేయలేరు అని ఎంతో మంది అంటూ ఉంటారు. అయితే ఇలాంటివి సులువు చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి.
ముఖాన్ని చక్కని ఆకృతిలో తీసుకురావడానికి ట్రేండింగ్ లో ఉన్నది టేప్ ట్రిక్:-
టేప్ ముక్కని ముఖం మీద నిర్ణీత ప్రాంతంలో అతికించి మేకప్ వేయడం ద్వారా చక్కని ఆకృతి తీసుకురాగలుగుతారు. ఇది ఎలా వేయాలంటే…
బొటాక్స్ లిఫ్ట్ షేప్ కోసం మొదట టేప్ ను తీసుకోవాలి. ఈ టేప్ ను కుడివైపు చెవి దగ్గర మొదలు పెట్టి దాన్ని క్రాస్ గా తీసుకుని పెదవుల మూలల మీదుగా అంటే టేప్ కాస్త పెదవుల లోపలికి వెళ్ళాలి. ఇలా కొనసాగించి దాన్ని మళ్ళీ ఎడమ చెవి వైపుకు తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల టేప్ ఎడమ చెవి నుండి పెదవుల మీదుగా కుడి చెవి వరకు పరచుకుంటుంది. ఇవి రెండు వైపులా ఓకేవిధంగా ఉండేలా చూసుకోవాలి. ఏ వైపు అయినా కాస్త వంకరగా ఉందంటే మేకప్ తరువాత షేప్ కూడా వంకరగా కనిపించే అవకాశం ఉంటుంది.
టేప్ ను సరిగ్గా సెట్ చేసిన తరువాత బుగ్గల మీద కాంటూర్ క్రీమ్ ను అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేటప్పుడు ఆ క్రీమ్ పొరపాటున కూడా టేప్ కిందుగా వెళ్లకుండా చూసుకోవాలి. కాంటూర్ క్రీమ్ అప్లై చేసుకున్న తరువాత టేప్ ను మెల్లగా తొలగించాలి. ఇప్పుడు టేప్ తీసివేసి రివర్స్ లో మేకప్ వేయాలి. సాధారణంగా ఉపయోగించే బ్లష్, పౌడర్, హైలెట్ మొదలైన వాటిని ఉపయోగించవచ్చు.
సీక్రెట్ టిప్:-
ఈ కాంటూరింగ్ మేకప్ వేసేటప్పుడు మెఙ్ఖమ్ మీద టేప్ అప్లై చేయడానికి రెండు రకాల టిప్స్ వాడచ్చు. ఒకటి కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు నోటి భాగం లోకి టేప్ జోప్పిస్తూ టేప్ అతికించడం. టేప్ నోట్లోకి వెళ్లడం ఇష్టం లేనివారు టేప్ ను చెవి నుండి పెదవి మూలల వరకు ఒకటి, ఆ తరువాత రెండు భాగం వైపు కూడా అలాగే రెండవ ముక్కను అతికించవచ్చు. ఈ టేప్ జిగురు ఇబ్బంది పెట్టకుండా మాశ్చరైజర్ రాయవచ్చు.
◆నిశ్శబ్ద.