పటియాల సల్వార్ కమీజ్

                        పంజాబీ సూట్ మాదిరిగానే నిండుగా ఉండి , ఏ వయసువారికైనా కంఫర్టబుల్ గా ఉండే రీతిలో సరికొత్త డిజైన్స్ తో అలరిస్తున్నాయి పటియాలా కలెక్షన్స్. ఇంత పర్టికులర్ గా ఈ డిజైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఇవేమీ మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన మాడలేమీ కాదు, అలాగని తక్కువ అంచనా వేయకండి. ఈ పటియాలా డ్రెస్ కి రాజుల నాటి చరిత్ర ఉంది.

పూర్వం పంజాబ్ లోని పటియాలా అనే ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడట. ఆయన ఎప్పుడూ బ్యాగీ టైపు సల్వార్ తో పాటు ఫుల్ స్లీవ్స్ ఉన్న కమీజ్ వేసుకునేవాడంట. ఆయన వేషధారణ నచ్చిన జనం ఆ డ్రెస్ కి పటియాలా డ్రెస్ అని పిలవడం పెట్టారు. ధరించిన వారికి కంప్ఫర్ట్ ఉండి వెరైటీగా, నిండుగా కనిపించే ఈ పటియాలా డ్రెస్ కి ఇప్పటికీ జనంలో అంతే క్రేజ్ ఉంది. ఈ పటియాల సల్వార్ కమీజ్, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసులవారికి, మంచి లుక్ ని ఇస్తాయి. దానితో పాటు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి.

ఇప్పుడు ఈ పటియాల సూట్ లలోను సరికొత్త డిజైన్స్ వచ్చాయి. మనకు నచ్చిన మెటీరియల్ వాడొచ్చు, నచ్చిన ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు, నచ్చిన సైజుల్లో కుట్టించుకోవచ్చు. ధరించగానే హుందాగా, నిండుగా కనిపించే పటియాలా డ్రెస్ లను ఇష్టపడేవారికోసం, చూడగానే ఆకర్షించే రీతిలో ఉన్న కొన్ని పర్టికులర్ డిజైన్స్ మీ ముందుకు తీసుకు వచ్చింది తెలుగువన్.