ఫ్యాషన్ అంటే మనం వేసుకునే బట్టలే కాకుండా..కాళ్ళకు వేసుకునే చెప్పులు కూడా స్టైలిష్ గా ఉంటేనే బాగుంటుంది. కొత్తగా స్ట్రాప్స్ లేని చెప్పులు ఇప్పుడు యువతులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా...

 

నడిచేటప్పుడు మనం వేసుకున్న చెప్పులకు ఉన్న స్ట్రాప్స్ తెగిపోతేనే ఎలా నడవాలి అని ఆలోచిస్తారు. ఇపుడు స్ట్రాప్స్ లేకుండా ఎంచక్క నడవవచ్చు. అయితే వెనుక మడమల భాగంలో పెట్టుకునేందుకు బెల్టు ఉంటుంది. సో... మాములు చెప్పుల వలె వీటిని కూడా వేసుకొని నడవవచ్చు. దీనివల్ల మీ పాదాల మీద నల్లటి చారలు పడే అవకాశం కూడా ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం... ఇలాంటి కొత్త కొత్త ఫ్యాషన్ ను ఫాలో అయిపోండి.