మ్మాయిలందరూ ఒకప్పుడు జుట్టును సన్నగా, సిల్కీగా ఉండేలా చూసుకునేవారు. కానీ ఇప్పుడంతా కొత్త లుక్ తో అదరగొడుతున్నారు. అమ్మాయిల హెయిర్ స్టైల్ లో ఎన్ని రకాలున్నాయో చెప్పడం కష్టం. అయితే ఇప్పుడంతా రింగు రింగుల హెయిర్ స్టైల్ పై మోజు పడుతున్నారు.

 

"హ్యాపీ డేస్" చిత్రంలో సోనియా రింగు రింగుల హెయిర్ స్టైల్ తో కనిపించినప్పటి నుండి ఆ స్టైల్ మరింత పాపులర్ అయ్యింది. ఈ జాబితాలో సోనియా ఒక్కతే కాదండోయ్... తాప్సీ, నిత్యమీనన్, హన్సిక, అయేషా శివ వంటి తారలు కూడా చేరారు.

 

పార్టీలు, పబ్బులకు, ఫంక్షన్ లకు వెళ్ళినప్పుడు ఈ హెయిర్ స్టైల్ వలన మరింత అందం వస్తుందని అమ్మయిలు భావిస్తున్నారు. అంతే కాదండోయ్... ఇలా రింగు రింగుల జుట్టు ఉన్న అమ్మాయిలను చూసి అబ్బాయిలు కూడా ప్రేమలో పడిపోతున్నారంటా.