Indian Party Wear Fancy Saree

 teluguone vanitha provides latest collection of party wear sarees, designer party wear saree designs, fancy indian party wear saree designs and more...

చీరకట్టులో వుండే అందమే వేరు. అయితే కంచిపట్టు చీరలకు కాలం చెల్లిపోయింది. అవి

కేవలం పెళ్ళి, పేరంటాల సందర్భాలకే పరిమితం అయిపోయాయి. Georgettes,

chiffons, crepes, silks, satins, synthetics, crushed silk చీరలను పార్టీ వేర్ గా

భావిస్తున్నారు. మీ పర్సనాలిటీకి అనుగుణమైన texture, color combinations గల

డిజైనర్‍ శారీస్ ని సెలెక్ట్ చేసుకుని, మీ వార్డ్ రోబ్ లో చేర్చడం మొదలు పెట్టండి.

* మహిళలకు 'బటర్‍ ఫ్లై పల్లు' డిజైనర్‍ శారీస్ లో జార్జెట్‍ ఇంకా షిఫాన్ చీరలు ఎటువంటి

వారికైనా నప్పుతాయి. తేలికగా వుండి, ఒంటిని అతుక్కున్నట్టుగా వుండటం వీటికున్న ప్లస్

పాయింట్‍ గా చెప్పుకోవచ్చు. వివిధ రకాల డిజైన్లలో Sequins, mirrors, stones తోటి

ఎంబ్రాయిడరీ చేయబడి, హెవీ పల్లు తో గానీ, బార్డర్లు లేకుండాగానీ వుండేలా చూసుకోండి.

'బటర్‍ ఫ్లై పల్లు' (butterfly pallu) వున్న చీరలను లేటెస్ట్ క్రేజ్‍ గా చెప్పుకోవచ్చు. కొంగు

భాగంలో క్లాత్ మొత్తం ప్లీట్స్ గా కలెక్ట్ చేసి, అక్కడినుంచి పైట భాగాన్నిఅందమైన రీతిలో

విసనకర్రలాగ క్రిందకి వదిలేయడం ఈ పల్లు ప్రత్యేకత.

టీనేజర్లకు స్పెషల్‍ శారీస్ ఇవికాకTechnicolor or abstract prints వున్న చీరలు పార్టీ

వేర్‍ క్రింద పాప్యులర్‍ అయ్యాయి. పార్టీలకు చీరలు కట్టుకోవాలని ఆశపడే టీనేజర్లకు ఇవి

ఒక వరమని చెప్పొచ్చు. ఈ చీరల మీది ప్రింట్లు కాంట్రాస్ట్ కలర్స్ లో వుంటాయి. నలుపు

రంగు చీరమీద తెలుపు, ఎరుపు లేదా నీలం రంగుల్లో డిజైన్ల ప్రింట్లు వుంటాయి.

పలురంగులతో కూడిన ప్రింట్ల ద్వారా స్టన్నింగ్‍ లుక్‍ ఇవ్వడమే ఈచీరల ఉదేశ్యం. Zebra

లేదా Tiger prints వుండే చీరల్ని పార్టీ వేర్ గా టీనేజర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.