చాక్లెట్ తినడం వల్ల మహిళల పీరియడ్ పెయిన్ తగ్గుతుందా.. అసలు నిజమేంటంటే!

చాక్లెట్ తినడం వల్ల మహిళల పీరియడ్ పెయిన్ తగ్గుతుందా.. అసలు నిజమేంటంటే! ఒక వయసు వచ్చాక ప్రతి ఆడపిల్లకు, మహిళకు నెలసరి రావడం చాలా సహజం. ఇది ప్రకృతి సిద్దంగా జరిగిపోయే చర్య. అయితే మహిళల నెలసరిలో చాలా మంది కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం  నడుము నొప్పి,  తలనొప్పి  వంటి సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.  అయితే చాలా మంది మహిళలు తమ పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తినడానికి ఇష్టపడతారు.  చాక్లెట్ తినడం వల్ల నెలసరి  నెప్పి తగ్గుతుందని అంటుంటారు. ఇందులో నిజమెంత అనేది చాలామందికి తెలియదు.  అసలు పీరియడ్స్ టైంలో చాక్లెట్ తినడం వల్ల పీరియడ్స్ పెయిన్ నిజంగా తగ్గుతుందా? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పీరియడ్స్ సమయంలో చాక్లెట్.. పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తినడం చాలామందికి మంచి ఉపశమనంలా అనిపిస్తుంది. ఎందుకంటే చాక్లెట్ లో మెగ్నీషియం ఉంటుంది. ఇది గర్భాశయ కండరాలను సడలించడానికి సహాయపడుతుంది. చాక్లెట్ తినడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తింటే నెలసరి నొప్పి నుండి కాస్త ఉపశమనం గా అనిపిస్తుంది. చాక్లెట్ తినడం వల్ల సెరటోనిన్ పెరుగుతుంది.  సెరోటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్..  చాక్లెట్ తిన్నప్పుడు ఈ హ్యాపీ హార్మోన్ అనేది పెరగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్,  చిరాకు,  అలసట, నీరసం వంటివి తగ్గుతాయి.  పీరియడ్స్ సమయంలో కూడా శరీరం చురుగ్గా ఉంటుంది. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి, ఇవి నొప్పిని తగ్గించడంలో  కాస్త సహాయపడతాయి. ఏ చాక్లెట్ తినడం మంచిది? 70% లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్   తినడం మంచిది.  ఎక్కువ చక్కెర ఉన్న మిల్క్ చాక్లెట్‌లో కోకో తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయోజనం కూడా తక్కువగా ఉండొచ్చు. అధికంగా చాక్లెట్ తింటే చక్కెర, కేలరీలు ఎక్కువగా తీసుకున్నట్లవుతుంది. ఇది బరువు పెరగడానికి,  డయాబెటిస్ రావడానికి కూడా కారణం అవుతుంది. ఎంత మోతాదులో తినాలి? రోజుకు సుమారు 20–30 గ్రాముల డార్క్ చాక్లెట్ చాలామందికి సరిపోతుంది. దీన్ని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. దీని కంటే ఎక్కువ చాక్లెట్ తినకూడదు.                               *రూపశ్రీ.

జాగ్రత్త.. వర్షాకాలంలో మహిళలకు ఈ వ్యాధులు వ్యాధులు వస్తాయ్!

జాగ్రత్త.. వర్షాకాలంలో  మహిళలకు ఈ   వ్యాధులు వ్యాధులు వస్తాయ్! వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, ఇది అనేక ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలు వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలో తేమ పెరగడం, వర్షంలో తడిసినప్పుడు  తడి బట్టలతో ఉండటం, చెమట మొదలైనవి   బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటిని వేగంగా పెంచి మహిళలలో వివిధ రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. వర్షాకాలంలో మహిళలకు చర్మ సమస్యలు , ప్రైవేట్ పార్ట్స్ కు సంబంధించిన సమస్యలు చాలా  ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి.  కొన్నిసార్లు, మహిళలు చేసే చిన్న  నిర్లక్ష్యం కూడా తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. అందువల్ల ఈ కాలంలో మహిళలు తమ వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారం , రోజువారీ అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.  మహిళలను ఇబ్బంది పెట్టే అత్యంత సాధారణ ఇన్ఫెక్షన్లు ఏమిటో , వాటిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలుసుకుంటే.. మూత్రనాళాల ఇన్పెక్షన్.. వర్షాకాలంలో  తేమ పెరగడం వల్ల  బాక్టీరియా  కారణంగా   మహిళల్లో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగవచ్చు. ఈ ఇన్ఫెక్షన్లు మూత్రాశయం, మూత్రనాళం లేదా మూత్రపిండాలను ప్రభావితం చేయవచ్చు. సాధారణ లక్షణాలలో మూత్రవిసర్జన సమయంలో మంట, పదే పదే  మూత్రవిసర్జన కు వెళ్లాల్సి రావడం, పొత్తికడుపు నొప్పి , కొన్నిసార్లు జ్వరం ఉంటాయి. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారవచ్చు. నివారణ.. మూత్రనాళాల ఇన్పెక్షన్ తగ్గాలంటే..  రోజంతా తగినంత నీరు త్రాగాలి.  ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోకూడదు.  టాయిలెట్ ఉపయోగించిన తర్వాత పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తడి బట్టలు లేదా లోదుస్తులను ఎక్కువ సేపు ధరించి ఉండరాదు, వాటిని వెంటనే మార్చడం మంచిది.  కాటన్  లోదుస్తులు ధరించడం మంచిది.  ఈస్ట్ ఇన్ఫెక్షన్.. వర్షాకాలంలో పెరిగే తేమ శిలీంధ్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, దీనివల్ల మహిళల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగే అవకాశం ఉంటుంది. దీని వలన జననాంగాలలో దురద, మంట, ఎరుపుదనం , తెల్లటి స్రావం కలగవచ్చు. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం , ఎక్కువసేపు తడి బట్టలలో ఉండటం దీనికి  ప్రధాన కారణాలు. నివారణ.. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. తడి బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు.   మర్మాంగాలను శుభ్రంగా ఉంచుకోవాలి.   అధిక సువాసన గల ఉత్పత్తులను వాడకూడదు.  అధికంగా  చెమట పట్టినప్పుడు బట్టలు మార్చుకోవడం ఎంతో మేలు.  ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్.. వర్షాకాలంలో చర్మంపై ఎక్కువసేపు తేమ ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. తామర, దురద, ఎరుపుదనం , దద్దుర్లు దీని సాధారణ లక్షణాలు. ఈ సమస్య మెడ, చంకలు, గజ్జలు , చర్మపు మడతలు ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. నివారణ .. చర్మాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి.   స్నానం చేసిన తర్వాత శరీరాన్ని బాగా తుడుచుకోవాలి.  ఇతరుల తువ్వాళ్లు లేదా బట్టలు ఉపయోగించకూడదు.  చెమట పట్టినప్పుడు  బట్టలు మార్చుకోవాలి.  వైద్యుని సలహా లేకుండా ఎలాంటి క్రీమ్ లు వాడకూడదు. బాక్టీరియల్ వాగినోసిస్.. జననాంగాలలో మంచి , చెడు బ్యాక్టీరియాల సమతుల్యతకు భంగం కలిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల దుర్వాసన, అసాధారణ స్రావాలు , అసౌకర్యం కలగవచ్చు. వర్షాకాలంలో పెరిగే తేమ ఈ సమస్య వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. నివారణ ..  వ్యక్తిగత పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి.  రసాయనాలు కలిగిన ఉత్పత్తులను వాడకూడదు. శుభ్రమైన, కాటన్  లోదుస్తులు ధరించాలి. తగినంత నీరు త్రాగాలి.   పైన చెప్పుకున్న సమస్యలలో ఏ లక్షణాలు కనిపించినా వైద్యుడిని సంప్రదించడం మంచిది.                               *రూపశ్రీ.

గడ్డం వెంట్రుకలు ఎంత తొలగించినా తగ్గడం లేదా.. అసలు కారణం చెప్పిన వైద్యులు!

గడ్డం వెంట్రుకలు ఎంత తొలగించినా తగ్గడం లేదా? అసలు కారణం చెప్పిన వైద్యులు! మహిళలను చాలా ఇబ్బంది పెట్టే వాటిలో అవాంచిత రోమాలు ఒకటి.  అది కూడా పై పెదవి పైన, గడ్డం మీద వెంట్రుకలు పెరగడం చాలా మంది మహిళలలో జరుగుతూ ఉంటుంది.  గడ్డం మీద పెరిగే వెంట్రుకలు మహిళల అందాన్ని పాడుచేస్తాయి. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత, కొంతమంది మహిళల గడ్డం మీద కొన్ని దట్టమైన వెంట్రుకలు ఉండటం సాధారణం, కానీ కొంతమంది మహిళలలో ఇది  తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఒకవేళ మహిళల గడ్డంలో కూడా మగవాళ్ల గడ్డంలాగే వెంట్రుకలు పెరుగుతుంటే.. అలాంటి మహిళలు హార్మోనల్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారని వైద్యులు  చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. గడ్డం మీద వెంట్రుకలు ఎప్పుడు వస్తాయి? గడ్డం మీద వెంట్రుకలు ఏ వయసులోనైనా రావచ్చు, కానీ 30 ఏళ్ల వయసు తర్వాత  ఈ సమస్య గురించి మహిళలు ఎక్కువగా ఫిర్యాదు చేస్తుంటారు. దీని తర్వాత, మెనోపాజ్ వచ్చే కొద్దీ, గడ్డం మీద వెంట్రుకల పెరుగుదల కూడా పెరుగుతుంది. కొంతమంది మహిళల్లో గడ్డం వెంట్రుకలు మగవారి గడ్డాన్ని పోలి ఉంటాయి. కొంతమంది మహిళల్లో, జన్యుపరమైన కారణాల వల్ల గడ్డం వెంట్రుకలు రావచ్చు, ఇది ఏ వయసులోనైనా సంభవించవచ్చు, కానీ హార్మోన్ల అసమతుల్యత ఉంటే, చిన్న వయసులోనే గడ్డం వెంట్రుకలు రావడం ప్రారంభం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ గడ్డం మీద వెంట్రుకలు ఎందుకు వస్తాయి? గడ్డం మీద వెంట్రుకలు రావడానికి వయసు కారణమైతే  హార్మోన్లు మారుతున్నాయని అర్థం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పురుషులలో ఆండ్రోజెన్ అనే హార్మోన్ ఉంటుంది, దానివల్ల వారికి గడ్డం పెరుగుతుంది. కానీ ఈ హార్మోన్ స్త్రీలలో కూడా ఉంటుంది, అయితే పురుషులతో పోలిస్తే చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. స్త్రీలలోని ఆండ్రోజెన్, అండాశయాలు సరిగ్గా పనిచేయడానికి, ఎముకల సాంద్రతను బాగుండటానికి , కండరాల పరిమాణాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ, స్త్రీలు మెనోపాజ్ దశకు చేరుకుంటున్నప్పుడు, ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం ప్రారంభమై, ఆండ్రోజెన్ స్థాయి పెరగడం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో, స్త్రీల గడ్డం మీద, కొన్ని సందర్భాల్లో ముఖం మీద కూడా దట్టమైన, గరుకైన వెంట్రుకలు రావడం జరుగుతుంది. వ్యాక్సింగ్ లేదా థ్రెడ్డింగ్ చేస్తే వెంట్రుకల పెరుగుదల ఎక్కువ అవుతుందా? మహిళలకు గడ్డం మీద వెంట్రుకలు  ఉంటే  వాటిని తొలగించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రోమాలను తొలగించడానికి వాక్సింగ్ , థ్రెడింగ్ అనేవి రెండు అందరూ ఉపయోగించే పద్దతులు . అయితే, వాక్సింగ్ లేదా థ్రెడింగ్ వల్ల రోమాలు మరింత ఎక్కువగా లేదా దట్టంగా తిరిగి పెరుగుతాయని చాలా మంది మహిళలు భయపడతారు. కానీ, చర్మవ్యాధి నిపుణులు ఇది నిజం కాదని చెబుతున్నారు. నిజం ఇదే..  గడ్డం వెంట్రుకలను తొలగించే ఏ పద్ధతితోనూ గడ్డంపై ఉండే వెంట్రుకలు మరింత దట్టంగా పెరగవు. వాస్తవానికి, ఈ విధంగా వెంట్రుకలను తొలగించిన వెంటనే అవి తిరిగి పెరుగుతాయి. ఈ వెంట్రుకలను ప్లాకర్లు లేదా దారంతో చాలా వేగంగా తొలగిస్తే, చర్మంలో వాపు వచ్చే అవకాశం ఉంది, దాని కారణంగా గడ్డంపై ఇన్గ్రోన్ హెయిర్  ఉంటుంది.  అది పెరగడం వల్ల చాలామంది వెంట్రుకలు తొలగిస్తే మరింత దట్టంగా పెరుగుతాయని  అనుకుంటారు. మరొక పద్దతి.. గడ్డం మీద  వెంట్రుకలను తొలగించడానికి మరో పద్ధతి కూడా ఉంది,  ఆ పద్ధతే షేవింగ్, దీన్ని మహిళలు ఎక్కువగా ఉపయోగించరు. కానీ దీని కోసం మహిళలకు ప్రత్యేక రేజర్లు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల కూడా వెంట్రుకలు పెరుగుతాయని చాలా మంది మహిళలు భయపడతారు. కానీ వాస్తవానికి అది నిజం కాదు, షేవింగ్ చేయడం వల్ల వెంట్రుకలు  పెరగవు. షేవింగ్ వెంట్రుకలను కుదుళ్ల నుండి తొలగించదు, కానీ వాటిని మధ్యలో నుండి కత్తిరిస్తుంది. అందువల్ల, అవి వేగంగా తిరిగి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెంట్రుకలు సాధారణంగా ముందు భాగంలో పలుచగా, వెనుక భాగంలో ఒత్తుగా ఉంటాయి.  ఒత్తుగా ఉన్న భాగం నుండి కత్తిరించడం వల్ల అవి మరింత ఒత్తుగా కనిపిస్తాయి. అందువల్ల,షేవింగ్ తర్వాత  జుట్టు మరింత ఒత్తుగా పెరుగుతుందని మహిళలు తరచుగా అనుకుంటారు. మహిళలకు గడ్డం మీద వెంట్రుకలు పెరిగితే వాటిని శాశ్వతంగా తొలగించుకోవడానికి లేజర్ లేదా ఎలక్ట్రోలైసిస్ వంటివి మంచి పద్దతులు. వీటి వల్ల గడ్డం మీద వెంట్రుకల పెరుగుదల శాశ్వతంగా ఆగిపోతుంది.                                          *రూపశ్రీ.

నెలసరిలో వాటిని ముట్టుకోకూడదా.. చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు!

నెలసరిలో వాటిని ముట్టుకోకూడదా.. చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు! ఋతుస్రావం, లేదా నెలసరి మహిళల జీవితంలో ఒక సహజమైన భాగం,  భారతదేశం ఎంత అబివృద్ది చెందుతున్నా మహిళల నెలసరి విషయంలో ఇప్పటికీ అంతగా అవగాహన లేదు.  చాలామంది నెలసరి గురించి బయటకు మాట్లాడాలంటే అదేదో పెద్ద తప్పుగా, మాట్లాడకూడని విషయంగా చెబుతుంటారు. కానీ దీని వల్ల మహిళలు,  కౌమారంలో ఉన్న ఆడపిల్లలు చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. ముఖ్యంగా నెలసరి సమయంలో ఊరగాయలు ముట్టకూడదని,  ఇల్లంతా తిరగకుండా ఒకవైపు కూర్చోవాలని, ఇలా చాలా విషయాలు నేటికాలంలో ఆడపిల్లలను అటు ఇబ్బంది పెడతాయి, మరొక వైపు చాదస్తం అనుకునేలా చేస్తాయి. ప్రతి సంవత్సరం మే 27వ తేదీన వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే ను జరుపుకుంటారు.  దీని సందర్బంగా నెలసరి గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే.. రక్తం రంగు..  ఋతుస్రావ రక్తం రంగు లేత ఎరుపు, గులాబీ, గోధుమ రంగు లేదా ముదురు గోధుమ రంగులో కూడా ఉండవచ్చు.  ఇది శరీరంలోని హార్మోన్ల మార్పులు, రక్త ప్రవాహం , రుతుస్రావం జరిగే రోజుపై ఆధారపడి ఉంటుంది. రక్తస్రావం రంగు ఎక్కువ కాలం పాటు అసాధారణంగా ఉంటే లేదా దానికి తీవ్రమైన వాసన ఉంటే, వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. తలస్నానం.. నెలసరి సమయంలో తలస్నానం చేయకూడదు అనేది చాలామంది  నమ్ముతారు. కానీ ఇది అపోహ అంటున్నారు వైద్యులు.  వైద్యుల ప్రకారం, నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. తలస్నానం చేయడం, స్నానం చేయడం శరీరాన్ని శుభ్రంగా ఉంచి, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.   గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కూడా కడుపు నొప్పి, తిమ్మిర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. పిఎమ్ఎస్.. పి.ఎం.ఎస్. అంటే ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ అనేది ఒక నిజమైన శారీరక ,  మానసిక పరిస్థితి. ఋతుస్రావానికి ముందు, మహిళలు మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, అలసట, తలనొప్పి , కడుపు నొప్పి వంటి సమస్యలను వస్తుంటాయి. ఇది హార్మోన్ల మార్పుల వల్ల జరుగుతుంది, అందువల్ల దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. ఊరగాయలు, పుల్లని పదార్థాలు.. నెలసరి సమయంలో ఊరగాయలు లేదా పుల్లని పదార్థాలను ముట్టుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవట.   ఇది కేవలం పాత నమ్మకాలపై ఆధారపడిన ఒక అపోహ మాత్రమేనని అంటున్నారు. కాకపోతే ఊరగాయలు శరీరాన్ని మరింత వేడిగా చేస్తాయి, దీనివల్ల నెలసరి రక్తస్రావం మరింత పెరుగుతుంది.  అందుకే ఊరగాయలకు దూరంగా ఉండమంటారు.  ఇకపోతే  ఋతుస్రావం సమయంలో మహిళలు అన్ని పనులను యధావిధిగా చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటి పనులు, వంట చేసిపెట్టేవారు ఉంటే.. ఆ నాలుగు రోజులు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. శానిటరీ ప్యాడ్.. చాలామంది మహిళలు రక్తస్రావం అధికంగా కాకుండా లైట్ గా అవుతుంటే.. శానిటరీ ప్యాడ్ ను రోజంతా మార్చకుండా అలాగే వాడుతూ ఉంటారు.  ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒకే ప్యాడ్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా పెరిగి, ఇన్ఫెక్షన్ , చర్మపు దద్దుర్ల ప్రమాదం పెరుగుతుందట. ప్రతి 4 నుండి 6 గంటలకు ప్యాడ్ మార్చాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. వ్యాయామాలు.. ఋతుస్రావ సమయంలో తేలికపాటి వ్యాయామం, యోగా , నడక చాలా మంచివి.  ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, నొప్పి, ఒత్తిడి , మానసిక స్థితి మార్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, భారీ వ్యాయామాలు చేయడం మానుకోవాలి.                               *రూపశ్రీ.

థైరాయిడ్.. మహిళలలో పిల్లలు పుట్టకుండా చేస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే!

థైరాయిడ్.. మహిళలలో పిల్లలు పుట్టకుండా చేస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే! ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్యలు చాలా సాధారణమైపోయాయి. భారతదేశంలో  థైరాయిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శరీరం హార్మోన్‌ను చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు థైరాయిడ్ సమస్యలు వస్తాయి. థైరాయిడ్ సమస్యలు ఏ వయసులోనైనా రావచ్చు. భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్యల వల్ల మహిళల్లో నెలసరి సరిగా రాకపోవడం,  పిల్లలు పుట్టకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుందని కొందరు అంటుంటారు.  అయితే దీని గురించి వైద్యులు కొన్ని విషయాలు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. థైరాయిడ్ అంటే.. మన మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇందులో T3 , T4 అనే రెండు రకాల హార్మోన్లు ఉంటాయి. ఇవి శరీర జీవక్రియ, శక్తి ఉత్పత్తి, శరీర విధులు , హార్మోన్ల సమతుల్యతను నియంత్రిస్తాయి. ఈ హార్మోన్లను నియంత్రించడానికి TSH విడుదల అవుతుంది. ఆటోఇమ్యూన్ వ్యాధులు లేదా అయోడిన్ లోపం వంటి కొన్ని పరిస్థితులలో థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి, దీనివల్ల TSH స్థాయిలు పెరుగుతాయి. దీన్ని పరిస్థితిని హైపోథైరాయిడిజం అంటారు. హైపర్ థైరాయిడిజం.. కొన్ని వ్యాధులలో T3 , T4 స్థాయిలు పెరిగి, TSH తగ్గడానికి కారణమవుతాయి, ఈ పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం లక్షణాలు.. హైపోథైరాయిడిజంలో రోగికి  అలసట ఎక్కువగా ఉండటం, మతిమరుపు, జ్ఞాపకశక్తి సమస్యలు, పొడి చర్మం, జుట్టు రాలడం, విపరీతమైన చలి, మలబద్ధకం,  రుతుచక్రం సరిగా ఉండకపోవడం పిల్లలు పుట్టడంలో సమస్యలు ఉండే  అవకాశం ఉంటుంది. హైపర్ థైరాయిడిజం లక్షణాలు.. హైపర్ థైరాయిడిజం వల్ల బరువు తగ్గడం, ఆందోళన, భయం, చిరాకు, అధికంగా చెమట పట్టడం, చేతులు వణకడం, కళ్లు ఉబ్బడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, విరేచనాలు,  రుతుస్రావం,  రుతుచక్రం సరిగా లేకపోవడం,   పిల్లలు పుట్టడంలో సమస్యలు రావచ్చు. గర్భధారణలో థైరాయిడ్ సమస్యలు.. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు తల్లి , బిడ్డ ఇద్దరికీ ప్రమాదాలను పెంచుతాయి. తల్లికి రక్తహీనత , అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది, అదే సమయంలో బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ఎదుగుదల లోపం , నెలలు నిండక ముందే ప్రసవం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా,  థైరాయిడ్ వ్యాధి అదుపులో లేకపోతే  పిల్లలు పుట్టడంలో సమస్యలు,  అబార్షన్ లు జరగడం వంటి సమస్యలు పెంచుతుంది. ప్రత్యేకించి  హైపోథైరాయిడిజం పిల్లల మానసిక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, థైరాయిడ్ వ్యాధిని ముందుగానే గుర్తించడం , సరైన చికిత్స అందించడం చాలా కీలకం. ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి.                                *రూపశ్రీ.

మహిళలలో అండాల నాణ్యత పెరగాలంటే.. ఈ టిప్స్ కావాల్సిందే!

మహిళలలో అండాల నాణ్యత పెరగాలంటే.. ఈ టిప్స్ కావాల్సిందే! పురుషులలో వీర్యకణాలు,  మహిళలలో అండాలు నాణ్యంగా ఉంటేనే వారికి తల్లిదండ్రులు అయ్యే అవకాశం లభిస్తుంది.  పునరుత్పత్తి విషయంలో మహిళలలో అండాల ప్రాధాన్యత ఉంటుంది. అండాల విడుదల, వాటి నాణ్యత సరిగా లేకపోతే మహిళలు గర్బం దరించడం చాలా కష్టం.  అయితే.. నేటి కాలంలో వయసు పెరగడం లేదా ఆలస్యంగా వివాహాలు చేసుకుని ఆలస్యంగా పిల్లలు కనడానికి ప్రయత్నం చేయడం,  ఒత్తిడి,  సరైన జీవనశైలి లేకపోవడం వంటివి మహిళలలో అండాల నాణ్యతను ప్రభావితం చేస్తాయి.  కానీ మహిళలు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటే అండాల నాణ్యత మెరుగవుతుంది.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. అండాల నాణ్యతకు ఉపయోగపడే టిప్స్.. యాంటీఆక్సిడెంట్లు.. మహిళలలో అండాల నాణ్యత మెరుగ్గా మారాలంటే.. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినాలి. ఫోలిక్ యాసిడ్.. మహిళలలో ప్రత్యుత్పత్తి ఆరోగ్యానికి పోలిక్ యాసిడ్ ఎంతో అవసరం.  అందుకే ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. ఒమేగా-3 ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.  దీనివల్ల అండాల నాణ్యత చెక్కుచెదరకుండా ఆరోగ్యంగా ఉంటుంది. నిద్ర.. నిద్రలేమి కేవలం మహిళల అండాల ఆరోగ్యాన్నే కాకుండా ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే తగినంత నిద్ర చాలా అవసరం.  నిద్ర సరిగా ఉన్నప్పుడు పునరుత్పత్తి హార్మోన్లు మెరుగ్గా పని చేయడానికి,  అందంగా కనిపించడానికి కూడా సహాయపడుతుంది. ఒత్తిడి.. ఒత్తిడి అనేది చాలా పెద్ద శత్రువు. ముఖ్యంగా మహిళలలో ఒత్తిడి సమస్య వారి పునరుత్పత్తి వ్యవస్థ మీద, హార్మోన్ల పనితీరు మీద చాలా ప్రభావితం  చూపిస్తుంది.  ఒత్తిడి హార్మోన్లు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ధూమపానం.. కొంతమంది మహిళలు పొగతాగే అలవాటులో ఉంటారు. ఇలాంటి మహిళలకు గర్బం దాల్చడం చాలా కష్టం.  పొగతాగడం వల్ల గుడ్ల నాణ్యత చాలా వేగంగా తగ్గిపోతుంది.  ప్రత్యక్ష ధూమపానం, పరోక్ష ధూమపానం కూడా ప్రమాదమే.                          *రూపశ్రీ.

మీకు ఇది తెలుసా.. PCOS సమస్యను PMOS అని మార్చారు.. కారణం ఇదే!

మీకు ఇది తెలుసా.. PCOS సమస్యను PMOS అని మార్చారు.. కారణం ఇదే! పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది మహిళల్లో ఒక సాధారణ సమస్య, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. ఇటీవల ఈ సమస్యకు సంబంధించి ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం PCOSను ఇకపై పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ (PMOS) అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల ఏకాభిప్రాయంతో ఈ దీనికి  ఈ పేరు పెట్టారు. ఈ సమస్య  ఉన్న చాలా మంది మహిళలకు వాస్తవానికి అండాశయ తిత్తులు ఉండవు కాబట్టి, "PCOS" అనే పదం వైద్యపరంగా తప్పుదోవ పట్టిస్తుందని నిపుణులు భావించారు. PCOSకు ఈ కొత్త పేరు పెట్టడానికి గల కారణాలను , అది తీసుకురాబోయే మార్పులను తెలుసుకుంటే.. పేరు మార్పు వెనుక అసలు కారణం.. జీవక్రియ, హార్మోన్లు, మానసిక ఆరోగ్యం మరియు గుండె సంబంధిత సమస్యలపై ఈ సిండ్రోమ్ చూపే ప్రభావాలు చాలా  విస్తృతంగా ఉంటాయి.  అయితే ఈ సమస్యను  దాని పాత పేరు పూర్తిగా ప్రతిబింబించడం లేదని పరిశోధకులు గుర్తించడం వల్ల, PCOS పేరును మార్చాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో, లక్షలాది మంది మహిళలను ప్రభావితం చేస్తున్నందున,  ఊబకాయం, మధుమేహం, వంధ్యత్వం, మానసిక ఆరోగ్య సమస్యలతో దీనికి సంబంధం ఉన్నట్లు ఎక్కువగా తేలుతున్నందున, ఈ పేరు మార్పు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. PCOS ను   PMOS గా ఎందుకు మార్చారంటే.. ఈ సిండ్రోమ్ లో ఒకటి కంటే ఎక్కుగా ఉండే చాలా రకాల సమస్యలను ప్రతిబింబించేలా దీనికి పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే కొత్త పేరు పెట్టారు.  పాత పేరు ఎక్కువగా అండాశయ తిత్తులపై దృష్టి సారించింది, అయితే ఈ వ్యాధి బారిన పడిన చాలా మంది మహిళల్లో తిత్తులు ఏర్పడవు. దానికి బదులుగా, ఈ సిండ్రోమ్ అంతర్గత వ్యవస్థలు, జీవక్రియ , అండాశయ పనితీరును ప్రభావితం చేస్తుంది. అందుకే పేర్లు మార్చారు. కొత్తపేరుకు అర్థం.. పాలీఎండోక్రైన్: అనేక హార్మోన్ వ్యవస్థలు ప్రభావితమవుతాయి. మెటబాలిక్: ఈ పరిస్థితి ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం , మధుమేహం వచ్చే ప్రమాదంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది . ఓవరియన్ : ఇది ఇప్పటికీ అండోత్పత్తి, రుతుక్రమం , సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. సిండ్రోమ్: ఇది సంబంధిత లక్షణాలు , ఆరోగ్య ప్రమాదాల సమూహాన్ని సూచిస్తుంది.  పేరు మార్పు ఇందుకే.. పేరు మార్పు యొక్క లక్ష్యాలు రోగ నిర్ధారణను మెరుగుపరచడం, అపోహలను తగ్గించడం , మరింత కచ్చితమైన చికిత్సను ప్రోత్సహించడం అని ఎండోక్రైన్ సొసైటీ చెబుతోంది. స్కాన్‌లో అండాశయ తిత్తులు కనిపించే వరకు తమకు PCOS ఉండదని చాలా మంది మహిళలు నమ్మడం వల్ల, పాత పేరు తరచుగా రోగ నిర్ధారణను ఆలస్యం చేసిందని  నిపుణులు చెబుతున్నారు.                                          *రూపశ్రీ.

గర్భసంచిలో గడ్డలు (ఫైబ్రాయిడ్స్) రావడానికి కారణాలు ఇవే!

గర్భసంచిలో గడ్డలు (ఫైబ్రాయిడ్స్) రావడానికి కారణాలు ఇవే! గర్భసంచిలో గడ్డలు (ఫైబ్రాయిడ్స్) అనే పేరు వినగానే చాలా మంది మహిళలు తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు. "నాకు క్యాన్సర్ ఉందా?", "గర్భసంచి తీసేయాలా?" అనే ప్రశ్నలు వారిని వేధిస్తుంటాయి. అయితే, ఫైబ్రాయిడ్స్ గురించి సరైన అవగాహన పెంచుకుంటే భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సుమారు 40% నుండి 60% మహిళల్లో ఈ ఫైబ్రాయిడ్స్ ఉండే అవకాశం ఉంది. ఈ వ్యాసం ద్వారా ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి మరియు చికిత్సా విధానాల గురించి ఈ VIDEO లో వివరంగా తెలుసుకుందాం. ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి? గర్భసంచి కండరాల పొర నుండి వచ్చే గడ్డలను ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి బినైన్ ట్యూమర్స్ (Benign Tumors), అంటే ఇవి క్యాన్సర్ కారకాలు కావు. ఇవి గర్భసంచిలో అవి ఉన్న చోటును బట్టి మూడు రకాలుగా ఉంటాయి. సబ్ మ్యూకోసల్: గర్భసంచి లోపలి పొరలో ఉండేవి. ఇవి సంతానలేమికి మరియు అధిక రక్తస్రావానికి ప్రధాన కారణమవుతాయి. ఇంట్రా మ్యూరల్: గర్భసంచి కండరాల మధ్యలో ఉండేవి. సబ్ సిరోసల్: గర్భసంచి బయటి పొరపై ఉండేవి. మనం ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) చాలా మంది మహిళలు "నొప్పి లేదు కదా" అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ క్రింది కారణాల వల్ల వీటిని గమనించడం ముఖ్యం: అధిక రక్తస్రావం: నెలసరి సమయంలో గడ్డలు (clots) పడుతుంటే, అది శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ రక్తం పోతుందని అర్థం. దీనివల్ల సివియర్ ఎనీమియా మరియు గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. సంతానలేమి: గడ్డలు గర్భసంచి లోపల ఉండటం వల్ల పిండం అతుక్కోవడానికి ఇబ్బంది కలగవచ్చు. గర్భధారణ సమస్యలు: ప్రెగ్నెన్సీ సమయంలో ఈ గడ్డల వల్ల అబార్షన్లు అవ్వడం లేదా నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏమి చేయకూడదు? (What Not to Do?) నిర్లక్ష్యం చేయవద్దు: "త్యాగమయి" అనే ముసుగులో మీ సమస్యలను కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచకండి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే గర్భసంచిని కాపాడుకోవచ్చు. స్వయం వైద్యం వద్దు: రక్తస్రావం అవుతుంటే కేవలం రక్తం పెరగడానికి మందులు వాడి అసలు కారణాన్ని వదిలేయకండి. అనవసర భయం వద్దు: స్కాన్‌లో గడ్డ కనిపించగానే అది క్యాన్సర్ అని భయపడకండి. ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్‌గా మారే అవకాశం దాదాపు శూన్యం. నివారణ మరియు చికిత్స: ఎలా చేయాలి? (How to?) రెగ్యులర్ చెకప్స్: ఒకవేళ మీకు ఎటువంటి లక్షణాలు లేకపోయినా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలిస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి స్కాన్ చేయించుకుని వాటి సైజును గమనిస్తూ ఉండాలి. జీవనశైలి మార్పులు: అధిక బరువు (Obesity) లేకుండా చూసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా వీటి పెరుగుదలను కొంతవరకు నియంత్రించవచ్చు. వైద్య సలహా: అధిక రక్తస్రావం లేదా నొప్పి ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. గడ్డ ఎక్కడ ఉంది మరియు లక్షణాలు ఏమిటి అనే దానిపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. ఆధునిక చికిత్సలు: ఇప్పుడు లాప్రోస్కోపీ (Laparoscopy) వంటి కీ-హోల్ సర్జరీల ద్వారా చిన్న గాటుతోనే గడ్డలను తొలగించవచ్చు. దీనివల్ల 1-2 రోజుల్లోనే డిశ్చార్జ్ అవ్వచ్చు. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: ఫైబ్రాయిడ్స్ ఉంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలా?  జ: లేదు. ఎటువంటి లక్షణాలు (నొప్పి లేదా అధిక రక్తస్రావం) లేకపోతే కేవలం మందుల ద్వారా లేదా నిరంతర పర్యవేక్షణలో ఉంటే సరిపోతుంది. ప్ర: ఆపరేషన్ తర్వాత మళ్ళీ గడ్డలు వచ్చే అవకాశం ఉందా?  జ: ఒకటి లేదా రెండు గడ్డలు ఉన్నవారిలో రిస్క్ తక్కువ. కానీ 10 కంటే ఎక్కువ గడ్డలు ఉన్నవారిలో లేదా జెనెటిక్ కారణాల వల్ల మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్ర: గర్భసంచిని పూర్తిగా తీసేయాల్సి ఉంటుందా?  జ: 40 ఏళ్ల లోపు మహిళలకు కేవలం గడ్డలను మాత్రమే తీసే మయోమెక్టమీ (Myomectomy) చేస్తారు. 45 ఏళ్లు దాటిన వారికి, లక్షణాలు తీవ్రంగా ఉంటేనే గర్భసంచి తీసేయడం (Hysterectomy) గురించి ఆలోచిస్తారు. మహిళా ఆరోగ్యం కుటుంబానికి ఆధారం. మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోకండి. విమానంలో ప్రమాదం జరిగినప్పుడు ముందు మన ఆక్సిజన్ మాస్క్ మనం పెట్టుకున్నాకే పక్కవారికి సహాయం చేయాలన్నట్లు, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచగలరు. ఫైబ్రాయిడ్స్ సమస్యలు, చికిత్సా పద్ధతులు మరియు లైవ్ సర్జరీల గురించి మరింత లోతైన అవగాహన కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్‌ని సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

ముఖానికి వెట్ వైఫ్స్ వాడుతున్నారా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా!

ముఖానికి వెట్ వైఫ్స్ వాడుతున్నారా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా! నేటికాలంలో శుభ్రత అనేది చాలా అప్డేట్ అయ్యింది. చాలా మంది శుభ్రత కూడా లగ్జరీగా ఉండేలా చూసుకుంటున్నారు. వాటిలో బాగమే వెట్ వైఫ్స్.. చాలామంది ముఖం శుభ్రం చేసుకోవడానికి ఎక్కువగా వెట్ వైఫ్స్ వాడుతుంటారు. ఇందులలో అమ్మాయిలే ఎక్కువ.  మేకప్ తొలగించడానికి , ముఖాన్ని శుభ్రపరచుకోవడానికి వెట్ వైఫ్స్ చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తాయి.  అంతేకాకుండా, వేసవిలో  మురికి,  చెమట చాలా తొందరగా పట్టేస్తుంటాయి.  వీటిని తొలగించుకోవడానికి ఎక్కువగా వెట్ వైఫ్స్ వాడుతుంటారు. పైగా వీటిని వాడటం వల్ల మురికి, చెమట వంటివి తొందరగా, పూర్తీగా తొలగిపోవడమే కాకుండా ముఖ చర్మానికి చాలా మేలు చేస్తాయని కూడా అనుకుంటారు.  కానీ ఇవి ముఖానికి మేలు చేయకపోగా నష్టమే ఎక్కువ చేస్తాయని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.  వెట్ వైఫ్స్ వాడే ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాలు ఉన్నాయి. అవేంటంటే.. వెట్ వైఫ్స్ వల్ల కలిగే నష్టాలు.. ముఖం నుండి తేమ తొలగింపు.. చాలా వెట్ వైప్స్‌లో వివిధ రకాల సువాసనలు , ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఈ రోజుల్లో గులాబీ, లావెండర్, పుదీనా , నిమ్మ సువాసన గల వైప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడినప్పుడు చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది, కానీ  వాటి సువాసన అలర్జీలకు కారణం కావచ్చు. ఈ పదార్థాలు చర్మంలోని సహజంగా ఉండే  తేమను తొలగించి, పొడిబారడం, చికాకు , చర్మం ఎర్రబడటం వంటి వాటికి  దారితీస్తాయి. అంతేకాకుండా, వైప్స్ చర్మాన్ని పూర్తిగా శుభ్రపరచవు. అవి చర్మ రంధ్రాలను మూసివేసి, మొటిమలు , బ్లాక్‌హెడ్స్‌కు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అలర్జీ, దురద.. సున్నితమైన చర్మం ఉన్నవారు వెట్ వైఫ్స్  వాడకాన్ని చాలా తగ్గించుకోవడం మంచిది. పదేపదే వాడటం వల్ల చర్మం ఎర్రబడటం, మంట కలగవచ్చు. దీనిలోని సువాసన అలెర్జీ రియాక్షన్స్ కు, దురదకు కూడా కారణం కావచ్చు. వేసవిలో ఎక్కువ.. వేసవి కాలంలో సాధారణ కాలంలో కంటే ఎక్కువగా వెట్ వైఫ్స్ వాడుతుంటారు.  వేసవి కారణంగా ముఖం మీద పేరుకునే జిడ్డు, మురికిని వెట్ వైఫ్స్ తొలగిస్తాయని అనుకుంటారు. ఈ కారణంగా వేసవిలో వెట్ వైఫ్స్ ఎక్కువ వాడతారు.  కానీ వెట్ వైఫ్స్ ఎక్కువ వాడటం వల్ల చర్మం బిగుతుగా అనిపిస్తుంది.  ఇది క్రమంగా చర్మం మీద దద్దుర్లు, అలెర్జీ,  మొటిమలు వంటివి రావడానికి కారణం అవుతుంది. ఈ సమస్యలు కూడా రాత్రికి రాత్రే రావని, వెట్ వైఫ్స్ ను ఎక్కువగా వాడటం వల్ల క్రమంగా చర్మం మీద ప్రభావం పడటం వల్ల ఇలా జరుగుతుందని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. వెట్ వైఫ్స్ వాడినప్పుడు చర్మానికి చల్లని ఫీలింగ్ కలుగుతుంది.  కానీ ఇది వెట్ వైఫ్స్ లో ఉండే థైలిసోథియాజోలినోన్ అనే రసాయనం వల్ల ఇలా జరుగుతుంది. ఈ   రసాయనం చర్మానికి హానికరం. ఇది సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగించే ఒక సింథటిక్ ప్రిజర్వేటివ్  మాత్రమే కాదు.. క్రిమిసంహారకం కూడా. ఈ వైప్స్‌ను రోజూ వాడటం వల్ల ముఖంలోని సహజ నూనెలు తగ్గిపోయితాయి.  చర్మం యొక్క రక్షణ పొర బలహీనపడుతుంది. కాబట్టి వెట్ వైఫ్స్ తో జాగ్రత్త.                                     *రూపశ్రీ.

మహిళలలో నడుము నొప్పి.. ఈ ఆహారాలతో చెక్ పెట్టవచ్చు!

మహిళలలో నడుము నొప్పి.. ఈ ఆహారాలతో చెక్ పెట్టవచ్చు! మహిళల శరీరం ప్రతి దశలో చాలా రకాల మార్పులకు లోనవుతుంది. ఋతుచక్రం మొదలైనప్పటి నుండి.. వివాహం, గర్బం,  ఆపరేషన్లు, మెనోపాజ్..  ఇలా చాలా కారణాల వల్ల మహిళల శరీరం పోరాడుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు  వయసు పెరిగే కొద్దీ నడుము నొప్పి వస్తుంది.  కింద కూర్చోవడం లేవడం,  బరువులు ఎత్తడం,  పిల్లలను ఎత్తుకోవడం, కొన్ని సార్లు ప్రశాంతంగా పడుకోవడానికి కూడా నడుము నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది.  40 ఏళ్ల వయసు తర్వాత, పోషకాహార లోపాలు, ఎముకల బలహీనత , జీవనశైలి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఎక్కువ సేపు కూర్చోవడం, సరైన పొజిషన్ లేకపోవడం , వ్యాయామం లేకపోవడం కూడా వెన్నెముకపై ఒత్తిడిని పెంచి, ఎప్పుడూ నడుము నొప్పిగా ఉండటానికి కారణం అవుతాయి. నడుము నొప్పికి చెక్ పెట్టాలంటే మహిళలు కొన్ని ఆహారాలు తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకూ నడుము నొప్పికి చెక్ పెట్టడానికి ఏ ఆహారాలు తినాలో తెలుసుకుంటే.. నడుము నొప్పికి ప్రత్యేక ఆహారం ఎందుకు ముఖ్యం.. నడుము నొప్పి కేవలం కండరాల సమస్య మాత్రమే కాదు, ఇది ఎముకల బలహీనత, వాపు , పోషకాహార లోపాలతో కూడా ముడిపడి ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి , మెగ్నీషియం లోపం శరీరాన్ని బలహీనపరిచి, నొప్పిని పెంచుతుంది. అందువల్ల  రోజువారీ ఆహారంలో పోషకమైన ఆహార పదార్థాలను చేర్చుకోవడం ముఖ్యం. అల్లం, పసుపు.. అల్లం , పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది నడుము నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. పసుపు పాలు లేదా అల్లాన్ని టీ , ఆహారంలో కలుపుకోవచ్చు, ఇది కూడా నడుము నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. గుడ్లు,  రాగులు.. గుడ్లు కాల్షియం , విటమిన్ డికి మంచి మూలం, ఇవి ఎముకలను బలపరుస్తాయి. శాకాహారులకు రాగి ఒక అద్భుతమైన కాల్షియం కాంపౌండ్, ఇది ఎముకలను బలపరచడంలో సహాయపడుతుంది. ఆకుకూరలు.. పాలకూర, మెంతి , క్యాబేజీ వంటి ఆకుపచ్చ ఆకు కూరలలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది , గాయాలను నివారించడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్, ద్రాక్ష.. డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం ఉంటుంది, ఇది ఎముకలకు చాలా అవసరం. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. చేపలు, ఆలివ్ నూనె.. చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి వాపును తగ్గిస్తాయి. ఆలివ్ నూనెలోని బలమైన మూలకాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతారు. పులియబెట్టిన ఆహారాలు.. పెరుగు, ఇడ్లీ , దోస వంటి పులియబెట్టిన ఆహారాలలో విటమిన్ బి12 , ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి నాడీ వ్యవస్థను మెరుగుపరిచి, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఏ ఆహారాలు తీసుకోకూడదంటే.. కొన్ని రకాల ఆహారాలు నడుము నొప్పిని తీవ్రతరం చేస్తాయి. అధిక చక్కెర, ఉప్పు,  మైదా పిండితో చేసిన ఆహార  పదార్థాలు, వేయించిన ఆహారాలు , ప్రాసెస్ చేసిన ఆహారాలు వాపును పెంచి, ఎముకలను బలహీనపరుస్తాయి. అంతేకాకుండా, అధిక ఉప్పు శరీరం నుండి కాల్షియంను బయటకు తీసి, సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. కేవలం ఆహారపు అలవాట్లే కాకుండా, జీవనశైలిలో మార్పులు కూడా చాలా అవసరమని వైద్యులు నొక్కి చెబుతున్నారు. క్రమం తప్పకుండా  వ్యాయామం, సరైన పొజిషన్ లో కూర్చోవడం, నడవడం, నిలబడటం చాలా ముఖ్యం.   సమతుల్య ఆహారం నడుము నొప్పిని బాగా కంట్రోల్ లో ఉంచగలుగుతుంది.                           *రూపశ్రీ.

రోజూ ముఖానికి టమాటాను రుద్దుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా!

రోజూ ముఖానికి టమాటాను రుద్దుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా! పేరుకు కూరగాయ అయినా టమాటాను అందరూ పండు అని పిలుస్తారు.  టమాటాను కూరలో వాడతారు, నేరుగా సలాడ్ రూపంలో తింటారు. ఇది ఆహారానికి రుచిని,  శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు.. చర్మానికి అందాన్ని కూడా ఇస్తుంది.  చాలా మంది తమ చర్మ సంరక్షణలో టమాటాను చేర్చుకుంటారు. అయితే..  ప్రతిరోజూ ముఖానికి టమాటాను రుద్దుతూ ఉంటే ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ ముఖానికి టమాటా రుద్దితే.. టమాటాలో క్లీనింగ్ ఏజెంట్లు ఉంటాయి.  ప్రతిరోజూ టమాటాను ముఖానికి రుద్దుతూ ఉంటే చర్మంలో పేరుకునిపోయిన నూనె, మురికిని శుభ్రం చేయడంలో సహాయపడతాయి. సాధారణంగా చాలామంది సూర్య కిరణాల ప్రబావం వల్ల చర్మం మీద టానింగ్ సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. కానీ టమాటా టానింగ్ సమస్యను దూరం చేస్తుంది.  ప్రతిరోజూ టమాటాను ముఖం మీద రుద్దుతూ ఉంటే చర్మం మీద ఉండే టానింగ్ మెల్లిగా మాయమవుతుంది. తద్వారా చర్మాన్ని రక్షిస్తుంది. నేటికాలంలో అతిచిన్న వయంలోనే చర్మం మీద ముడుతలు, గీతలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రతిరోజూ టమాటాను రుద్దుతూ ఉంటే.. ముఖం మీద గీతలు, ముడుతల తగ్గి చర్మం యవ్వనంగా మారుతుంది. వయసు అయ్యేకొద్ది చర్మం వృద్దాప్యంగా మారుతుంది. కానీ కొందరికి చిన్న వయసులోనే చర్మం ముసలి వాళ్లలా కనిపిస్తుంది.  టమాటాతో ప్రతి రోజూ ముఖం మీద రుద్దుతూ ఉంటే చర్మం బిగుతుగా మారుతుంది. ముఖం డల్ గా, కాంతిహీనంగా ఉన్నవారు  ప్రతిరోజూ టమాటాతో ముఖం మీద రుద్దుతూ ఉంటే  చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది. ఉపయోగించే విధానం.. టమాటాను రెండు ముఖ్కలుగా కట్ చేయాలి.  సగం టమాటాను నేరుగా ముఖం మీద మెల్లిగా రసం అంతా ముఖ చర్మానికి పట్టేలాగా రుద్దాలి.  పది నిమిషాలు అలాగే ఉంచాలి.  ఆ తర్వాత ఆరిపోయాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.                                   *రూపశ్రీ.

మంచి ఆహారం తీసుకుంటున్నా హిమోగ్లోబిన్ లోపం ఉంటోందా.. అసలు కారణం ఏంటంటే!

మంచి ఆహారం తీసుకుంటున్నా హిమోగ్లోబిన్ లోపం ఉంటోందా.. అసలు కారణం ఏంటంటే! మహిళల్లో చాలామంది ఎదుర్కునే సమస్యలలో హిమోగ్లోబిన్ లోపం కూడా ఒకటి. చాలామంది మహిళలు హిమోగ్లోబిన్ లోపంతో వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. వైద్యులు చాలా వరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మందులు రాసిస్తుంటారు. అయితే.. ఈ మందులు వాడినప్పుడు మాత్రం హిమోగ్లోబిన్ పెరిగి, ఆ తరువాత తిరిగి తక్కువ స్థాయిలకు పడిపోతూ ఉంటుంది.  హిమోగ్లోబిన్  పెరగడం కోసం మంచి ఆహారం తీసుకుంటున్నా సరే.. చాలామంది మహిళలలో హిమోగ్లోబిన్ పెరగకుండా లోపంలాగానే ఉండిపోతుంది.  హిమోగ్లోబిన్ లోపం వల్ల అలసట,  కళ్లు మసకబారడం,  దృష్టి తగ్గిపోవడం, తల తిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.  అసలు మంచి ఆహారం తీసుకున్నా హిమోగ్లోబిన్ లోపం ఎందుకు వస్తుంది? దీని వెనుక కారణాలు ఏంటి?  తెలుసుకుంటే.. హిమోగ్లోబిన్ లోపం ఎందుకు వస్తుంది? మంచి ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నప్పటికీ, శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల హిమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. శోషణ ప్రాముఖ్యత.. హిమోగ్లోబిన్ పెరగడానికి  ఆరోగ్యకరమైన ఆహారం తింటే సరిపోదని వైద్యులు చెబుతున్నారు.  తినే ఆహారం మన శరీరానికి సరిగ్గా శోషించబడుతోందని కూడా నిర్ధారించుకోవాలని అంటున్నారు. చాలాసార్లు  ఆకుకూరలు, పప్పుధాన్యాలు,  పండ్ల వంటి ఐరన్  అధికంగా ఉండే ఆహారాలను సమృద్దిగా తీసుకున్నా..  శరీరం  వాటిని సరిగ్గా శోషించుకోలేవు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది, ఇది రక్తహీనతకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. విటమిన్-సి పాత్ర.. హిమోగ్లోబిన్ లోపానికి విటమిన్ సి లోపం కూడా కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే విటమిన్-సి  శరీరం ఐరన్ ను గ్రహించడానికి సహాయపడుతుంది. అందువల్ల ఐరన్  తీసుకుంటూ, నిమ్మకాయలు,  నారింజ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోతే శరీరం ఐరన్  ను శోషించుకోలేదు.  జీర్ణవ్యవస్థ.. జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే, శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీనివల్ల గ్యాస్ , ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తి, హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడానికి కారణం కావచ్చు. మహిళల్లో సమస్య ఎక్కువ.. హిమోగ్లోబిన్ లోపం  సమస్య మహిళల్లో, ముఖ్యంగా నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అయ్యేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కాకుండా, గర్భధారణ సమయంలో శరీరానికి ఎక్కువ ఐరన్ అవసరం ఉంటుంది, ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే హిమోగ్లోబిన్ తగ్గే అవకాశం ఉంటుంది. విటమిన్ -బి12, పోలిక్ యాసిడ్ లోపం.. విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్ లోపం కూడా హిమోగ్లోబిన్ పెరగకుండా అడ్డుకుంటుంది, ఎందుకంటే ఈ రెండూ ఎర్ర రక్త కణాల నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి,  శరీరంలో వీటి లోపం ఉంటే, శరీరంలో రక్తం ఏర్పడే ప్రక్రియ ప్రభావితమవుతుంది.                                 *రూపశ్రీ.

మహిళలకు నెలలో రెండు సార్లు పీరియడ్స్ వస్తే ప్రమాదమా? వైద్యులేం చెప్తున్నారంటే!

మహిళలకు నెలలో రెండు సార్లు పీరియడ్స్ వస్తే ప్రమాదమా? వైద్యులేం చెప్తున్నారంటే! నెలకు ఒకసారి రుతుస్రావం కావడం సాధారణమే. సాధారణంగా ఆడపిల్లలలో రుతుచక్రం మొదలైనప్పుడు నెలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. ఆ తరువాత చాలా ఏళ్ల వరకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావడం జరుగుతుంది.  ఆరోగ్యవంతమైన మహిళకు నెలకు ఒకసారి పీరియడ్స్ రావడం జరుగుతుంది.   అయినప్పటికీ కొందరు మహిళలకు  నెలకు రెండుసార్లు పీరియడ్స్  రావడం జరుగుతూ ఉంటుంది. నిజానికి ఇది మహిళలకు ఆందోళన కలిగించే విషయం.  అయితే, దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒక మహిళకు నెలకు రెండుసార్లు పదేపదే రుతుస్రావం అవుతుంటే, ఆమె వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అంతేకాకుండా, ఈ రోజుల్లో మహిళల్లో రుతుస్రావానికి సంబంధించిన అనేక సమస్యలు సాధారణంగా ఉంటున్నాయి.  నెలకు రెండు సార్లు పీరియడ్స్ రావడం గురించి వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. ఋతుచక్రాన్ని అర్థం చేసుకోవాలి.. సాధారణంగా, ఋతు చక్రం 28 రోజులు ఉంటుంది, కానీ అది 21 నుండి 35 రోజుల మధ్య ఉంటే, దానిని సాధారణంగా పరిగణిస్తారు. అయితే ఋతు చక్రం 21 రోజుల కంటే తక్కువగా లేదా 36 రోజుల కంటే ఎక్కువగా ఉంటే, లేదా దాని తేదీలు నెలనెలా చాలా వ్యత్యాసంగా  మారితే, దానిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గా  పరిగణిస్తారు. ఒత్తిడి లేదా జీవనశైలి మార్పుల కారణంగా  ఋతుస్రావం అప్పుడప్పుడు హెచ్చుతగ్గులకు గురికావడం కూడా పూర్తిగా సాధారణమే. అయితే, ఇది పదేపదే లేదా ఎక్కువసార్లు  జరిగితే, అది  శరీరానికి ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావడానికి కారణాలు.. హార్మోన్ల అసమతుల్యత.. నెలలో రెండుసార్లు పీరియడ్స్ రావడానికి హార్మోన్ల హెచ్చుతగ్గులే అత్యంత సాధారణ కారణం. ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు  ఋతుచక్రాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, పీరియడ్స్ క్రమరహితంగా మారతాయి. నెలలో ఒకటి కంటే ఎక్కువసార్లు పీరియడ్స్ రావచ్చు. అధిక ఒత్తిడి లేదా జీవనశైలిలో మార్పులు ఈ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయగలవని అర్థం చేసుకోవడం ముఖ్యం. PCOS.. PCOS అనేది ఒక సాధారణ హార్మోన్ల సమస్య, దీనివల్ల నెలసరి క్రమరహితంగా ఉండవచ్చు. నెలకు రెండుసార్లు కూడా రావచ్చు. ఈ పరిస్థితిలో మహిళల అండాశయాలలో చిన్న తిత్తులు ఏర్పడతాయి, ఇవి నెలసరి సక్రమంగా రావడంలో అంతరాయం కలిగిస్తాయి. గర్భాశయ ఫైబ్రాయిడ్లు.. గర్భాశయ ఫైబ్రాయిడ్లు అనేవి గర్భాశయంలో ఏర్పడే చిన్న గడ్డలు. ఈ గడ్డలు ఉన్న ప్రదేశాన్ని బట్టి , వాటి పరిమాణాన్ని బట్టి, అధిక రక్తస్రావం లేదా నెలసరిలో క్రమరాహిత్యం ఉండవచ్చు,  కొన్నిసార్లు నెలసరి నెలకు రెండుసార్లు కూడా రావచ్చు. థైరాయిడ్ సమస్యలు.. హైపర్‌థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యలు  ఋతుచక్రాన్ని అస్తవ్యస్తం చేయగలవు. ఈ వ్యాధులు థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లను ప్రభావితం చేస్తాయి, దీనివల్ల  పీరియడ్స్ సమయం, రక్తస్రావం జరగడంలో  మార్పులు వస్తాయి.                                 *రూపశ్రీ.

వేసవిలో జుట్టు ఎక్కువ రాలుతోందా.. కారణాలు, పరిష్కారాలు ఇవిగో!

వేసవిలో  జుట్టు ఎక్కువ రాలుతోందా.. కారణాలు, పరిష్కారాలు ఇవిగో! వేసవి కాలం మొదలవగానే చాలామంది జుట్టు రాలడం అనే సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్య ముఖ్యంగా ఏప్రిల్ , మే నెలల్లో మరింత తీవ్రమవుతుంది. చాలామంది ఈ హెయిర్ ఫాల్ సమస్య గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలా వేసవిలో హెయిర్ ఫాల్ కావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొందరు మాత్రం రాలుతున్న జుట్టు కారణంగా చాలా అసహనం,  డిప్రెషన్ కు లోనవుతారు.  అసలు వేసవికాలంలో జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతుంది? ఈ హెయిర్ ఫాల్ ను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు,   చిట్కాలు ఏంటి? తెలుసుకుంటే.. వేసవిలో జుట్టు రాలడానికి గల కారణాలు.. చెమట , జిడ్డు.. వేసవికాలం తీవ్రమైన వేడిగాలులను తెస్తుంది. చెమట, జిడ్డు,  దుమ్ము తలపై పేరుకుపోయి, వెంట్రుకల కుదుళ్లను మూసుకుపోయేలా చేస్తాయి. ఈ చెమట, నూనె, దుమ్ము కాంబినేషన్ జుట్టు రాలడానికి దారితీస్తుంది.   ఎక్కువ ఎండ,  పొడి బారడం.. సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు జుట్టులోని తేమను పీల్చుకుంటాయి, దీనివల్ల జుట్టు నిర్జీవంగా, పొడిగా, బలహీనంగా , సులభంగా విరిగిపోయేలా చేస్తుంది.    కుదుళ్లు.. తలలో వేడి, చెమట ఎక్కువైనప్పుడు జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి, దీనివల్ల జుట్టు పెరుగుదల ప్రభావితమవుతుంది. డీహైడ్రేషన్.. శరీరంలో నీటి కొరత వల్ల వెంట్రుకల కుదుళ్లు పొడిబారి,  జుట్టు రాలడానికి దారితీస్తుంది. తగినంత నీరు త్రాగడం చాలా అవసరం.   హార్మోన్ల మార్పులు.. వేసవి కాలంలో శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగవచ్చు, దీనివల్ల జుట్టు రాలడం జరుగుతుంది.   పోషకాహార లోపాలు.. ప్రోటీన్, ఐరన్ , విటమిన్ల లోపం వల్ల జుట్టు పలుచగా , పెళుసుగా మారుతుంది. సమతుల్య ఆహారం చాలా అవసరం. వేసవిలో హెయిర్ పాల్ తగ్గడానికి చిట్కాలు.. సరైన హెయిర్ కేర్   ను డైలీ లైఫ్ స్టైల్ లో బాగం చేసుకుంటే  జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. తేలికపాటి షాంపూయింగ్, నూనె రాయడం , తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు బలపడి, జుట్టు రాలడం తగ్గుతుంది. హోమ్ టిప్స్.. కలబంద, కొబ్బరి నూనె , ఉసిరి వంటి సహజ నివారణలు జుట్టుకు పోషణనిచ్చి, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. వారానికి రెండుసార్లు కొబ్బరి లేదా బాదం నూనెతో  జుట్టుకు మసాజ్ చేసుకోవాలి.  అయితే నూనెను అలాగే తలమీద వదిలేయకూడదు.  కనీసం ఒక గంట తర్వాత తప్పకుండా షాంపూ చేసుకోవాలి. ఇది  జుట్టును కుదుళ్ల నుండి బలపరుస్తుంది. వేసవిలో  జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు తేలికపాటి షాంపూతో  తలస్నానం చేయాలి. జుట్టుకు పోషణ అందాలంటే,  శరీర పోషణపై శ్రద్ధ వహించాలి.  శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.                              *రూపశ్రీ.

మగవారి కంటే మహిళలకు ఒమేగా-3 ఎక్కువ అవసరం ఇందుకే..!

మగవారి కంటే మహిళలకు ఒమేగా-3 ఎక్కువ అవసరం ఇందుకే..! శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల పోషకాలు అవసరం అవుతాయి. విటమిన్లు, ఖనిజాలు,  ప్రోటీన్, ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అవసరం.  వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ప్రధానమైనవి. ఆరోగ్యకరమైన జీవనానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అత్యవసరం. పురుషుల కంటే మహిళలకు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా అవసరమట. శరీరం ఎదగడానికి,  అనేక  శారీరక విధులకు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం. పురుషుల కంటే మహిళలకు ఒమేగా-3లు ఎందుకు ఎక్కువగా అవసరమవుతాయి? దీని గురించి మహిళా వైద్యులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే.. నెలసరి నొప్పి.. చాలా మంది మహిళలు నెలసరి సమయంలో కడుపు నొప్పితో సహా తీవ్రమైన బాధను అనుభవిస్తారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. కీళ్ల సమస్య.. పురుషుల కంటే మహిళలకు కీళ్లవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 40 ఏళ్ల తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది, ఇది శరీర రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. కీళ్ల నొప్పి , వాపును తగ్గించడంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. హార్మోన్ల నియంత్రణ.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం గర్భాశయానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందువల్ల, మహిళలు తమ ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను చేర్చుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల శరీరంలో వాపు కూడా తగ్గుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గర్భాశయంలో పిండం అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని పెంచుతాయి. శరీరంలో హార్మోన్లను నియంత్రించడం ద్వారా నెలసరి సమస్యలు,  హార్మోన్ల అసమతుల్యత వంటివి రాకుండా చేయడంలో కూడా ఒమేగా--3 ఫ్యాటీ యాసిడ్లు సహాయపడతాయి. గుండె ఆరోగ్యం.. ఒమేగా 3 గుండె ఆరోగ్యానికి మంచిది. ఒమేగా 3 తీసుకోవడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , రక్తంలోని కొవ్వును తగ్గిస్తుంది, తద్వారా ధమనులలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒమేగా-3 లభించే ఆహారాలు.. సాల్మన్ పిష్,ట్రౌట్, కాడ్ , రొయ్యలు,   ఆయిస్టర్స్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వాల్నట్,  చియా గింజలు,  అవిసె గింజలు, ఆకుప్చచ ఆకుకూరలలో కూడా ఒమేగా-3 ఉంటుంది.                               *రూపశ్రీ.

మహిళలకు అసలు పొట్ట ఎందుకు వస్తుంది? ఇది తగ్గాలంటే ఏం చేయాలంటే..!

మహిళలకు అసలు పొట్ట ఎందుకు వస్తుంది? ఇది తగ్గాలంటే ఏం చేయాలంటే!  అందరూ సాధారణంగా పిలుచుకునే బెల్లీ ఫ్యాట్ చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. కానీ ఇది మహిళలను చాలా ఇబ్బంది పెడుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడమే బెల్లీ ఫ్యాట్ గా పిలవబడుతుంది. అయితే ఈ పొట్ట భాగంలో కొవ్వు వచ్చినంత వేగంగా తగ్గదు. పొట్ట వచ్చిందంటే చాలామందిలో కామన్ గా అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా సులువుగా వచ్చేస్తాయి. మగవాళ్లకు పొట్ట వస్తే సరదాగా నాలుగు జోకులు వేసుకుని ఎంజాయ్ చేస్తారు. కానీ మహిళలు  దీన్ని అంత సరదాగా తీసుకోలేరు. పైగా ఇంట్లోనే వారిమీద చాలా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదురవుతాయి.  అసలు ఈ పొట్ట రావడానికి కారణం ఏంటి? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే.. మహిళలో  పొట్ట కొవ్వు పేరుకుని పోవడానికి కారణం శరీరంలో హార్మోన్ల స్థితిలో మార్పు.  జీర్ణాశయ పనితీరు తగ్గడం, జీవక్రియ రేటు దారుణంగా పడిపోవడం వల్ల పొట్ట  భాగంలో కొవ్వు పేరుకుని పోతుంది. ఈిస్టోజెన్ స్థాయిలు పెరిగి పొత్తికడుపు భాగంలో కొవ్వు పేరుకుని పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చి  పొట్ట పడుతుంది. ఇది చాలా సాధారణమైన విషయమే అయినా దాన్ని  ఎలా తగ్గించుకోవాలో చాలామందికి తెలియదు. ఈ పొట్ట కొవ్వుకు కారణం ఏంటి? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే.. ఆహారం.. సరైన ఆహారం తీసుకోకపోతే పొట్ట కొవ్వు పెరుగుతుంది. తీసుకునే చాలా ఆహారాలలో కొవ్వులు ఉంటాయి. శారీరక శ్రమకు మించి కొవ్వు పదార్థాలు తీసుకుంటే అవి పొట్ట రావడానికి కారణం అవుతాయి. జంక్ ఫుడ్, కోక్, కూల్ డ్రింక్స్, మైదా, బేకరీ ఐటమ్స్, కృత్రిమ జ్యూసులు చాలా ఈజీగా పొట్టకు కారణం అవుతాయి. పొట్ట తగ్గించాలని అనుకుంటే మొదట వీటన్నింటిని  వదిలెయ్యాలి. గర్భం దాల్చడం.. గర్భం దాల్చిన  మహిళలలో చాలామందికి  బిడ్డను మోయడం వల్ల  పొట్ట సాగుతుంది. ప్రసవం తరువాత  ఈ పొట్ట సెట్ కావడానికి చాలా సమయం పడుతుంది. కొందరు మహిళలు వ్యాయామాలు, యోగా చేయడం ద్వారా తొందరలోనే దీన్ని సెట్ చేసుకుంటారు. కానీ  ప్రసవం తరువాత బిడ్డ సంరక్షణ, శరీరం చురుగ్గా లేకపోవడం వల్ల వ్యాయామం చేయకుండా ఉంటారు. దీని కారణంగా పొట్ట కొవ్వు పేరుకుపోతుంది. పిండి పదార్థాలు.. ప్రతి ఒక్కరూ బరువు పెరగడానికి ప్రధాన కారణం పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ తక్కువగానూ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానూ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి. శరీరంలోకి వెళ్లే కేలరీల కంటే శరారీక శ్రమ ద్వారా ఖర్చు చేసే కేలరీలు తక్కువగా ఉంటే అవి కొవ్వుగా రూపాంతరం చెంది బరువు పెరుగుతారు.  ఈ కొవ్వు ఎక్కువగా శరీరంలో పొట్ట భాగంలోనే పేరుకుపోతుంది కాబట్టి ఇది బెల్లీ ఫ్యాట్ కు కారణం అవుతుంది. దీన్ని తగ్గించాలంటే కార్బోహై్డ్రేట్లు తక్కువ తీసుకోవాలి. శారీరక శ్రమ ద్వారా ఖర్చయ్యే కేలరీలకు సరిపడా కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. పరిష్కారం.. పొట్ట తగ్గడానికి ముఖ్యంగా ఆహారం నియంత్రణతో పాటు వర్కౌట్లు కూడా చేయాలి. వాకింగ్, బ్రిస్క్ వాక్, యోగా, సూర్యనమస్కారాలు,  పొట్ట తగ్గడానికి నిర్దేశించిన వ్యాయామాలు చేయాలి.   ఆహారాన్ని ఒకే సారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. ముఖ్యంగా సిట్టింగ్ వర్క్ చేసేవారు ఆహారాన్ని చాలా మితంగా తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్ గల ఆహారాన్ని , నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సిట్టింగ్ వర్క్ లో ఉన్నవారు ప్రతి గంటకు ఒకసారి ఓ 5 నిమిషాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.                                                    *నిశ్శబ్ద.

రాత్రి పడుకునే ముందు బొడ్డులో ఆవాల నూనె వేస్తే ఏం జరుగుతుందో తెలుసా!

రాత్రి పడుకునే ముందు బొడ్డులో ఆవాల నూనె వేస్తే ఏం జరుగుతుందో తెలుసా! మనిషి శరీరానికి కేంద్ర స్థానం బొడ్డు. బిడ్డ తల్లి కడుపులో పెరుగుతున్నప్పుడు  పోషకాలు అన్నీ బొడ్డు ద్వారానే అందుతాయి. అందుకే బొడ్డును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బొడ్డు ఆరోగ్యంగా లేకపోతే  కడుపు చాలా తొందరగా అప్సెట్ అవుతుంది.  బొడ్డు ఆరోగ్యం కోసం ఆవనూనె చాలా ఆరోగ్యకరమైనదిగా పేర్కొంటారు. ఈ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-3 ,  ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు,  విటమిన్ E ఉంటాయి. రోజూ పడుకునే ముందు  నాభికి ఆవనూనె రాసుకుంటే చాలా రకాల  ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని చెబుతాయట.  ఇంతకీ అవేంటో.. బొడ్డులో ఆవాల నూనె రాయడం వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే.. వెచ్చదనం.. శరీరం చలువ స్వభావం ఉన్నవారు బొడ్డులో ఆవాల నూనె వేసుకోవడం చాలా మంచిది.  ఆవ నూనెను  నాభికి పూయడం వల్ల  శరీరం వెచ్చగా ఉంటుంది, ఎందుకంటే ఆవ నూనె సహజంగానే వేడి చేసే గుణం కలిగి  ఉంటుంది. కడుపు ఆరోగ్యం.. నేటి  జీవనశైలి వల్ల చాలా మంది కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం,  కడుపులో అసౌకర్యం వంటి సమస్యలతో బాధపడటం సాధారణం అయింది.  అలాంటి సమస్యలు ఉన్నవారు  ప్రతి రాత్రి పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాయాలి, ఎందుకంటే నాబి ప్రాంతం   ప్రేగులకు అనుసంధానించబడి ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు.. ఆవ నూనెలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి  కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. శీతాకాలంలో తరచుగా కీళ్ల నొప్పులు ఎదుర్కునేవారు  పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాయాలి. ఇది మంటను చాలా వరకు తగ్గిస్తుంది, ఆర్థరైటిస్ వంటి ప్రమాదకరమైన సమస్యల  నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తి.. నేటికాలంలో చాలా మంది  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని చెబుతూ ఉంటారు. ఏ చిన్న ఇన్ఫెక్షన్లకు అయినా చాలా తొందరగా ఇబ్బంది పడతారు. బలహీనమైన రోగనిరోధక శక్తి  ఉంటే  తరచుగా అనారోగ్యానికి దారితీస్తుంది. పడుకునే ముందు నాభికి ఆవ నూనెను పూయడం వల్ల  రోగనిరోధక శక్తి మూలాల నుండి బలపడుతుంది. ఇది  ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కొన్ని రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. నిద్ర సమస్యలు.. నిద్ర సమస్యలతో బాధపడేవారు పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాసుకోవాలి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది,  మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే తగినంత నిద్ర లేకపోతే, అది రోగనిరోధక శక్తి బలహీనపడటం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం,  అధిక రక్తపోటుకు దారితీస్తుంది. చర్మ ఆరోగ్యం.. పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం  చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా చేయడం. ఇది  ముడతలను నివారించడంలో కూడా  సహాయపడుతుంది. ఆవ నూనెలో విటమిన్ E ఉంటుంది, ఇది  చర్మానికి లోతుగా పోషణ ఇస్తుంది. ఆవనూనెను బొడ్డుకు రాయడం వల్ల మంచి ఫలితాలు లభించాలంటే..  ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం నెలరోజులు అయినా దాన్ని రాత్రి పడుకునే ముందు బొడ్డు మీద రాయాలి.                                          *రూపశ్రీ.

మెదడును వృద్దాప్యం నుండి కాపాడే వ్యాయామం.. 40 ఏళ్లు దాటిన వాళ్లకు ఎంతో ముఖ్యం!

మెదడును వృద్దాప్యం నుండి కాపాడే వ్యాయామం.. 40 ఏళ్లు దాటిన వాళ్లకు  ఎంతో ముఖ్యం! ప్రతి మనిషికి మెదడు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం.  కొంతమందికి చిన్న వయసులోనే  మతిమరుపు,  ఆలోచనా శక్తి తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి.  ఇవన్నీ జరగడాన్ని వైద్యుడు మెదడు వృద్దాప్యానికి చేరడం అని చెబుతారు.  ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత చాలామందిలో మెదడు వృద్దాప్యానికి లోనవడం కనిపిస్తూ ఉంటుంది. కానీ మెదడు వృద్దాప్యానికి లోనవకుండా ఉండాలంటే వ్యాయామాలు చాలా చక్కగా సహాయం చేస్తాయి.  పరిశోధనల ప్రకారం ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసిన వారి మెదడు,  దినచర్యలో ఎటువంటి శారీరక మార్పులు చేయని వారి కంటే ఇంకా యంగ్ గా మారిందని తేలింది.  మరీ ముఖ్యంగా వృద్దులు కూడా వ్యాయామం చేయడం వల్ల.. ఏ వ్యాయామం చేయని తక్కువ వయసులో ఉన్నవారి కంటే మెదడు మరింత చురుగ్గా మారుతుందని చెబుతున్నారు. ఈ వ్యాయామం గురించి తెలుసుకుంటే.. జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యం..  మెదడును జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా సంవత్సరాల పాటు కొనసాగే దీర్ఘకాలిక ప్రక్రియ.  . మెదడు వయస్సులో చిన్న మార్పులు కూడా దశాబ్దాల తర్వాత గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఏరోబిక్ వ్యాయామం  మెదడును యవ్వనంగా ఉంచడమే కాకుండా,  అనేక ఇతర మానసిక ప్రయోజనాలు  కూడా చేకూరుస్తుంది. ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే  ఆలోచనలో స్పష్టత మెరుగవుతుంది.  జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది .మొత్తం మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏరోబిక్ వ్యాయామం అంటే.. ఏరోబిక్ వ్యాయామాన్నే "కార్డియో" అని కూడా పిలుస్తారు.  ఈ  వ్యాయామం మెదడుకు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏరోబిక్ వ్యాయామం ప్రయోజనాలు.. ఊపిరితిత్తులు, గుండ,  కండరాలను బలోపేతం చేస్తాయి.  బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడతాయి. స్ట్రోక్,  డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వేగంగా నడవడం, ఈత, సైక్లింగ్ వంటివి కూడా ఈ ఏరోబిక్ వ్యాయామాల కిందకు వస్తాయి.  వీటిని దినచర్యలో భాగం చేసుకుంటే మంచిది.                                   *రూపశ్రీ.

గర్భాశయ ఆరోగ్యానికి హిస్టెరోస్కోపీ.. మీరు తెలుసుకోవలసిన పూర్తి సమాచారం!

గర్భాశయ ఆరోగ్యానికి హిస్టెరోస్కోపీ.. మీరు తెలుసుకోవలసిన పూర్తి సమాచారం! స్త్రీ ఆరోగ్యం కుటుంబానికి ఆధారం. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో చాలామంది మహిళలు గర్భాశయ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, తీవ్రమైన నొప్పి లేదా సంతానలేమి సమస్యలు ఎదురైనప్పుడు మనం ఆందోళన చెందడం సహజం. అటువంటి సమయాల్లో ఆధునిక వైద్యశాస్త్రం మనకు అందించిన ఒక గొప్ప వరమే 'హిస్టెరోస్కోపీ'. ఈ ప్రక్రియ ద్వారా గర్భాశయ సమస్యలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి, చికిత్స చేయవచ్చు. expert gynecologist Dr. Prithivi Perum చెప్పిన మరిన్ని విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి. మనం హిస్టెరోస్కోపీ ఎందుకు చేయించుకోవాలి? (Why should we?) గర్భాశయంలోని అంతర్గత సమస్యలను స్పష్టంగా చూడటానికి ఈ పరీక్ష ఎంతో అవసరం. ముఖ్యంగా ఈ క్రింది సందర్భాల్లో వైద్యులు దీనిని సూచిస్తారు: • ఫైబ్రాయిడ్ల తొలగింపు: గర్భాశయంలో ఉండే సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్లను గుర్తించడానికి మరియు హిస్టెరోస్కోపిక్ గైడెడ్ పద్ధతిలో వాటిని తొలగించడానికి ఇది కీలకం. • హార్మోన్ల మార్పులు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే హైపర్‌ప్లాసియా వంటి సమస్యలను గుర్తించవచ్చు. • మెనోపాజ్ తర్వాత రక్తస్రావం: మెనోపాజ్ (ముట్లు ఉడగడం) వచ్చిన ఏడాది తర్వాత కూడా రక్తస్రావం కనిపిస్తే, అది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి హిస్టెరోస్కోపీ చేస్తారు. • రోగ నిర్ధారణ మరియు చికిత్స: ఇది కేవలం సమస్యను గుర్తించడానికే (Diagnostic) కాకుండా, అదే సమయంలో చికిత్స (Operative) చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. హిస్టెరోస్కోపీ ఎలా చేస్తారు? (How it’s done?) ఇది చాలా సులభమైన మరియు తక్కువ సమయం పట్టే ప్రక్రియ. 1. అనస్థీషియా: రోగికి ఎటువంటి నొప్పి తెలియకుండా ఉండటానికి అనస్థీషియా ఇస్తారు. 2. ప్రక్రియ: యోని (Vagina) ద్వారా గర్భాశయంలోకి ఒక చిన్న స్కోప్‌ను పంపిస్తారు. ఇది ఎండోస్కోపీ లేదా సిస్టోస్కోపీ వంటి పద్ధతినే పోలి ఉంటుంది. 3. పరీక్ష: గర్భాశయం లోపల ఏవైనా ఇన్ఫెక్షన్లు (Atrophic endometritis) లేదా అసాధారణ కణజాలం ఉంటే దీని ద్వారా వైద్యులు నేరుగా చూస్తారు. ఏం చేయకూడదు? (What not to do?) • లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వారు లేదా 48 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళలు పీరియడ్స్ సమస్యలను లేదా కడుపులో నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. • భయపడవద్దు: ఇది చాలా కష్టమైన ఆపరేషన్ అని భయపడాల్సిన అవసరం లేదు; ఇది ఒక సులభమైన వైద్య ప్రక్రియ. • విశ్రాంతి తప్పనిసరి: చికిత్స తర్వాత వైద్యులు సూచించినంత కాలం నిశ్శబ్దంగా ఉండాలి మరియు విశ్రాంతి తీసుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) • ప్రశ్న: ఇది చాలా నొప్పి కలిగించే ప్రక్రియనా? •సమాధానం: లేదు, అనస్థీషియా ఇవ్వడం వల్ల రోగికి ఎటువంటి ఇబ్బంది కలగదు. • ప్రశ్న: గర్భాశయంలో పెద్ద గడ్డలు (Cysts) ఉంటే ఇది పని చేస్తుందా? •సమాధానం: 10 నుండి 12 సెంటీమీటర్ల పెద్ద గడ్డలు లేదా తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు కూడా పరిస్థితిని బట్టి హిస్టెరోస్కోపీ ద్వారా పరీక్ష లేదా చికిత్స చేస్తారు. • ప్రశ్న: దీని కోసం ఆసుపత్రిలో ఎన్ని రోజులు ఉండాలి? •సమాధానం: ఇది సాధారణంగా డే-కేర్ ప్రక్రియగా ఉంటుంది, కానీ చికిత్స తర్వాత కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉండటం అవసరం. మీ ఆరోగ్యం పట్ల మీరు చూపే శ్రద్ధ మీ కుటుంబ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. గర్భాశయ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకు హిస్టెరోస్కోపీ గురించి ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నాయా? డాక్టర్ పృథ్వి పేరుమ్ గారు అందించిన మరిన్ని ఆరోగ్య సూత్రాలు ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడిండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

తెల్ల జుట్టు నల్లగా మారాలా.. ఇంట్లోనే సింపుల్ సొల్యూషన్!

తెల్ల జుట్టు నల్లగా మారాలా.. ఇంట్లోనే సింపుల్ సొల్యూషన్!  తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలా? మీరు తెలుసుకోవాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు మరియు నిజాలు! ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య 'తెల్ల జుట్టు'. అద్దంలో మొదటిసారి తెల్ల జుట్టు కనిపించినప్పుడు కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. కొంతమందికి ఇది వంశపారంపర్యంగా వస్తే, మరికొందరికి ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే మొదలవుతోంది. అయితే, తెల్ల జుట్టు రాగానే కంగారు పడి రసాయనాలతో కూడిన డైలు వాడి జుట్టును మరింత పాడు చేసుకునే కంటే, నిపుణుల సలహాతో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. మనం జుట్టు విషయంలో ఎందుకు జాగ్రత్త వహించాలి? (Why Should We?)   జుట్టు కేవలం అందానికి మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసానికి కూడా గుర్తు. తెల్ల జుట్టు రావడం అనేది ఒక సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, మన శరీరంలో మెెలనిన్ పిగ్మెంట్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఇది జరుగుతుంది. తెల్ల జుట్టు సాధారణ జుట్టు కంటే నాలుగు రెట్లు వేగంగా పెరుగుతుంది. అందుకే, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మనం యవ్వనంగా మరియు ఉత్సాహంగా కనిపించవచ్చు. ఏమి చేయకూడదు? (What Not To Do)  తెల్ల జుట్టు కనిపించగానే మనం చేసే కొన్ని తప్పులు జుట్టును మరింత దెబ్బతీస్తాయి: • జుట్టును పీకడం: తెల్ల జుట్టును పీకితే పక్కన ఉన్నవి కూడా తెల్లబడతాయనేది అపోహ మాత్రమే, కానీ అలా పీకడం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. • PPD మరియు అమ్మోనియా డైలు: పిపిడి (PPD) మరియు అమ్మోనియా ఉన్న డైలను అస్సలు వాడకూడదు. వీటివల్ల ముఖం వాపు, అలర్జీలు, చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. • బ్లాక్ హెన్నా: 'బ్లాక్ హెన్నా' అనేది సహజమైనది కాదు, ఇందులో అధిక మోతాదులో పిపిడి ఉంటుంది, ఇది జుట్టుకు చాలా హానికరం. • ఎండలో తిరగడం: హెయిర్ డై వేసుకున్న తర్వాత ఎండలో ఎక్కువగా తిరగకూడదు, ఎందుకంటే సూర్యరశ్మి బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేసి డై రంగు త్వరగా పోయేలా చేస్తుంది. జుట్టును ఎలా సంరక్షించుకోవాలి? (How To) • సరైన డై ఎంపిక: పర్మనెంట్ డైల కంటే 'డెమీ పర్మనెంట్' (Demi-permanent) డైలు సురక్షితం. ఇవి 20 నుండి 28 వాష్‌ల వరకు ఉంటాయి • రూట్ టచ్-అప్స్: జుట్టు మొత్తానికి కలర్ వేయకుండా, కేవలం తెల్లబడిన కుదుళ్ల వద్ద మాత్రమే ప్రతి 4 నుండి 6 వారాలకు ఒకసారి రూట్ టచ్-అప్ చేసుకోవడం ఉత్తమం. • సహజమైన మార్గాలు: హెన్నా (గోరింటాకు), ఇండిగో, కాఫీ లేదా బీట్‌రూట్ ఎక్స్‌ట్రాక్ట్ వంటి సహజమైన వెజిటేబుల్ డైలను ఉపయోగించడం వల్ల జుట్టుకు తక్కువ నష్టం జరుగుతుంది. • సరైన షాంపూ: సల్ఫేట్ లేని (Sulfate-free) షాంపూలను మరియు కండిషనర్లను వాడటం వల్ల జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది. • ఆహారం మరియు విటమిన్లు: జింక్, విటమిన్ బి12, ఐరన్ (Ferritin), సెలీనియం మరియు రాగి (Copper) వంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు పెరుగుదలను తగ్గించవచ్చు. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: తెల్ల జుట్టు చిన్న పిల్లల్లో కూడా రావచ్చా?  జ: అవును, జన్యుపరమైన కారణాల వల్ల 9 ఏళ్ల వయసున్న పిల్లల్లో కూడా తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉంది. ప్ర: తెల్ల జుట్టు నల్ల జుట్టు కంటే వేగంగా పెరుగుతుందా?  జ: అవును, శరీరం మెలనిన్ ఉత్పత్తికి ఖర్చు చేసే శక్తిని ఆదా చేయడం వల్ల తెల్ల జుట్టు సాధారణ జుట్టు కంటే 4 రెట్లు వేగంగా పెరుగుతుంది. ప్ర: ఆనియన్ జ్యూస్ జుట్టు ఎదుగుదలకు పనిచేస్తుందా?  జ: దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేనప్పటికీ, అలర్జీ లేని వారు వాడవచ్చు. అయితే ఇది అందరికీ ఒకేలా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. గుర్తుంచుకోండి, తెల్ల జుట్టు రావడం అనేది వయసుతో పాటు వచ్చే సహజమైన మార్పు. దీని గురించి అతిగా ఆందోళన చెంది ఒత్తిడికి గురైతే జుట్టు మరింత తెల్లబడే అవకాశం ఉంది. మీ జుట్టును ప్రేమించండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారం మరియు సరైన జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)