చర్మం మీద ముడతలు తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి..!

 చర్మం మీద ముడతలు తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి..!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కాంతివంతమైన, మచ్చలేని చర్మాన్ని కోరుకుంటున్నారు.ముఖ్యంగా అమ్మాయిలకు మచ్చలేని, కాంతివంతమైన చర్మం కావాలని చాలా కోరికగా ఉంటుంది.  దీనిని సాధించడానికి, ఇందుకోసం అమ్మాయిలు  మార్కెట్లో దొరికే చాలా రకాల రసాయన ఉత్పత్తులను ప్రయోగిస్తుంటారు. అయితే  ఈ  రసాయన ఉత్పత్తులను  పూసిన తర్వాత కూడా ఎటువంటి  మార్పు కనిపించదు,  పైగా కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చర్మం మరింత దారుణంగా కూడా మారుతుంది.కానీ కొన్ని ఇంటి చిట్కాలతో ముఖ చర్మాన్ని చాలా కాంతివంతంగా మార్చుకోవచ్చు.  ఉదయాన్నే కొన్ని టిప్స్ పాటిస్తే ఇది సాధ్యమవుతుంది. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

మీరు ఉదయం నిద్రలేవగానే ఈ సులభమైన ఐస్ ప్యాక్‌ను మీ ముఖానికి పెట్టుకోవచ్చు. ఈ చిట్కా మీ ముఖానికి కాంతినిస్తుంది. ఇది సన్నని గీతలను కూడా తగ్గించవచ్చు.

మెరిసే చర్మం కోస ఇంట్లోనే పాటించాల్సిన చిట్కా..

మెరిసే చర్మం కోసం ఉదయం నిద్రలేవగానే  ఒక గిన్నె తీసుకుని, దానిలో ఐస్ క్యూబ్స్ ను వేయాలి. అందులో నీటిని కూడా వేయాలి. తర్వాత ముఖాన్ని ఆ చల్లని నీటిలో ముంచాలి. ఈ చిట్కా  ముఖానికి మెరుపును తెస్తుంది.

ప్రయోజనాలు..

 ఉదయం కనీసం 15 నుండి 20 సార్లు ఈ నీటిలో  ముఖాన్ని ముంచాలి. చల్లటి నీటిలో ముఖాన్ని ముంచడం వల్ల  చర్మ రంధ్రాలు కుంచించుకుపోయి, చర్మం బిగువుగా మారుతుంది. చల్లటి నీటికి గురికావడం వల్ల ఉబ్బు , సన్నని గీతలు తగ్గుతాయి.

25 ఏళ్ల తర్వాత ముఖంపై సన్నని గీతలు కనిపిస్తాయి కాబట్టి, ఈ చికిత్స 25 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చికిత్స చిన్న పిల్లలకు తగినది కాదు. ఐస్ వాటర్ థెరపీ ముఖంపై అధిక నూనెను నియంత్రించడంలో సహాయపడుతుంది. తక్షణ మెరుపు కోసం ఐస్ వాటర్ థెరపీని ప్రయత్నించవచ్చు.


                             *రూపశ్రీ.