మందార పువ్వులను ఇలా వాడితే.. ముఖం మెరిసిపోతుంది..!

మందార పువ్వులను ఇలా వాడితే.. ముఖం మెరిసిపోతుంది..!


ముఖం ఎంతో అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే ఇందుకోసం చాలామంది అమ్మాయిలు మార్కెట్లో దొరికే చాలా రకాల ఉత్పత్తులను ప్రయత్నిస్తుంటారు.  వీటి వల్ల అప్పటికప్పుడు ఫలితాలు కనిపించవచ్చు. కానీ దీర్ఘకాల ఫలితాలు మాత్రం చాలా వరకు ఉండవు. పైగా కొన్ని ఉత్పత్తులు చర్మానికి హాని కలిగించి, ముఖ చర్మాన్ని పాడు చేస్తాయి కూడా.  సహజమైన పద్దతిలో ముఖ చర్మాన్ని మెరిపించాలంటే మందార పువ్వులను వాడాలని అంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్.. ఇంటి చుట్టుప్రక్కల పెరిగే మందారం మొక్కల నుండి మందారం పువ్వులను సేకరించి,  సహజంగా ముఖాన్ని ఎలా మెరిపించాలో తెలుసుకుంటే..

మందార, తేనె ఫేస్ ప్యాక్..

తాజా మందార రేకులను నూరి, దానికి ఒక చెంచా తేనె  ముఖానికి పట్టించాలి. దాన్ని కలిపి 15-20 నిమిషాల పాటు ఉంచుకోవాలి.  ఆ తర్వాత  ముఖాన్ని మామూలు నీటితో కడుక్కోవాలి. తేనె చర్మానికి తేమను అందించడంలో సహాయపడుతుంది, మందార పువ్వు చర్మానికి తాజాదనాన్ని అందించడంలో సహాయపడుతుంది. నిని వారానికి 1-2 సార్లు ఉపయోగించవచ్చు.

మందార పువ్వు, పెరుగు..

చర్మం పొడిగా లేదా నిర్జీవంగా అనిపిస్తే, పెరుగులో మందార పేస్ట్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఎక్స్ ఫోలియేషన్‌కు సహాయపడుతుంది. మందార పువ్వు చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. అయితే ఈ ప్యాక్ నుఉపయోగించిన తర్వాత మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోకూడదు.

మందార, కలబంద జెల్..

మందార పేస్ట్‌ను కలబంద జెల్‌లో కలిపి, ముఖానికి సున్నితంగా రాయాలి. ఈ మిశ్రమం చర్మాన్ని చల్లబరచడానికి , తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.చాలా మంది వేసవి లేదా ఎండ తగిలిన తర్వాత చర్మానికి ఉపశమనం కలిగించడానికి ఇలాంటి ఇంట్లో తయారుచేసిన మిశ్రమాలను ఉపయోగిస్తారు, కానీ ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకంటే మంచిది.

లైట్ స్క్రబ్..

ఎండిన మందార పువ్వుల  పొడిని తీసుకోవాలి. దీనికి కొద్దిగా ఓట్స్ లేదా బియ్యం పిండి , రోజ్ వాటర్ కలపాలి. ఇది లైట్ స్క్రబ్ గా పనిచేస్తుంది.  దీనిని చర్మానికి చాలా సున్నితంగా రాయాలి,  గట్టిగా రుద్దకూడదు. సున్నితమైన లేదా మొటిమలు వచ్చే చర్మంపై స్క్రబ్‌లను జాగ్రత్తగా వాడాలి.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

ఏదైనా ఇంటి చిట్కాను ఉపయోగించే ముందు, చర్మంపై చిన్న ప్రదేశంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.  దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ను నివారించవచ్చు.  ప్యాచ్ టెస్ట్ చేశాక  మంట, ఎరుపు లేదా దురద వంటివి కలిగితే, వెంటనే వాడకాన్ని ఆపివేయాలి. మందార పువ్వు రాసుకున్న తర్వాత, పగటిపూట బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడాలి. మంచి చర్మం కోసం,  స్కిన్ కేర్ టిప్స్ తో పాటు  తగినంత నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం , తగినంత నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం.

 

                               *రూపశ్రీ.