రోజూ ఫౌండేషన్ వాడుతున్నారా...కొంపలు మునిగినట్టే..!

రోజూ ఫౌండేషన్ వాడుతున్నారా...కొంపలు మునిగినట్టే..!


మేకప్  వల్ల ముఖం అందంగా ఉండటమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అందుకే నేటి కాలంలో స్త్రీలు, పురుషుల లైఫ్ స్టైల్ లో మేకప్ అనేది భాగం  అయిపోయింది.  పురుషులు కూడా తమకు కేటాయించిన బ్రాండ్స్ ను ఎలాంటి సంకోచం లేకుండా కొని వాడుతుంటారు.  ఇది ముఖంలోని లోపాలను దాచి ముఖం ప్రకాశవంతంగా  మారుస్తుంది. ఇక మేకప్ లో ముఖ్యమైన భాగం ఫౌండేషన్.  చర్మపు రంగును బట్టి దీనిని కొనుగోలు చేస్తారు. ఇది ముఖంపై మంచి బేస్‌ను సృష్టిస్తుంది. కానీ రోజూ వేసుకుంటున్నా, లేక తప్పుడు ఫౌండేషన్ ను ఉపయోగిస్తున్నా అది చాలా నష్టాలు కలిగిస్తుంది. ఫౌండేషన్ ను రోజూ వాడటం లేదా తప్పు ఫౌండేషన్ ను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే..

రంధ్రాలు మూసుకుపోతాయి..

ప్రతిరోజూ  ముఖంపై ఫౌండేషన్ ఉపయోగిస్తే, చర్మ రంధ్రాలు క్రమంగా మూసుకుపోతాయట. దీనివల్ల చర్మంపై మొటిమలు,  బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. కొన్నిసార్లు దీనివల్ల మొటిమల సమస్య చాలా పెరుగుతుంది కూడా.   ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. చర్మాన్ని చాలా దెబ్బతీస్తుంది.

అలెర్జీలు, దద్దుర్లు..

ప్రతిరోజూ  ముఖంపై చవకగా తక్కువ ధరలో దొరికే   ఫౌండేషన్‌ను ఉపయోగిస్తుంటారు కొందరు. ఇవన్నీ ఎలాంటి ఫార్ములా లేకుండా తయారు చేస్తారు.  ఈ ఫౌండేషన్‌లలో ఉండే రసాయనాలు అలెర్జీలు, దురద లేదా దద్దుర్లు కలిగిస్తాయని. సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు.

డ్యామేజ్..

 ప్రతిరోజూ నాణ్యత లేని ఫౌండేషన్ ఉపయోగిస్తుంటే అది చర్మంలో ఉండే  తేమను తగ్గిస్తుంది.   చాలా సందర్భాలలో ఫౌండేషన్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై అదనపు నూనె పేరుకుపోతుంది. ఇది మొటిమలకు మరింత కారణమవుతుంది.

మెరుపు..

ప్రతిరోజూ ఎక్కువగా ఫౌండేషన్ వాడటం వల్ల ముఖం  మెరుపు క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా ముఖం మీద చవకైన ఫౌండేషన్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటే.. దీని వల్ల  ముఖం నిస్తేజంగా మారడం ప్రారంభమవుతుంది.

వృద్దాప్యం..

ఫౌండేషన్‌ను సరిగ్గా తొలగించకపోవడం కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. వాస్తవానికి ఫౌండేషన్‌ను సరిగ్గా శుభ్రం చేయకపోతే అది చర్మం శ్వాస తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది చిన్నవయసులోనే ముడతలకు దారితీస్తుంది. ఇది కాస్త చిన్నవయసులో ముసలివాళ్లలా కనిపించేలా చేస్తుంది.

                             *రూపశ్రీ.