వారెవ్వా.. నవారీ చీర.. ఎప్పుడైనా కట్టారా!

వారెవ్వా.. నవారీ చీర.. ఎప్పుడైనా కట్టారా!

భారతీయ సంప్రదానికి ఒక రూపం ఇస్తే అందులో ముందు వరుసలో వస్త్రధారణ,  అందులో కూడా మహిళల చీరకట్టు ఠీవిగా దర్శనమిస్తుంది.  భారతీయ మహిళల చీరకట్టుకు ఉన్న ప్రత్యేకత,  అందులో ఉన్న హుందాతనం చాలా గొప్పది. విదేశీయులు సైతం చీరకట్టుపై మోజుపడి చీరలను ధరిస్తున్నారు.  అయితే సాధారణంగా చీరల పొడవు ఐదున్నర గజాలు ఉంటుంది.  కొన్ని అయితే ఆరు గజాల వరకు ఉంటాయి. కానీ నవారీ చీర మాత్రం చాలా స్పెషల్.. ఈ చీర దాదాపు తొమ్మిది అంగుళాలు ఉంటుంది.  నవారీ చీర కట్టుు అన్ని రకాల చీర కట్టులలోకి చాలా స్పెషల్.  ఈ చీర కట్టులో ఉన్నంత హుందాతనం,  ఠీవి,  అందం వేరే లెవల్ అని చెప్పవచ్చు.   ఈ నవారీ చీరకట్టు ఎంతో కాలం నుండే ఉన్నా.. ప్రస్తుతం భారతదేశంలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఏంటో?  ఈ చీరకకట్టులో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసుకుంటే..

నవారీ చీర..

నవారీ చీరను స్పెషల్ గా చేసేది దాని పొడవు. ఇది దాదాపు తొమ్మిది అంగుళాలు ఉంటుంది.  ఈ చీరను కట్టుకోవడం కూడా చాలా వెరైటీగా ఉంటుంది.  ఇది ధోతి స్టైల్ లో కట్టుకునేందుకు అనువుగా ఉండే చీర.  ధోతి స్టైల్ లో కట్టుకోవడం వల్ల ఈ చీర  అన్ని పనులకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.  

రాణి రుద్రమదేవి,  ఝాన్సీ లక్ష్మీభాయి వంటి వీర వనితలు ఈ ధోతి స్టైల్ చీరనే కట్టుకునేవారు.  సింపుల్ గా అందరికీ అర్థం కావాలంటే బాహుబలి సినిమాలో దేవసేన కూడా ఈ ధోతి స్టైల్ చీరకట్టులో యుద్ద సన్నివేశాలలో కనిపిస్తుంది.

ప్రత్యేకత..

పూర్వకాలంలో ధోతి స్టైల్ చీరకట్టు పల్లెల్లో ఆడవారు కూడా చక్కగా ధరించేవారు.  పొలం పనులు చేయడానికి, గుర్రపు స్వారీ చేయడానికి.. ఇలా మొదలుకొని అన్ని పనులు చేయడానికి కూడా ఈ చీరకట్టు చాలా బాగా కంఫర్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా మరాఠీ మహిళలు ఈ చీరకట్టులోనే ఉంటారు. వారి సంప్రదాయంలో ఈ చీరకట్టు భాగమైపోయింది.

ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన..

మరాఠీ యాక్ట్రెస్ ప్రజక్త వల్లే ఇప్పుడు నవారీ చీరకట్టు గురించి భారతదేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈమే కేన్స్ రెడ్ కార్పెట్ పై నవారీ చీరకట్టుకుని అందరినీ మైమరిపోయేలా చేశారు.  మహారాష్ట్ర మహిళలు ఎంతో గర్వంగా భావించే ఈ చీరకట్టు నిండుగా, ఎంతో పద్దతిగా ఉంటూనే.. అందరినీ ఆకర్షిస్తుంది.

                                 *రూపశ్రీ.