మామిడికాయను తినడానికే కాదు.. ముఖానికి కూడా వాడచ్చు ఇదిగో ఇలా..!

మామిడికాయను తినడానికే కాదు.. ముఖానికి కూడా వాడచ్చు ఇదిగో ఇలా..!

 

 

పండ్ల రారాజు మామిడి పండు.  వేసవి కోసం చాలా మంది ఎదురు చూసేది మామిడి పండ్ల కోసమే అంటే అతిశయోక్తి కాదు. కానీ మామిడి పండును కేవలం తినడానికే కాదు.. ముఖానికి కూడా ఉపయోగించ వచ్చు.  దీని వల్ల అందం పెరుగుతుంది.  మెరిసే చర్మం సొంతమవుతుంది.  దీని కోసం మామిడి పండును ముఖానికి ఎలా వాడాలో తెలుసుకుంటే..

మామిడికాయ గుజ్జు..

మామిడికాయ గుజ్జులో విటమిన్-సి,  బీటా కెరోటిన్ ఉంటాయి.  ఇవి సహజంగా చర్మాన్ని మెరిపించడంలోనూ, పొడి చర్మాన్ని మృదువుగా ఉంచడంలోనూ సహాయపడతాయి.  ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడం కోసం మామిడికాయ గుజ్జును ముఖానికి అప్లై చేయవచ్చు.

మామిడి కాయ, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్..

ముఖం పై టానింగ్,  ముడతలను తగ్గించడానికి మామిడి, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాస్ ను ఉపయోగించవచ్చు.  దీన్ని తయారు చేసుకోవడం కూడా సులభం.

కావలసిన పదార్థాలు..

పండిన మామిడి పండు.

ముల్తాని మట్టి..

పెరుగు..

తయారీ విధానం..

మామిడి పండు గుజ్జు తీయాలి.  ఈ గుజ్జులో పెరుగు వేయాలి.  ఇందులోనే ముల్తానీ మట్టి వేసి బాగా మిక్స్ చేయాలి.  ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

లిప్ బామ్..

మామిడి పండుతో లిప్ బామ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మంచి ఫ్లేవర్ తో భలే ఉంటుంది.  పగిలిన పెదవులకు రెగ్యులర్ గా ఈ లిప్ బామ్ వాడుతూ ఉంటే పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు,  కొవ్వు ఆమ్లాలు పెదవులను మృదువుగా చేస్తాయి.

మామిడి తొక్కల పేస్ట్..

ముఖం ప్రకాశవంతంగా ,  అందంగా కనిపించడానికి మామిడి తొక్కలను ఉపయోగించవచ్చు. ఇందుకోసం మామిడి తొక్కలను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి.  దీనికి రోజ్ వాటర్ జోడించాలి.  దీన్ని ముఖానికి అప్లై చేయాలి.  ఇది చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది.

మామిడి ఐస్ క్యూబ్స్..

ముఖం మీద వాపు,  నల్లటి మచ్చలు ఉంటే మామిడి రసం ను ఐస్ ట్రే లలో వేసి ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవాలి.  ఈ ఐస్ క్యూబ్స్ ను ముఖం మీద అప్లై చేయాలి.  ఇది ముఖాన్ని తాజాగా,  తేమగా ఉంచుతుంది.

                                             *రూపశ్రీ.