ముఖం మీద ముడతలు వదిలించే సూపర్ టిప్స్ ఇవి..!
posted on Oct 3, 2025
ముఖం మీద ముడతలు వదిలించే సూపర్ టిప్స్ ఇవి..!
ముఖం మీద ముడతలు లేకుండా.. అందంగా, ఆకర్షణీయంగా, యవ్వనంగా ఉండాలన్నది ప్రతి అమ్మాయి కల. ఇంకా చెప్పాలంటే.. పెళ్లై, పిల్లలు పుట్టినా సరే.. సంతూర్ మామ్ లాగా ఉండాలన్నది మహిళల కల. అయితే యవ్వనంగా ఉండటం అన్నది అందరికీ సాధ్యం కాదు. చాలామంది ఇంకా చిన్న వయసులోనే పెద్ద వయసు వాళ్లలా కనిపిస్తుంటారు. ఇలా కనిపించడానికి కారణం.. ముఖం మీద ముడతలు. ముఖం మీద ముడతలు కనిపించాయంటే చాలు.. పెద్ద వయసు వారు అనుకునే అవకాశాలే ఎక్కువ. అయితే ఇలా ముఖం మీద ముడతలు తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని సూపర్ టిప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంటి చిట్కాలు కావడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే ఖర్చు కూడా పెద్దగా ఉండదు. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుంటే..
అలోవెరా జెల్..
అలోవెరా జెల్ చర్మాన్ని అద్బుతం చేస్తుంది. ఇది ముఖ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీన్ని రోజూ ముఖానికి అప్లై చేస్తుంటే ముఖం మీద ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. మొక్కల నుండి తాజా కలబంద జెల్ ను ఉపయోగించవచ్చు. లేదంటే రసాయనాలు తక్కువ వేసి తయారు చేసిన కలబంద జెల్ ను మార్కెట్ లో కొనుగోలు చేసి ఉపయోగించవచ్చు.
అరటిపండు, తేనె..
అరటిపండు, తేనె ఇవి రెండూ మంచి ఆహార పదార్థాలు. ఇవి శరీరానికి పోషణను, శక్తిని ఇస్తాయి. అయితే.. ఈ అరటిపండు, తేనె రెండూ చర్మ సంరక్షణలో కూడా చాలా బాగా సహాయపడతాయి. ఈ మిశ్రమం ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ కాంబినేషన్ గొప్ప యాంటీ ఏజింగ్ ఏెజెంట్ గా పనిచేస్తుంది.
కొబ్బరి నూనె..
కొబ్బరినూనె గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారులే అనుకుంటారేమో.. కానీ కొబ్బరినూనెను కేవలం జుట్టుకు రాసుకోవడమే తెలుసు అందరికీ. కానీ కొన్ని చుక్కల కొబ్బరి నూనెను ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయడం వల్ల చర్మం తేమగా ఉంటంది. క్రమంగా ముడతలు కూడా తగ్గుతాయి.
రోజ్ వాటర్, గ్లిజరిన్..
రోజ్ వాటర్, ఇంకా గ్లిజరిన్ ఈ రెండూ డెడ్లీ కాంబినేషన్. ఇది చర్మానికి మ్యాజిక్ చేస్తుంది. రెండింటిని కలిపి రాత్రి పూట ముఖానికి అప్లై చేయాలి. చర్మం మృదువుగా ఉంటుంది. ఇది గొప్ప యాంటీ ఏజెంట్ గా పనిచేస్తుంది.
పైన చెప్పుకున్న ఫలితాలను కనీసం ఒక నెలరోజుల పాటు కంటిన్యూగా ఉపయోగించాలి. ఆ తరువాత ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.
*రూపశ్రీ.