Read more!

పాదాల సంరక్షణకు భలే చిట్కాలు!

పాదాల సంరక్షణకు భలే చిట్కాలు!

మహిళల అందంలో ప్రధాన పాత్ర పోషించే శరీర భాగాల్లో పాదాలు కూడా ముఖ్యమైనవే. అయితే సంరక్షణ విషయంలో ఇవి అట్టడుగున ఉంటాయి. ముఖం మీద మొటిమ వచ్చినా, చర్మం ముడతలు పడినా, డ్రెస్ కాస్త సరిగా సెట్ అవ్వకపోయినా ఆందోళన పడిపోయే అమ్మాయిలు పాదాల విషయంలో మాత్రం అసలు పట్టించుకోరు. అయితే కొత్త చెప్పులు కొనడానికి షాపుకు వెళ్లినప్పుడో… నలుగురిలో ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు పట్టీలు పెట్టుకుని తిరగాల్సినప్పుడో, ఇంకా కొన్ని వేరు వేరు సందర్భాలలోనో… పాదాల పదనిస తగ్గి మనలో పల్స్ ను నలుగురిలో టెస్ట్ చేస్తాయి. పాదాలను సరిగా పట్టించుకోకపోతే పగుళ్లు వచ్చి, చీలిపోయి, చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. అందుకే అందమైన పాదాల కోసం అదిరిపోయే చిట్కాలు మీకోసం….

ప్రతి రోజూ రాత్రి పండుకునే ముందు మూడు చెంచాల నిమ్మ రసములో రెండు చెంచాల గ్లిజరిన్ కలిపి కాళ్ళకు మర్దరా చేయాలి. ఇలా మర్దన చేస్తే.... కాళ్ళు మృదువుగా, అందంగా ఉంటాయి.

కాళ్ళ నొప్పులతో బాధపడేవారి కోసం ఒక మంచి చిట్కా ఉంది.  వెడల్పాటి గిన్నెలో గోరువెచ్చని నీరు పోసి, అందులో రెండు చెంచాల జిప్సమ్ సాల్ట్ వేసి ఆ నీటిలో పాదాలు మునిగేలా పదిహేను నిమిషాలు ఉంచాలి. ఇలా ఉంచితే.... కాళ్ళ నొప్పులు  తగ్గుతాయి.

అన్నిటికంటే సులువైన మరియు తొందరగా పూర్తయ్యే చిట్కా ఒకటుంది. ప్రతి రోజు స్నానము చేసేటప్పుడు 'వ్యూమిక్ స్టోన్' తో పాదాలను మృదువుగా రుద్దుకుంటే.... పాద సౌందర్యము పెరుగుతుంది.

రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ లో కాస్త ఉప్పు కలిపుకోవాలి.  ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందుగా కాళ్ళకు మర్దన చేసికొంటుంటే.. కాళ్ళకు ఆరోగ్యము అందము లభిస్తుంది.

వెడల్పాటి గిన్నెలో- గోరువెచ్చని నీరు పోసి, ఇందులో  ఒక ఔన్స్ 'సోడియమ్ సల్ఫేట్', మూడు ఔన్స్ 'బైకార్బోనేట్', నాలుగు ఔన్స్ ఉప్పువేసి కలిపి, ఈనీటిలో పాదాలు మునిగేలా కాసేపు వుంచితే కాళ్ళ నొప్పులు తగ్గటమే గాక పాదాలు శుభ్ర పడతాయి. కాళ్ళలో ఉండే మురికి, మలినాలు తొలగిపోతాయి. మృతచర్మం మెత్తబడి సులువుగా తొలగించేందుకు వీలవుతుంది. 

ప్రతిరోజు ఓ పది నిమిషాలసేపు మునివేళ్ళ మీద నడిస్తే.... కాలి కండరాలలో బలం పుంజుకుంటుంది.

శుభ్రముగా వున్న నేల మీద చెప్పులు వేసుకోకుండా కాసేపు నడుస్తుంటే.... పాదాలకు బలము వస్తుంది.

 వేడినీటిలో  కాసిని ఆవాలు వేసి, ఆ నీటిలో పాదాలు  పది నిమిషాలుంచి, ఆ తరువాత పాదాలను చన్నీటి పంపు కింద ఉంచాలి. ఇలా ఉంచితే.... పాదాలకు  బలము, సౌందర్యము చేకూరుతాయి. 

అందమైన కాళ్ళ కావాలంటే వ్యాయామం అవసరం. దీనికి 'ఈత' మంచి వ్యాయామంగా ఉపయోగపడుతుంది.

చెప్పులు లేకుండా కాసేపు ఇసుకలో నడవడం,  కుర్చీలో నిటారుగా కూర్చొని పాదాలతో నేల మీద సున్నా చుట్టుటానికి  ప్రయత్నించడం వలన... కాలి కండరాలు బలంగా తయారవులతాయి.

ముందుగా మునివేళ్ళ మీద, తరువాత మడమల మీద మార్చి మార్చి నిలుచుంటే.... కాలి కండరాలు బలంగా తయారవుతాయి. 

ఓ కుర్చీలో కూర్చుని, ప్రక్కనున్న కుర్చీలోని టవల్ కాళ్ళతో తీసికొనుటకు ప్రయత్నించుట కాళ్ళకు మంచి వ్యాయామము

 కాళ్ల క్రింద ఎత్తుగా రెండు దిండ్లు పెట్టుకొని, కాసేపు విశ్రాంతి తీసుకుంటూ పడుకొంటే.... కాళ్ళ నొప్పులు తగ్గుతాయి.


కొత్త చెప్పులు కొననివారు ఉండరు. అవి కరవడం అనుభవించని వారుండరు. అయితే  క్రొత్తగా కొన్న చెప్పులు కరుస్తుంటే.... పాదము మీద, చెప్పు కరుస్తున్నచోట  ఆముదము రాస్తే.... సరిపోతుంది.

 అరికాళ్ళ పగుళ్ళతో బాధపడేవారు. క్యాన్వాస్ షూ వాడితే, రెండు నెలల్లో పగుళ్ళు తగ్గిపోయి కాళ్ళు శుభ్రముగా ఉంటాయి. 

ఇలా కాళ్ళ పగుళ్లకు ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాలున్నాయి. పాటించడమే తరువాయి..

                                   ◆నిశ్శబ్ద.