ఇంట్లోనే ఫేస్ టోనర్.. ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
posted on Jul 25, 2025
ఇంట్లోనే ఫేస్ టోనర్.. ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఈ కాలంలో స్త్రీలు, పురుషులు అందరూ ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడటం, ఖరీదైన చర్మ చికిత్సలు చేయించుకోవడం చేస్తున్నారు. కొందరు వైద్యులు సూచించిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ చాలా సార్లు అవి ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవు. లేదా అవి వాడినన్ని రోజులు మాత్రమే చర్మం బాగుంటుంది. ఆ తరువాత చర్మం మళ్లీ మొదటికి వస్తుంది. ఆ ఉత్పత్తులను వాడటం ఆపివేసిన తర్వాత, చర్మం నిస్తేజంగా మారుతుంది.ఇలాంటి ముఖాన్ని తిరిగి తాజాగా మార్చుకోవడం కోసం చాలా కష్టపడుతుంటారు. కానీ ఇంట్లోనే ఫేస్ టోనర్ తయారు చేసుకుని వాడటం వల్ల ముఖ చర్మం చాలా ఆరోగ్యంగా మారుతుంది. ఇంతకీ ఈ పేస్ టోనర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే..
టోనర్ తయారు చేయడానికి కావలసినవి..
ఇంట్లో టోనర్ తయారు చేయడానికి ప్రధానంగా అవసరం అయ్యేవి..
రోజ్ వాటర్ - 2 టేబుల్ స్పూన్లు,
కలబంద జెల్ - 1 టేబుల్ స్పూన్, దోసకాయ రసం - 2 టేబుల్ స్పూన్లు,
కోల్డ్ గ్రీన్ టీ.
టోనర్ తయారు చేసే విధానం..
ఇంట్లో టోనర్ తయారు చేసుకోవడం చాలా సులభం. దీని కోసం రోజ్ వాటర్, కలబంద జెల్, దోసకాయ రసం, గ్రీన్ టీ వంటి అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి.
ఈ టోనర్ ను ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచితే అది చర్మానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన టోనర్ ఒక వారం మాత్రమే ఉంటుంది. కాబట్టి టోనర్ ను ఒక వారంలో వాడగలిగినంత మాత్రమే తయారు చేసుకోవడం మేలు.
ఉపయోగించే పద్దతి..
టోనర్ వాడటం చాలా సులభం. దీని కోసం, ముందుగా ముఖం కడుక్కున్న తర్వాత, కాటన్ ప్యాడ్ ఉపయోగించి లేదా నేరుగా స్ప్రే చేయడం ద్వారా టోనర్‌ను ముఖంపై అప్లై చేయాలి. ఇప్పుడు ముఖాన్ని 2 నుండి 3 నిమిషాలు ఇలాగే ఉంచాలి. తద్వారా అది చర్మంలోకి శోషించబడుతుంది. టోనర్‌ను స్ప్రే బాటిల్‌లో ఉంచినట్లయితే, టోనర్‌ను ముఖంపై స్ప్రే చేసి అలాగే ఉంచాలి.
ఎప్పుడు ఉపయోగించాలి?
టోనర్ ను ముఖంపై క్రమం తప్పకుండా ఉపయోగించగలిగినప్పుడే టోనర్ ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. దీని కోసం ఉదయం, సాయంత్రం ముఖాన్ని కడుక్కోవాలి. ఆ తరువాత టోనర్ ఉపయోగించండి.
*రూపశ్రీ.