ఆడవాళ్లు ఆర్థికంగా ఎదగడానికి సులువు మార్గాలు..!

ఆడవాళ్లు ఆర్థికంగా ఎదగడం అంటే కేవలం ఉద్యోగం చేయడం మాత్రమే కాదు, తమ నైపుణ్యాలను సరైన మార్గంలో ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకోవడం , డబ్బును సరైన రీతిలో నిర్వహించడం.  నేటికాలంలో చాలామంది మహిళలు వివాహం తర్వాత ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు. ఇంటి బాధ్యతలు కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, పెద్దలను చూసుకోవాలనికావచ్చు.. ఎంతో మంది మహిళలు బాగా చదువుకుని , ఎంతో తెలివి ఉండి, తాము ఏమి సంపాదించడం లేదని, కుటుంబానికి సహాయపడలేక పోతున్నామని ఫీలవుతూ ఉంటారు. 

మరికొందరు పెట్టుబడి ఉంటేనే ఏదైనా సాధ్యం అని కూడా అనుకుంటారు. అయితే.. పెట్టుబడి ఏమీ లేకుండా, కేవలం సమయం, నైపుణ్యాలు , స్మార్ట్‌ఫోన్/లాప్‌టాప్ ఉపయోగించి డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి  కొన్ని తెలుసుకుంటే..

ఫ్రీలాన్సింగ్..

మహిళలు తమ నైపుణ్యాలతోనే   ఆదాయం పొందవచ్చు. కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ, ట్రాన్స్‌లేషన్, గ్రాఫిక్ డిజైనింగ్, లేదా వీడియో ఎడిటింగ్ వంటి పనులకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. Fiverr, Upwork, Freelancer వంటి గ్లోబల్ వెబ్‌సైట్లలో ఉచితంగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఆన్‌లైన్ ఆర్డర్లు పొందవచ్చు.

ట్యూషన్లు , కోచింగ్..

చదువుకున్న విద్యార్థులకు లేదా ఏదైనా ప్రత్యేక కళ వచ్చు అనుకున్నవారికి ఇది మంచి మార్గం.  ఇంటి దగ్గర ఉండే పిల్లలకు పాఠాలు చెప్పడం లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విదేశీయులకు లేదా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ట్యూషన్లు చెప్పవచ్చు.

వర్క్ షాప్..

సంగీతం, కుకింగ్, యోగా, క్రాఫ్ట్స్ వంటి వాటిలో ప్రవేశం ఉంటే వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించవచ్చు.

కంటెంట్ క్రియేటర్..

ఆసక్తి ఉన్న రంగం ఏదైనా సరే.. వంటలు, ట్రావెల్, టెక్నాలజీ, విద్య, ఫ్యాషన్ మొదలైన వాటి గురించి వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. అలాగే ఉచితంగా బ్లాగర్  లేదా వర్డ్‌ప్రెస్ ప్లాట్ఫామ్ పై బ్లాగ్ ప్రారంభించి ఆర్టికల్స్ రాయవచ్చు. ట్రాఫిక్ పెరిగే కొద్దీ యాడ్స్, ప్రమోషన్ల ద్వారా ఆదాయం లభిస్తుంది.

అఫిలియేట్ మార్కెటింగ్..

ఇ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైన వాటిలోని  ఉత్పత్తులను సోషల్ మీడియా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రమోట్ చేయడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. అఫిలియేట్ లింక్ ద్వారా ఎవరైనా ఆ వస్తువును కొనుగోలు చేస్తే  విక్రయం ఆధారంగా కొంత కమీషన్ లభిస్తుంది. దీనికి కూడా ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు.

సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ & వర్చువల్ అసిస్టెంట్

చిన్న వ్యాపారవేత్తలకు లేదా ఇన్‌ఫ్లుయెన్సర్లకు వారి సోషల్ మీడియా ఖాతాలను  అంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్స్ నిర్వహించడానికి, ఈమెయిల్స్ రిప్లై ఇవ్వడానికి లేదా షెడ్యూల్స్ ప్లాన్ చేయడానికి సహాయం చేయడం. ఇంటి నుంచే ఈ పనులను పూర్తి చేస్తూ నెలకు స్థిరమైన ఆదాయం  లేదా జీతం రూపంలో ఆదాయం పొందవచ్చు.

ఆన్‌లైన్ సర్వేలు , టెస్టింగ్..

కొన్ని నమ్మకమైన వెబ్‌సైట్‌లు అంటే  Swagbucks, UserTesting వంటివి కొత్త యాప్‌లు, వెబ్‌సైట్‌లు లేదా ఉత్పత్తులను పరీక్షించి ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు లేదా సర్వేలు పూర్తి చేసినందుకు డబ్బులు ఇస్తాయి. ఇది తక్కువ సమయంలో పాకెట్ మనీ సంపాదించడానికి ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా  ఆసక్తి, నైపుణ్యాన్ని బట్టి సరైన మార్గాన్ని ఎంచుకుని క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే క్రమంగా మంచి ఆదాయం సంపాదించవచ్చు.

                          *రూపశ్రీ.