Read more!

కొలెస్ట్రాల్ ను అరికట్టాలంటే ఏం చేయాలో తెలుసా...?

1. కొలెస్ట్రాల్ ముప్పును తప్పించుకోవాలంటే ముందుగా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉందో, కొలెస్ట్రాల్ వల్ల ముప్పు ఏర్పడే అవకాశం ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలి.

2. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో 5 నుంచి 10గ్రాముల ఫైబర్(పీచు పదార్థాలు) ఉండేలా చూసుకోవాలి. ఉదయపు అల్పాహారంలో ఓట్‌మీల్ తీసుకోవడం, కూరగాయలు ఎక్కువగా తినడం చేయాలి.

3. నూనె వాడకం బాగా తగ్గించాలి. ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి అన్‌శాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్‌ను వాడితే మరీ మంచిది.

4. తక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు తగ్గిపోతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు రోజు వారి మెనూలో ఉండేలా చూసుకుంటే కొవ్వు దరిచేరకుండా ఉంటుంది.

5. ప్రతిరోజు కనీసం అరగంట పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి వ్యాయామం బాగా ఉపకరిస్తుంది.

6. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. కాబట్టి వారంలో రెండు, మూడుస్లార్లు చేపను ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అదుపులో ఉండటానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది.

7. రోజూ సరిపడా సమయం నిద్రపోవాలి. మంచి నిద్ర వల్ల శరీరం తిరిగి పునరుత్తేజం అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటేన్ అవుతాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ట్రాల్ ముప్పు తప్పుతుంది.

8. వెల్లుల్లిలో ఆర్గనో సల్ఫర్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొవ్వు శాతం పెరగకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, కొలెస్ట్రాల్‌ను కాలేయానికి రవాణా చేస్తుంది. అందుకే రోజు రెండు మూడు రెబ్బల వెల్లుల్లి తీసుకోండి.

9. మెనూలో కూరగాయాల భోజనం ఉండేలా చూసుకోండి. వివిధ రకాల కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.

10. రోజూ కార్డియో ఎక్సర్‌సైజులు చేయండి. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా కొలెస్ట్రాల్‌తో వచ్చే ముప్పుకు చెక్ పెట్టవచ్చనడంలో సందేహం లేదు!

11. మాంసాహారం తక్కువగా తినాలి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. మాంసాహారం బదులుగా చేపలు తీసుకోవచ్చు.